Life Change Messages Every Day 6pm In Light Workers Group
🔺 పత్రీజీ సమాధానాలు🔺
🌹 చాప్టర్ --7:--- మరింత శక్తివంతమైన ధ్యానం 🌹
🍁 ప్రశ్న :--- మనం ఆనాపానసతి సాధన చేస్తున్నాం కదా ! కాయానుపస్సన, వేదనానుపస్సన, చిత్తానుపస్సన, ధమ్మానుపస్సన, విపస్సన వీటి గురించి కూడా వివరించండి. బుద్ధుడు వాటి గురించి ఏమి చెప్పారు?
🍀 పత్రీజీ :--- కాయం అంటే భౌతిక శరీరం లేదా ప్రాణమయకోశం అనుకోవచ్చు. వేదన అంటే భావోద్వేగాలు, చిత్త అంటే మనస్సు, ధమ్మ అంటే ధర్మం. ‘అను’ అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా (సాక్షిగా) 'పశ్శన' అంటే చూడటం, గ్రహించటం, శ్రద్ధ పెట్టటం.
🌸 ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని సాక్షీభూతంగా గమనించాలే కానీ అతిగా కానీ, అల్పంగా కానీ ప్రతి స్పందించకూడదు. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదు. శరీరం గురించి ఆందోళన చెంద వద్దు. అదే కాయానుపస్సన.
🌿 ధ్యానంలో కూర్చున్న కాసేపటికి మన అంతరంలో ఏవేవో భావనలు, ఉద్వేగాలు వెల్లు వెత్తుతూ ఉంటాయి. వాటిని కేవలం సాక్షిగా గమనించాలే కానీ అందులో మునిగి పోకూడదు. అవి వాటి మానాన అవి వచ్చి పోతాయి. అదే వేదనానుపస్సన.
🌳 ధ్యానం చేయటం మొదలు పెట్టిన తర్వాత మన ఆలోచనల్లో ఎంతో మార్పు కనిపిస్తూ ఉంటుంది. వేటిని అతిగా పట్టించుకోకూడదు. మనస్సులో ఎన్నో విధాలైన మార్పులు, వాటి పర్యవసానాలు మనస్సును, అయోమయానికి గురి చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అతిగా ప్రతి స్పందించకూడదు. సాక్షి తత్వాన్ని వీడకూడదు అదే చిత్తానుపస్సన.
🏵️ ధ్యానం మొదలు పెట్టిన వెంటనే హాలాహలం వస్తుంది. చివరాఖరికి అమృతం వస్తుంది. ఈలోగా హాలాహలం గురించి ఆలోచించి, విచారించి బాధపడకూడదు. వేటి గురించీ అతిగా పట్టించుకోకూడదు.
🌴శరీరంలో మార్పులు వస్తాయి, శరీరంలో కదలికలు వస్తాయి. శక్తి ప్రవాహ తీరు తెన్నులను గమనిస్తాం. వేటికీ అతిగా ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అదే అనుపస్సన అంటే.
🔺 'వి' అంటే విశేషమైన ‘పస్సన' అంటే చూడటం. అంటే మూడవ కంటితో, దివ్య దృష్టితో దర్శించటం అని అర్థం. మూడవ నేత్రం తెరుచుకున్నప్పుడు, దివ్య చక్షువు ఉత్తేజితం అయినప్పుడు ఎంతో ఎరుకతో ఉండాలి. అదే 'విపస్సన'. మనం పదాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే వాటి యొక్క భావాన్ని, పరమార్థాన్ని గ్రహించగలం.
☘️ మొదట సూత్రాలను సిద్ధాంత పరంగా ఆకళింపు చేసుకోవాలి. అప్పుడే సాధనను సమర్థవంతంగా చేస్తూ సత్ఫలితాలను పొందగలరు. అందుకే మనమంతా ఆధ్యాత్మిక జ్ఞానంలో పదాలను సాంకేతికంగా, సంపూర్ణంగా అవగాహన చేసుకుని తీరాలి.
🌻శరీరం, మనస్సులను అధిగమించిన తర్వాత మూడవ కన్నుకు చేరుకుంటాం. ఒకవేళ మీరు శరీరం గురించి ఆలోచించకుండా ఉంటే మనస్సులోకి చేరుకుంటారు. ఒకవేళ మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటే మీరు మూడవ కంటి వరకూ చేరుకోలేరు.
🌼 శరీరం మొదటి ' I, మనస్సు రెండవ ' I, దివ్య చక్షువు మూడవ I ", శరీరానికి చర్మ చక్షువులు ఉన్నాయి. మనస్సుకు మనో చక్షువు ఉంది. ఈ మూడవ కన్ను దివ్య చక్షువు. అందుకే అది 'మూడవ కన్ను' అయ్యింది. శరీరం మొదటి కళ్ళను భౌతిక దృష్టిని కలిగి ఉంది. మనస్సు రెండవ కళ్ళను, మనో దృష్టిని కలిగి ఉంది. ఆత్మ మూడవ కంటిని దివ్య దృష్టిని కలిగింది. దీన్నే ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రం, గురు స్థానం అని అంటాం.
🌿 మనం శరీరాన్ని అధిగమించాలి అంటే దేహానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. కనీసావసరాలే తీరుస్తూ ఉండాలి. మనస్సును అధిగమించాలి అంటే మనస్సులోని కోరికలు, ఆలోచనలు అన్నింటికీ తగినంత ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి. అప్పుడే విపస్సన స్థితికి చేరుకుంటాం. ఇక్కడ మన సంపూర్ణ ఏకాగ్రతను కేంద్రీకరించాలి. తద్వారా పూర్వ జన్మలు, ఆధ్యాత్మిక సంభావ్యతలు, ఇతర లోకాలు, గురువులు, మార్గదర్శకులను దర్శిస్తాం.
🌸 అందరూ ఆత్మ స్వరూపులే. అందరికీ అద్భుతమైన దివ్య చక్షువు ఉంది. అయితే ఉత్తేజితం కాలేదు కనుక ఉపయోగించుకోలేరు. అందరికీ రెండు కాళ్ళు ఉన్నాయి. అంత మాత్రం చేత అందరూ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతున్నారా? ఎంతో మంది తమ ఇంట్లో ఉన్న మెట్లనే ఎక్కరు. అంతటి పనికిమాలిన కాళ్ళను కలిగి ఉన్నారు వాళ్ళు.
🌳 మరి అదే విధంగా అందరికీ పరమ శివుడికి లానే మూడవ కన్ను ఉంది. కానీ వాళ్ళంతా పరమ శివుళ్ళు కాలేరు. ఎంత విచిత్రం ! ఎంత హాస్యాస్పదం !!
🔺 రెండు కాళ్ళూ ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కరు. సంకల్పం ఉంటే ఏ కాలైనా ఎవరెస్ట్ ఎక్కగలదు. మరి అదే విధంగా అందరికీ మూడవ కన్ను ఉంది. ఒక వేళ దాన్ని ఉత్తేజితం చేసుకోవాలి అనుకుంటే చేసుకోగలరు. వద్దు అనుకుంటే మూర్ఖులుగా ఉండిపోతారు. శరీరం పై శ్రద్ధా సక్తులు... మనస్సు పై శ్రద్ధా సక్తులు... పర్యవసానమే మూడవ కన్ను లేకపోవటం, దివ్య దృష్టి లోపించటం !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.

No comments:
Post a Comment