Thursday, August 11, 2022

❤️ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ । ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః(భగవద్గీత 6-5)

 ❤️ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ । 
 ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః(భగవద్గీత 6-5) 
💕 నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. 
🌺 మన ఉన్నతికైనా, పతనానికైనా మనమే కారణం. 
 ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. 
 ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఎవరికి నిద్రవస్తే వారే నిద్రపోవాలి.ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి 
 ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. 
💕 మన కోసం వేరెవ్వరూ భగవత్ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకు మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి. 
💕 మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి. 
 మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి. 
 ధ్యానంలో నిమగ్నమై ధ్యానకర్మ చేసుకుంటూ వుండాలి.తద్ద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ వుంటుంది. 
 అప్పుడు … ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది. 
💕 అలా కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నామంటే …మన ఆత్మను మనమే అవసానదశకు తీసుకువెళ్తున్నట్టు. అలాంటప్పుడు మనకు మనమే శతృవులం 
❤️ మన నోటిలోని మాటే, మన నుదుటి మీద వ్రాత ! 
❤️ మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ వుంటాయి. 
💕మన ఆలోచనలతోనే,
💕మన మాటలతోనే,
💕మన చేతలతోనే,
🌺మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము….
దిగజార్చుకుంటున్నాం.
💕ప్రతి క్షణాన్నీ పిండుకోవాలి!
💕సద్వినియోగం చేసుకోవాలి!!
❤️ ఈ జన్మకు ముందు మనకుఎన్నెన్నో జన్మలు గడిచాయి. 
 అనంతమైన పూర్వ జన్మలలో చాలా సార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను కలిసేఉంటాము. అయినా భగవత్ ప్రాప్తి పొందలేక పోయాము. ఆధ్యాత్మిక పురోగతి పథంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఇతరులను అందుకు కారణంగా చూపుతాము. ఇతరులే మనకు శత్రువులని ఫిర్యాదు చేస్తాము. 
❤️ కానీ మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించేది నిస్సందేహంగా మన మనస్సే. 
❤️ ఒక మిత్రునిగా ఉపయోగించుకోవటానికి మనస్సు యొక్క పనితీరుని అర్థం చేసుకోవాలి. మన మనస్సు నాలుగు స్థాయిల్లో పని చేస్తుంది. 
1) మనస్సు:  
ఆలోచనలు సృష్టించినప్పుడు…దాన్ని ‘మనస్సు' అంటాము.
2) బుద్ధి :  
ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు …దానిని 'బుద్ధి' అంటాము.
3) చిత్తము :  
ఒక వస్తువుతోనో, వ్యక్తితోనో అనుబంధం ఏర్పరుచుకున్నప్పుడు దానిని చిత్తము అంటాము.
4) అహంకారము :  
ఎప్పుడైతే అది శరీరానికి సంబంధించిన వాటితో అనుసంధానమై - సంపద, హోదా, అందము, చదువు వంటి వాటి పట్ల గర్వం పెంచుకుంటుందో అప్పుడు దానిని అహంకారము అంటాము.
❤️ ఇవన్నీ నాలుగు వేరు వేరు అస్థిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క నాలుగు నిర్వహణా స్థాయిలు. 
💕 అహంకారము' (ఇగో , ego ) అన్న పదం ఇక్కడ Freudian psychology లోచెప్పిన దాని కన్నా వేరైనది. సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856 – 1939), అనే ఆస్ట్రియాకు చెందిన నాడీశాస్త్ర నిపుణుడు, మనస్తత్వశాస్త్రం యొక్క మొదటి సూత్రాన్ని, మనస్సు ఏ విధంగా పని చేస్తుందో ప్రతిపాదించాడు. ఆయన ప్రకారం, అహంకారము అనేది 'నిజమైన నేను'; అది వశములో లేని కోరికలకు (Id), బాల్యంలో నేర్చుకున్న విలువలకు (Superego) మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిస్తుంది. 
💕 వైదిక వాజ్ఞయంలో చాలా చోట్ల సందర్భాన్ని బట్టి మనస్సుని ఈ నాలుగు రకాల అర్థాల్లోవాడుతారు. 
🌺 ఇవన్నీ ఒకే అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తున్నాయి, వీటిని కలిపి అంతఃకరణ లేదా మనస్సు అంటారు. 
❤️ ’పంచదశీ’ఈనాలుగింటిని కలిపి మనస్సు అంటుంది.ఇదే భౌతిక బంధానికి మూల కారణం అని పేర్కొంటుంది. 
❤️ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎన్నో సార్లుమనస్సు, బుద్ధి రెండు ఉంటాయని, అవి రెండింటినీ కూడా భగవంతునికి శరణాగతి చేయాలి అని చెప్పారు. 
❤️ ”యోగ దర్శనము”లోప్రకృతి యొక్క వివిధ మూలతత్వములను విశ్లేషించేటప్పుడు అది మూడు అస్థిత్వాలను పేర్కొంటుంది: మనస్సు, బుద్ధి,అహంకారము. 
❤️ శంకరాచార్యులు ఆత్మకు అందుబాటులో ఉన్న ఉపకరణాలను విశదీకరిస్తూ మనస్సుని నాలుగు రకాలుగా విభజించారు - మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 
🌺 ”మనస్సుని ఉపయోగించుకొని ఆత్మోధ్ధరణ చేసుకోవాలి”అని గీతాచార్యులు చెప్పారంటే “బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి.”అన్నారని అర్థం 
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః  

No comments:

Post a Comment