ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు అహం ప్రదర్శిస్తుంటాడు. ప్రతి వ్యక్తి నేను.. నాది.. ఇలా నిత్యం అనేక పర్యాయములు సంబోధిస్తుంటాడు. అసలు నేను అంటే ఎవరు.. నేను అనే జీవితానికి అర్దం ఉందా.. నేను అనే పదానికి అర్దం ఏమిటి.. వేదాలు ఏం చెబుతున్నాయి.. పురాణకాలం నాటి రాముడి నుంచి కలియుగంలో ఇప్పడు ఎంతో అభివృద్ది టెక్నాలజీలో కూడా ఒక మనిషిని అర్దం చేసుకోవాలంటే .. వారి లోపల ఉండే నేను అనే అహంలాంటి మనిషి గురించి అర్దం చేసుకోవాలి.
ప్రతి మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు మామూలుగా పైకి కనిపించేవాళ్లు. రెండోవారు బయటకు కనిపించకుండా లోపల వాళ్లకు మాత్రమే తెలిసిన వాళ్లు . రెండో వ్యక్తినే నేను అని అంటారు, నేను అంటు అహం .. అహంభావం..అహంకారంతో నేను అది చేశాను.. ఇది చేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు.
మనిషిలో ఉండే నేను అనే రెండో వ్యక్తిని ఆంగ్లంలో అహాన్ని ఊఏక్ష అంటారు . ఊ అంటే ఎడ్జిం గ్, ఏ అంటే గాడ్, క్ష అంటే అవుట్. మొత్తంగా ఊఏక్ష ఉంటే… ఎడ్జింగ్ గాడ్ అవుట్. అంతరంగంలో అంత: స్వరూపునిగా ఉన్న భగవంతుడ్ని, నీకు తెలియకుండానే బయటకు పంపివేస్తుంది అహంకారం. అహంకారం అంతటి ప్రమాదకరమైంది. అహంకారులు అహంభావులు ఎందరో యీ అహంకారం వల్లే నామ రూపాల్లేకుండా మసైపోయారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, దుర్యోధనుడు యిలా యో ధానుయోధులు ఎందరో నేను అనే అహం కారణంగానే ఎందుకూ కొరగాని వాళ్ళైపోయారు. మహామహులు వరాలు పొందామని కొందరు. ... తపస్సులు చేసి భగవదనుగ్రహం పొందామని కొందరు. ...నేను అనే అహంకారంతో అపారమైన బలం, అనంతమైన బలగం ఉన్నాయని కొందరు... యీ అహం కారణంగానే ఎందుకూ కొరవడక కొరగాని వాళ్ళయ్యారు. అస్తిత్వం కోల్పోయారు.
ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి. ఎటువంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి. ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.
శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను. కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను. అపుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు .
అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.
మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది. ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెల్లిపోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది. '' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో '' ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.
అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది ,'' అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.
మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము.
స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.
మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '.
అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు.
శాస్త్రీయంగా, రెండు వేర్వేరు మూలకాలు కలిసినప్పుడు, మూడవ సమ్మేళనం ఏర్పడుతుంది. శరీరం మరియు ఆత్మ కలిస్తే అహం కూడా ఇలాగే పుడుతుంది. అహం పోరాడినప్పుడు మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి -జ్ఞానోదయం సాధించవలసినది కాదు, అది జీవించడానికి మాత్రమే. ఈ అర్ధంలేనిదంతా మీరు మీతో ఆడే ఆట: మీరే దాక్కుంటున్నారు మరియు మీరే వెతుకుతున్నారు,
No comments:
Post a Comment