Thursday, November 19, 2020

పోటీతత్వం....

పోటీతత్వం.....

ఒకరిని ఒకరు అనుసరిస్తూ, మెలకువలను అలవరచుకుంటూ ముందుకు వెళ్ళడమే పోటీ. అన్ని రంగాలలో పోటీ తత్వం అనేది సహజం. సాయశక్తులా కృషి చేసేందుకు, తపన సన్నగిల్లకుండా ఉండేందుకు, ప్రయత్నంలో తీవ్రతను తీసుకువచ్చేందుకు ఈ పోటీ తత్వం అనేది మనకు సహకరిస్తుంది.

కానీ, కాలక్రమేణా పోటీ తత్వం యొక్క వాస్తవిక అర్ధమే మారిపోయింది. మనస్సులో ఉత్సాహాన్ని తీసుకురావాల్సిన పోటీ ఈర్ష్యా ద్వేషాలకు కారణం అవుతుంది. ఇతరులను అనుసరిస్తూ తాను ముందుకు వెళ్లడం కాక, తాను ఉన్న చోటినే ఉంటూ ముందుకు వెళ్ళే వారిని పడేయడం లేదా విఘ్నాలు సృష్టించి ఆనందించడమే పోటీగా మారింది. ఇతరులు మరియు వారితో పాటు నేను కూడా విజయం పొందాలి అనే భావన కోల్పోయి, నేను గెలవకపోయినా పర్వాలేదు ఇతరుల ఓటమిలోనే తన విజయం ఉందని భావించడం పోటీగా మారింది. తన ఉన్నతికై ప్రయత్నించక, ఇతరుల పతనానికై పాటుపడేలా మారింది పోటీ.

ఇతరులను అనుసరించండి, వారి వలే, లేక వారి కంటే ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నించండి....కానీ, నేనే ముందు ఉండాలి,ఉన్నతంగా ఉండాలి అని అనుకుంటూ, ఇతరుల నాశనమే మన విజయానికి సోపానమని తలంచి అదే పోటీతత్వం అని మాత్రం భావించకండి.

ఆరోగ్యకరమైన పోటీతో స్వయం ముందుకు వెళ్తూ ఇతరులు ముందుకు వెళ్లేందుకు సహయోగం ఇవ్వడంలోనే ఆనందం ఉందని గ్రహించండి.

ఓం శాంతి🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment