Monday, April 27, 2020

చరిత్రలో మిస్టరీ కథనం - తెల్లవాడు దోచింది ఎంత..?

(చరిత్రలో మిస్టరీ కథనం-)
రూ. 459,422,500,000,000ల కోట్లు..
తెల్లవాడు దోచింది ఎంత..?
◆ నిరాటంకంగా 426 ఏళ్ళ దోపిడీ.!
◆ వ్యాపార ముసుగు
◆ ఓ క్లర్క్ రూ. 210 కోట్ల చేతివాటం
◆ నాడు భారత్ వాటా 22.6
నేడు భారతదేశం ఓ పేద దేశం. ఒకప్పుడు ప్రపంచంలో మన దేశ సంపద వాటా 22.6%. అంటే నేటి భారతీయ కరెన్సీలో.. చూస్తే... ప్రతి పౌరుడికి కనీసం 4లక్షల యాభై వేల బ్యాంక్ బాలెన్స్ ఉంటుంది. ఇలా వైభవపేతంగా ఉండాల్సిన దేశం. 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ ఆర్థిక కిరీటంలో 'అత్యంత విలువైన వజ్రం'గా ఉండాల్సిన భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది'. మన దేశాన్ని ఎవరు.. ఏవిధంగా దోచుకెళ్ళారు. భారత్ దగ్గర ఆధారాలు ఉన్నాయా..? ఇంత అద్భుతమైన ఆర్థిక దేశం బీదదేశం అయింది. చరిత్రలో ఓ మిస్టరీ... నేటి కథనం.

ఇదీ భారత్ ఘనత:
భారత్ ఓ ప్రాచీన దేశం.
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు. కొలంబస్ తెలిపారు ప్రపంచానికి.!.
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు తెలిపారు ప్రపంచానికి.
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపారు ప్రపంచానికి.
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. 1700లో ప్రపంచంలో 22.6 శాతం సంపద ఉన్న దేశం భారతదేశం మాత్రమే. అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం. కానీ అది 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో 'అత్యంత విలువైన వజ్రం'గా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది". ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. అంతకు మందు 226 ఏళ్ళు, ఆంగ్లేయుల 200 ఏళ్ల దోపిడీలో భారతదేశానికి ఎంత నష్టం జరిగింది? ఈ విషయంపై చాలా మంది ఎన్నోరకాల అంచనాలు రూపొందించడానికి ప్రయత్నించారు. వీటిలో ఆర్థికవేత్త మెహనాజ్ మర్చంట్ పరిశోధనను ప్రముఖమైంది. దీని ప్రకారం 1757 నుంచి 1947 వరకూ ఆంగ్లేయుల వల్ల భారత్‌కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 2020, మార్చి 31, ఫారిన్ ఎక్ఛేంజ్ ప్రకారం 45 ట్రిలియన్ డాలర్లు (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం.. 459,422,500,000,000 కోట్ల రూపాయలు) అవుతుంది. 2015 వరకు లెక్కలు వేస్తేనే... ఒక్క దిల్లీ నుంచే కేవలం 173 మిలియన్ డాలర్ల (నాటి డాలర్ విలువ ప్రకారం.. 12,076,697,500 కోట్ల రూపాయల) దోపిడీ నిక్షేపంలా చేశారు.

ఇలాంటి బతుకు నుంచి:
నాడు ఇంగ్లండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి. దానిని ఒక చక్రవర్తితో, ఒక సామ్రాజ్యంతో పోల్చడం పెద్ద విషయం. నాలుగు వందల ఏళ్ల క్రితం 1618లో జరిగిన ఇరు దేశాల మధ్య ఒక ఒప్పంద పత్రంపై సంతకంతో సూరత్‌లో వ్యాపారం చేసుకోడానికి ఇంగ్లండ్ కు అనుమతి లభించింది.1608వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్‌ కు ఇంగ్లండ్ రాజు జేమ్స్1 కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తెరపైకి వచ్చింది. ఈ ఘటన చరిత్రలో ఒక మైలురాయి. మొఘల్ పాలకులు నేరుగా ఒక యురోపియన్ దేశంతో న్యాయసమ్మతంగా వ్యాపారం చేయడం అదే మొదటి సారి. అలా వారు ఆ కంపెనీని ప్రోత్సాహించారు. 1498లో వాస్కోడిగామా దక్షిణ మూలల నుంచి భారత్‌ ను సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు జోడించాడు. తర్వాత దశాబ్దాలపాటు వేధింపులు, బెదిరింపులు, అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీసువారు పైచేయి సాధించేలా చేశాడు. తర్వాత మెల్లమెల్లగా వారు భారత్‌ పైనే పట్టు సాధించారు.

డచ్... ఈస్ట్ ఇండియా ఇలా.:
వ్యాపారం ముసుగు మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు, నౌకాదళంతో భారతదేశంలోకి అఢుగుపెట్టారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ దేశాలు భారత చరిత్రనే తలకిందులు చేశాయి. ఇదంతా ఇంగ్లండ్ ఓపిగ్గా గమనించింది. అయినా అలాంటి సమయంలో ఎందుకు వెనక్కుతగ్గాలి అనుకుంది. అంతే క్వీన్ ఎలిజబెత్ ఆ రెండు దేశాల అడుగుజాడల్లో 1600 డిసెంబర్‌లో భారత్‌ లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఆసియా దేశాలతో వ్యాపారానికి పూర్తి హక్కులను పొందింది.

ఇలా మొదలేసి...:
మొఘలుల నుంచి అనుకూల ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారతదేశ తీరంలోని వివిధ నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలు స్థాపించడం ప్రారంభించారు. వాటిని ఫ్యాక్టరీలుగా పిలిచేవారు. ఈ ఫ్యాక్టరీల్లో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తువుల వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో వారికి కళ్లుచెదిరే లాభాలు వచ్చాయి. కానీ ఆ లాభాలు వారిని వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయి.

పాస్లీ యుద్దం:
దేశమంతటా వ్యాపిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్. తన మూడు వేల మంది సిపాయిలతో, 50 వేల మంది సైన్యంతో వచ్చిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించాడు. సిరాజుద్దౌలా దగ్గర శతాబ్దాల నుంచి కూడబెట్టిన ఖజానాను ఉన్నది ఉన్నట్టే సముద్రంలో సిద్ధంగా ఉన్న పడవల్లో నింపి క్లైవ్ లండన్ చేర్చాడు.

రూ. 210 కోట్లు నొక్కాడు..:
క్లైవ్ భారత్ నుంచి ఎత్తుకెళ్లిన మొత్తం సంపదను రాయల్ ఖజానాలో జమ చేయలేదు. తన కోసం కొంత నొక్కేశాడు. దాని విలువ ఈనాటి విలువతో పోలిస్తే మూడు కోట్ల డాలర్లు అంటే జస్ట్ రూ.210 కోట్లు ఉంటుంది. ఈ డబ్బుతో క్లైవ్ బ్రిటన్‌లో ఒక భారీ భవంతిని నిర్మించాడు. చుట్టూ భూములు కొన్నాడు. వాటికి ప్లాసీ అని పేరు పెట్టాడు. అంతే కాదు, ఆయన డబ్బు పెట్టి తన కోసం, తన తండ్రి కోసం పార్లమెంటు సీట్లు కూడా కొన్నాడు. తర్వాత క్లైవ్‌కు సర్ టైటిల్ కూడా ఇచ్చారు.
అతగాడు నల్లమందుకు బానిసగా మారి 1774లో తన గదిలో అంతుపట్టని స్థితిలో చనిపోయి కనిపించాడు. ఇది హత్య, ఆత్మహత్య అనేది ఓ మిస్టరీ.

ఆ రాజుకు భృతి:
1803 ప్రారంభంలో దిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి బదులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంత కథ నడిపించిందంటే, ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ కంపెనీ లండన్‌ లోని ఒక ప్రాంతంలో ఒక చిన్న భవనంలో పనిచేస్తుండేది. దాన్ని స్థాపించిన ఒక శతాబ్దం తర్వాత కూడా దానిలో పనిచేస్తున్న శాశ్వత సిబ్బంది 35 మంది మాత్రమే. అయినా, ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీకి లేనంత బలాన్ని ఇది సంపాదించింది.

ఇలా చుట్టేసింది:
1818లో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల్లోనే సిక్కులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని అంతా, అంటే ప్రస్తుత పాకిస్తాన్‌ ను కూడా తన పట్టులోకి తెచ్చుకుంది. ఖైబర్ నుంచి బర్మా, హిమాలయాల పర్వతాల వరకూ తన సామ్రాజ్యం స్థాపించింది. 1857లో ఆ కంపెనీ తమ దగ్గరే జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచే తిరుగుబాటు ఎదుర్కొంది. చివరకు 1874, జూన్1న 275 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ కంపెనీ రద్దయ్యింది. అనంతరం 1920 నుంచి 1947 భారత్ నుంచి వెళ్లిపోయేటప్పుడు, ఆంగ్లేయులు... వజ్ర, వైఢూర్యాలు, ఇతర బంగారు నగలు, అమూల్యమైన సంపదను... 890 పెద్ద ఓడలలో దఫ, దఫాలుగా బస్తాలలో కుక్కుకొని మరీ వెళ్ళారు. ఈ సంపదను లెక్కిస్తే... 2020, మార్చి 31, ఫారిన్ ఎక్ఛేంజ్ ప్రకారం 45 ట్రిలియన్ డాలర్లు (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం.. 459,422,500,000,000 రూపాయలు) అవుతుంది. అనధికారికంగా తరలిన సొమ్ము ఇప్పటికే కాదు. ఎప్పటికీ చరిత్రలో మిస్టరీనే.

తెల్లోడి హంగామా.. భారత్ పెట్టిన భిక్ష:
ఈరోజు తెల్లవాడు సకల సంపదలతో ఉన్నాడంటే... అది భారతదేశం పెట్టిన భిక్ష. వాడు వేసుకునే 'టక్కూ..టై' మన డబ్బులతో కొనుక్కున్నదే.!

చివరిగా:
ఇక్కడ చెప్పిన లెక్క కేవలం అధికారిక సమాచారం మాత్రమే. ఈ సంపద కాకుండా మరెంతో బంగారం, కోహినూర్ లాంటి వజ్రాలు వందలాది కిలోల రూపంలో తెల్లవాడు దర్జాగా దోచుకెళ్ళాడు. ఈ సంపద మొత్తం.. మన దేశంలో ఉన్నట్లయితే... ప్రతి పౌరుడు పుట్టకతో లక్షాధికారి. తెల్లోడు దోచుకెళ్ళిన దాంట్లో మన నల్లోడు దోచుకునేది పెద్ద లెక్కలోది కాదు. జీతే రహో పొలిటికల్ బిడ్డా.!

Box:

ఇదీ మనం గర్వించదగ్గ భారత దేశం
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు భారతదేశం వయసు ఇదీ మన భారత్ గొప్పతనం.
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం..
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే.!వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు" మిగిలాయి

ఇదీ గొప్పతనం:
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు. ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు. ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు.
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"దేశం-భారత దేశం"

ఆక్రమణ.చేయని దేశం:
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి... నేటికి..."శాంతికి నిలయ దేశం- భారతదేశం"

ఈజిప్ట్ ఇలా..:
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది.

7-8 ఏళ్ళలోనే...:
రోమ్ మీద కేవలం 7, 8 సంవత్సరాల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది.

భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?:
శకులు, తురష్కులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు 426 ఏళ్ళు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !?

మమేకమైన సంస్కృతి:
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం.

మరీ దేశభక్తుల విషయం..:
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరి తీయబడిన వారు మాత్రమే !

ముగింపు..:
'మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా.? ఉండదు. ఎక్కడ ఉంటుంది' అంటే 'ఆక్స్ ఫర్డ్ లైబ్రరీ'లో ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి.!
మేరా భారత్ మహాన్. జైహింద్....

సేకరణ

No comments:

Post a Comment