Friday, November 20, 2020

ఒక మేనేజ్‌మెంట్ సెమినార్‌లో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ చెప్పిన తన జీవితానుభవం!

ఒక మేనేజ్‌మెంట్ సెమినార్‌లో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ చెప్పిన తన జీవితానుభవం!

ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి పిక్నిక్ కోసం ఉత్తర ప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నారు. దారిలో, పిచ్చుక గూళ్ళతో నిండి సందడిగా ఉన్న ఒక పెద్ద మామిడి తోటను వాళ్ళు చూశారు.

శేషన్ గారి భార్య రెండు పిచ్చుక గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది.

ఆమె అడిగిందే తడవుగా, పొలాల్లో ఆవుల్ని మేపుతున్న ఒక బాలుడ్ని పోలీసుల ఎస్కార్ట్ పిలిచి, గూళ్ళను దించాలని డిమాండ్ చేశారు. పిచుక గూళ్ళను తీసినందుకు 10 రూపాయలు చెల్లిస్తామని ఆ పిల్లాడ్ని ఆశ పెట్టారు. కానీ ఆ బాలుడు అందుకు ససేమిరా అన్నాడు. వారి ఆదేశాన్నినిరాకరించాడు. దీనితో మరి కొద్దిగా రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామని శేషన్ బాలునితో అన్నారు.
శేషన్ పెద్ద అధికారి కావడంతో పోలీసులు బాలుడ్ని పిచ్చుక గూళ్ళు చెట్టు పైనుంచి దింపమనీ వత్తిడి చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వారి బలవంతపు ప్రయత్నం ఆదేశంలా మారిపోయింది. ఆ బాలుడు శేషన్, అతడి భార్యతో ఇలా అన్నాడు. "మీరు 50 రూపాయలే కాదు. ఎంత ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోను పిచుక గూళ్ళను తీసి ఇవ్వలేను సాబ్జీ. నాకు మీ పైసలు అక్కర్లేదు." అంటూ ఎంతో ధీమాగా చెప్పాడు. అంతే కాకుండా "ఆ పిచుక గూళ్ళను తొలగిస్తే ఆ గూళ్ళ లోపల, పిచ్చుకల పిల్లలు ఉంటాయి, నేను మీకు ఆ గూళ్ళు ఇస్తే అందులో ఉన్న పిచుక పిల్లలు ఏమవుతాయి? అవెక్కడుంటాయి? అలాగే ఈ సాయంత్రం వాటి తల్లి పిచ్చుక తన పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు తన పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి ఎంతగా తల్లడిల్లి పోతుందో, ఏడుస్తుందో ఆలోచిస్తే నాకే కాదు మీలాంటి సదువుకున్న వాళ్లకు కూడా మాటలు రావు. ఇలాంటి పాపపు పనిచేసి ఆ తల్లి పిచుకకు, ఇంటికెళ్లాక మా అమ్మకు నేను మొహం ఎలా చూపించగలను? ఆ పిచుక పిల్లల, తల్లి బాధ చూడటానికి నాకు గుండె ధైర్యం లేదు."
ఇది విన్న శేషన్, అతని భార్య షాక్ అయ్యారు.

"నా స్థానం, హోదా, నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవుల్ని కాస్తున్న బాలుని ముందు కరిగిపోయాయి" అంటూ శేషన్ చెప్పారు. "నేను అతని ముందు ఈదురుగాలికి కొట్టుకుపోయే ఆవపిండిలా ఉన్నాను. ఆ బాలుడు నా కళ్ళు తెరిపించాడు. ఫలితంగా మా కోరికను వదులుకున్నాం. తిరిగి వచ్చిన తరువాత, ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది. విద్య యొక్క స్థానం, సాంఘిక స్థితి మానవత్వం యొక్క కొలతకు ఎప్పుడూ గజ స్టిక్ (స్కేల్) కానే కాదు అనే చావులేని నిజాన్ని జీవితంలో మొదటిసారి, ఏ మహోన్నత గ్రంధాలు రిఫర్ చేయకుండా, ఏ మహాత్ముని బోధలు వల్లెవేయకుండా, సుదీర్ఘమైన జప ధ్యానాలూ చేయకుండా తెలుసుకున్నాను."

విజ్ఞానం అనేది ప్రకృతిని తెలుసుకునేందుకు, సమగ్రమైన, మానవ జాతికి, సమస్త ప్రకృతికీ ఉపయుక్తమైన సమాచారాన్ని సేకరించేందుకు, అంతరించని విలువలను తెలుసుకునేందుకు, ఆచరించేందుకు పనికొచ్చే ఒక జ్ఞాననేత్రం లాంటిది! ప్రక్కవాడి కొంప కూల్చకుండా, సాటివాడు కూడా సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడినప్పుడే అలాంటి జ్ఞాననేత్రానికి ఒక విలువ ఉంటుందని ఆ బాలుడు నాకు ఆచరణలో నేర్పాడు" అని శేషన్ అన్నారు. ఆచరణ యోగ్యత లేని జ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా, అవి కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. అలాంటి కార్యాచరణ లేని జ్ఞానంతో ఏమి చేసినా ఉపయోగం లేదని , తద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు.. మీకు, మాకు, అందరికి సద్భావం, సరైన జ్ఞానం మరియు దాని కార్యాచరణ ఉన్నప్పుడు అందరి జీవితం ఆనందంగా మారుతుందని చెప్పారు.

అప్పట్లో శేషన్ పేరు వింటేనే కాకలు తీరిన బడా రాజకీయ నాయకుల వెన్నులో వణుకు వచ్చిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.

ఎవరైనా ఏదైనా ఇస్తే ఆశపడటం, తీసేసుకోవడం, దాచుకోవడం నేటి మనుషుల అలవాట్లు. కానీ ఇలాంటివి ఏమాత్రం తెలియని ఆ బాలునికి తాను కొన్ని గొప్ప, ఆదర్శ ప్రాయమైన విలువల్ని పాటిస్తున్నానని కూడా తెలీదు. అలాంటి ఉన్నత విలువల్ని ప్రస్తుత ప్రపంచం ఎప్పుడో మరచిపోయింది. అవి ఉతృష్టమైన మానవ విలువలని మనం అనుకుంటున్నా, ఆ బాలునికి మాత్రం అదేమి తెలియదు. శేషన్ అయినా, మరెవరైనా ఆబాలుని దృష్టిలో ఒకటే. భారత రాజ్యాంగం అంటే ఏమిటో, ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరో, ఆ బాలుడికి తెలీదు. తెల్సినదల్లా ఒక్కటే, నిజాన్ని నిజంగా చెప్పగల్గడం!

మన భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాధమిక హక్కులు, విధులు,ఆదేశ సూత్రాలూ, స్వేచ్ఛ, సమానత్వం లాంటివి కేవలం లైబ్రరీల్లో మూలనపడి, దుమ్ము కొట్టుకుని, కొత్త ముద్రణ కు నోచుకోని పాత గుర్తుల్లాంటి పుస్తకాల్లో పరిమితమైన ఈ కాలపు అవ్యవస్థలో, భారత న్యాయవ్యవస్థ ముందు పేద, ధనిక, హోదా అనే ఎటువంటి బేధాలు ఉండవని, చట్టం ముందు అందరూ ఒక్కటే అనికూడా తెలీని ఒక ముక్కుపచ్చలారని అమాయక బాలుడి నమ్మిక ఏమిటో తెల్సునా? దేవుని దృష్టిలో అన్ని జీవులూ సమానమే! సాటి జీవులపట్ల భూతదయ కలిగి ఉండాలి. ఇవే ఆ బాలుని నమ్మకాలు! కనుకనే బాలుడు అంత నిక్కచ్చిగా, ధైర్యంగా, అంత మంది పోలీసుల్నీ, అధికార యంత్రాంగాన్ని చూసి కూడా జంకకుండా, తన మాటను స్పష్టంగా చెప్పగలిగాడు.

ఎవరో ఒక కవి ఏదో పాత సినిమా పాటలో - " పిల్లలూ,దేవుడూ చల్లనివారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే!" అనే వెదజల్లిన అద్భుతమైన సత్యాన్ని మనం ఈ సంఘటన లో దర్శించవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment