Sunday, April 26, 2020

సాధకునికి,,, తాను కాక ఈ ప్రపంచంలో రెండవది ఏదీ లేదు అని తెలిసినప్పుడు...

ఒక సాధకునికి,,, తాను కాక ఈ
ప్రపంచంలో రెండవది ఏదీ
లేదు అని తెలిసినప్పుడు
అతని సాదన ముగిసిపోతుంది...

అప్పుడే అతను తనతో తాను ఆడడం ,,,
అప్పుడే తనతో తాను పాడడం,,,
తనతో తాను సంభాషించడం,,,
తనతో తాను ఏకమైపోవడం,,,,
తనతో తాను రమించడం,,,,
తనతో తాను ఉండడం,,,
సంభవిస్తుంది...

అంతరానికి,,, బహిర్ తత్వానికి మధ్య అ0తరం
ముగిసిపోతుంది....లోపలఅనీ బయటఅనీ,,,వేరు
వేరుగా లేవని తెలుసుకుంటాడు....

అప్పుడే శరీరంలో ప్రతికణం ప్రాణశక్తిని ఏ ఒత్తిడీ లేకుండా ,,
అనుభవిస్తుంది...ఈ ప్రక్రియ ద్వారా శరీరం ""ఆధ్యాత్మిక శరీరం""గా రూపాంతరం చెందుతుంది..

అప్పుడే మనస్సు,, బుద్దియొక్క సంకేతాలను గతం మరియు భవిష్యత్తు యొక్క ఆలోచనలతో కలుషితం కాకుండా
ఆధ్యాత్మిక మనస్సు గా ( శూన్య మనస్సు ) రూపాంతరం చెందుతుంది...

అప్పుడే బుద్ది తన అజ్ఞానాన్ని నిర్మూలించుకుని
ఇంగితజ్ఞానం నిండిన చైతన్యాన్ని నింపుకున్న
ఆధ్యాత్మిక బుద్ధిగా రూపాంతరం చెందుతుంది...

అప్పుడే ఆత్మ ఏ మసకలూ ,,,,దుమ్మూ అడ్డంగా లేని అద్దం లాగా విరాజిల్లుతుంది పారదర్శకంగా విరాజిల్లుతుంది...

No comments:

Post a Comment