Wednesday, November 18, 2020

నిత్యజీవితంలో ధ్యానం, 3.డైనమిక్ మెడిటేషన్ (సక్రియ ధ్యానం)

🧘🏼‍♀️ నిత్యజీవితంలో ధ్యానం
🧘🏼‍♀️ 3.డైనమిక్ మెడిటేషన్ (సక్రియ ధ్యానం)🧘🏼‍♂️

🔺 ఉదయం సమస్త ప్రకృతి సజీవంగా మారుతుంది. రాత్రి వెళ్ళిపోతుంది, చీకటి ఉండదు, సూర్యుడు వస్తాడు. ప్రతిదీ చైతన్యంతో, చురుగ్గా ఉంటుంది. ఎక్కడైతే నువ్వు ఎడతెగని చురుకుదనంతో, స్పృహతో, మెలకువతో ఉంటావో, ఏ పని చేసినా వీటిని వదలకుండా ఉంటావో అదే ధ్యానం. అక్కడ మీరు సాక్షిగా మిగులుతారు. మిమ్మల్ని మీరు కోల్పోరు.

🔺 మిమ్మల్ని మీరు కోల్పోవడం సులభం. మీరు శ్వాసించే టప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు. శ్వాసతో పాటు మీరు లీనమైతే మీరు సాక్షిగా మిగలడాన్ని విస్మరిస్తారు.

🔺 వేగంగా శ్వాశించండి వీలైనంత గాఢంగా మీ సంపూర్ణ శక్తిని కేంద్రీకరించి శ్వాసించండి. కానీ అప్పుడు కూడా సాక్షి గా ఉండండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీరు చూసే వారుగా ప్రేక్షకులుగా ఉంటే అదంతా ఎవరో ఇతర వ్యక్తులకు సంబంధించిందిగా వస్తుంది. సమస్త విషయము శరీరంలో జరుగుతున్నట్లు మీ చైతన్యం కేంద్రీకరించబడి చూస్తూ ఉంటుంది. మూడు దశల్లో ఈ సాక్షి అన్నది సంభవిస్తుంది. అప్పుడు ప్రతిదీ ఆగిపోయి నాలుగో దశలో మీరు నిశ్చలంగా గడ్డకట్టి ఉన్నట్లు ఈ చురుకుదనం దాని శిఖర స్థాయికి చేరుతుంది.
🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment