Monday, April 27, 2020

గీత అనేది కృష్ణునునికి, అర్జునునికి మధ్య జరిగిన వ్యక్తిగత సంవాదము. కానీ మీరు మీ గీతా ప్రవచనాలలో సమూహాన్ని సంభోదిస్తున్నారు. అలా చేయవచ్చునా?

గీత అనేది కృష్ణునునికి, అర్జునునికి మధ్య జరిగిన వ్యక్తిగత సంవాదము. కానీ మీరు మీ గీతా ప్రవచనాలలో సమూహాన్ని సంభోదిస్తున్నారు. అలా చేయవచ్చునా అనేది వివరించండి.

నేను సమూహాన్ని సంభోదిస్తున్నాను అని ఎవరన్నారు? సమూహం అనేది ఒక శబ్దము. ఇక్కడ నేవున్నావు. నీతోపాటు ఇంకా చాలామంది ఉన్నారు. సమూహం అనేది ఏదీ లేదు. వ్యక్తిగత రూపంలో మీరు విడివిడిగా వున్నారు. నీవు నేను చెప్పేదాన్ని ఏ విధంగా అర్ధం చేసుకుంటున్నావో, ఆ విధంగా నీవు మాత్రమే అర్ధం చేసుకోగలవు. నీ పక్కన కూర్చున్నతను మరొకలా అర్ధం చేసుకోవచ్చు. మనం దేనిని వినగలమో, దానినే వింటాము. మన లోపల ఏది దాగి వుందో, దాని నుండే మనకి అర్ధం ఉద్భవిస్తుంది. నేను చెప్పడం వలన కానీ, కృష్ణుడు చెప్పడం వలన కానీ, కలిగే ప్రయోజనం ఏమిటంటే మేము చెప్పడం తక్కువ, మేలుకొలపడం ఎక్కువ ఉంటుంది.

సమూహం గల ప్రపంచంలో వ్యక్తికి ఎటువంటి విలువ ఉండదు. రాజ్యము సమూహం తోనే నడుస్తుంది. బజారు సమూహం తోనే నడుస్తుంది. అక్కడ గుంపుకి సంబంధించిన ప్రశ్నలు వుంటాయి. మీరు సత్యసంధులైనా, ఒంటరిగా ఉంటే ఓడిపోతారు. అసత్యమైన వారు గుంపులు, గుంపులుగా ఉంటే, వారే గెలుస్తారు. అక్కడ సంఖ్యాబలానిది గెలుపు.

ఇక రెండవ యాత్ర, ప్రేమ యాత్ర. ఇది ఇద్దరి మధ్య సాగే యాత్ర. ప్రేమ ఏకాంతాన్ని కోరుకుంటుంది. తాము ఇద్దరమే ఉండాలని వారికి అనిపిస్తుంది. ఇద్దరు వున్నప్పుడు అది సమూహం కాదు. మూడవ వ్యక్తి వస్తే అది సమూహమవుతుంది.

తరువాత మరో యాత్ర ఉంది. దానిని నేను పరమాత్మ యాత్ర లేదా ప్రార్ధన యొక్క యాత్ర అని అంటాను. అక్కడ రెండవ వాడు కూడా ఉండడం జరుగదు. ఒకవేళ ఈ యాత్రలో ప్రేయసీ, ప్రియులు కలిసి ధ్యానం చేసారనుకోండి, ఇద్దరూ విడివిడిగానే వుంటారు కానీ, కలిసి వుండరు. అక్కడకి ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుంది. మనం ఎప్పుడు పరమాత్మ గురించి చర్చ చేస్తామో, అప్పటిదాకా ప్రేమ అనే ప్రపంచం వుంటుంది. ఎందుకంటే చర్చలో చేసేవాడు, వినేవాడు ఇద్దరూ వుంటారు. గుంపులో చెప్పడం ఉండదు. జనాలకి వారి వారి మాటలు ఉంటాయి. ఎవరూ, ఎవర్నీ వినడం ఉండదు.

ఎప్పుడు మీరు గురువు దగ్గరకు వస్తారో, అప్పుడు సంసారం మీకు వ్యతిరేకంగా వచ్చి నుంచుంటుంది. సంసారం అన్ని రకాల బాధలను మీ ముందు ఉంచుతుంది. మీకు గురువుతో సంబంధం ఏర్పడగానే, ఈ సంసారం మిమ్మల్ని లాగాలని ప్రయత్నిస్తోంది అని మీరు గ్రహిస్తారు. అది స్వాభావికం. గురువు ఏది చెప్తాడో అది ప్రేమతో మొదలై పరమాత్మ తో ముగుస్తుంది. ప్రారంభం ఇద్దరితో మొదలై, ముగింపు ఒకరితో అవుతుంది.

ఎవరు సంసారంలో విసుగు చెందారో వారే గురువు దగ్గరకు రాగలుగుతారు. ఎవరు ప్రేమలో కూడా విసుగు చెందారో, వారే గురువుతో వుండగలుగుతారు.

No comments:

Post a Comment