Thursday, November 19, 2020

నిత్యజీవితంలో ధ్యానం, నాట్యంలో లీనమై ఇవ్వండి

🧘🏼‍♂️ నిత్యజీవితంలో ధ్యానం
💃🏼 నాట్యంలో లీనమై ఇవ్వండి💃🏼

🔺 కాబట్టి ఏం చేయాలి? సంపూర్ణంగా నాట్యంలో ఉండండి. మీరు సంపూర్ణంగా దానిలో లేనప్పుడే విభజన ఉంటుంది. మీరు పక్కన నిలబడి మీ నాట్యాన్ని చూడండి. అప్పుడు ఇంకా తేడా ఉంటుంది. విభజన అలాగే ఉంటుంది. మీరు నర్తకులు, మీరు నాట్యం చేస్తున్నారు. అప్పుడు నాట్యం అన్నది ఒక పని అవుతుంది. మీరు చేసే పని. అది మీ అస్తిత్వం కాదు. కాబట్టి పూర్తిగా దాంట్లో లీనమై పోండి. కరిగి పోండి. నిలబడ వద్దు, పరిశీలకుడిగా ఉండవద్దు. దాంట్లో కలిసి పోండి.

🔺 నాట్యాన్ని దానంతట అదే సగం ఇయ్యండి. దాన్ని నిర్బంధించ కండి. గుర్తుంచుకోండి. అనుసరించండి. దానంతట అది జరగడానికి అనుమతించండి. అది చేసేదే కాదు, జరిగేది. ఉత్సవం జరుపుకుంటున్న మూడు లో ఉండండి. మీరు ఏదో సీరియస్ గా చేయడం లేదు. మీరు కేవలం ఆడుతున్నారు. మీ జీవన శక్తి తో ఆడుతున్నారు. శారీరక శక్తి తో ఆడుతున్నారు. దానంతట అది సాగడానికి అనుమతించండి. జాలి వేసినట్లు, నది ప్రవహించినట్లు నాట్యాన్ని సాగనీ యండి. మీరు ప్రవహిస్తున్నా రు, వీస్తున్నారు. దాన్ని అనుభూతి చెందండి.

🔺 ఉల్లాసంగా ఉండండి. ఆటలాడుతూ అన్న మాటని గుర్తుంచుకోండి. ఎప్పుడూ మర్చిపోవద్దు. నాతో ఉంటే అది మౌలికమైన సంగతి. మనదేశంలో సృష్టిని దేవుడి లీల అంటారు. అంటే దేవుడి ఆట. దేవుడు ప్రపంచాన్ని సృష్టించలేదు. ఇది ఆయన ఆట.
🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment