|| హృదయే చిత్తసంవిత్ ||
హృదయమున సంయమనం చేస్తే చిత్తనమును గురించిన శాస్త్ర జ్ఞానం అంతా కలుగుతుంది.
వివరణ:-
హృదయం యందు చిత్తం యొక్క విజ్ఞానం సంయమనం చేస్తే అంటే అనాహత చక్రం అంటారు చూశారా,హృదయ కమలం నందు, దాని యందు సంయమనం చేస్తే చిత్తంలో ఏం ఉన్నది తెలుస్తుంది. ఎవరి చిత్తంలో? మన చిత్తంలో కాదు. మన చిత్తంలో ఉన్నది మనకెలాగో తెలుస్తుంది. హృదయం లో ఈ వెలుగుని రోజూ ధ్యానం చేస్తూ ఉండే వాడికి, కొంత కాలం అయిన తర్వాత ప్రక్కన ఒకడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి. ఊరికే తమాషాగా వీడి పేరు హనుమంత రావు లా ఉంది అనిపిస్తుంది. అడిగితే హనుమంతరావే. అదీ "చిత్త సంవిత్" అంటే. కొంత సేపు అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అంటే ఏదో మనసులో అనిపిస్తుంది.. ఫలానా hindustan polymers లో పనిచేస్తున్నారులా ఉంది అని. మీరు ఎందులో పనిచేస్తున్నారు అంటే hindustan polymers అని చెబుతాడు. ఇంక ఏమీ సందేహం లేదు.
'చిత్త సంవిత్ ' అంటే ఇలా వారి ఇంట్లో వ్యవహారాలు అన్నీ తెలుస్తాయి. మంచి, చెడు అన్నీ తెలుస్తాయి. ఇది సాధన చేస్తే, బాధ్యత కలిగి ఉండాలి. అంటే ఎవరి ఇంట్లో విషయాలు అయినా మంచి,చెడు కూడా మనకి తెలిస్తే ఎలా ప్రవర్తించాలి? అక్కడ కూర్చునో, ఇక్కడ కూర్చునో వాడు అలా, వీడు ఇలా , వారి ఇంట్లో ఇలా ఉంది, వీరి ఇంట్లో అలా ఉంది అని వాగే పశు ప్రవృత్తులన్నీ పోవాలి. అంటే మనకి ఇతరుల గురించి విషయాలు తెలుస్తున్న కొద్ది మనకి బాధ్యత ఎక్కువ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని గురించి కొన్ని తెలిసాయి అనుకోండి మరీ ఘోరమైన విషయాలు. ఇంకోడితో ఇలా ఉంది వాడి ఇంట్లో అని చెప్పాము అనుకోండి. మొత్తం తెలియదు ఇంక. ప్రకృతి కనెక్షన్స్ తీసేస్తుంది. ఇంకోకరి ఉత్తరాలు చించి చదివినట్లే కదా! వాడిని ఏం చేస్తారో దొరికితే, వీడిని అదే చేస్తుంది ప్రకృతి. అవి చేయకూడని పనులు. వీడికి ఏమైనా తెలిస్తే ఉపయోగంగా ఉన్న పని ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించాలి. ఒకడికి abnormal of sex ఉంది అనుకోండి. అది తెలిసిన వీడు ఇంకోడితో చెబితే అలాంటి వాడు అయిపోతాడు. అంతకంటే ఇంకేం లేదు. అంటే వీడు సాధనకి పనికి రాడు. లేదా వాడు ఎప్పుడైనా వచ్చి, నన్ను ఉద్ధరించి సరైన మార్గంలో పడేయడానికి ఏమైనా ఉందా? అని అడిగినప్పుడు అప్పుడు పనికి వస్తుంది మీకు ఆ information . ఇంకో దానికి పనికి రాదు. ఇది ఒక రకమైన morality. Instinctive morality అంటారు. దీనినే sensual responsibility అని కూడా అంటారు.
జ్వాల్ కూల్ గారు చెబుతారు. మనకి విషయం తెలుస్తున్న కొద్ది, దానికి పది రెట్లు భాధ్యతలు ఎక్కువ అవుతాయి అనే విషయం తెలుస్తుంది. విషయం తెలియని వాడికి భాధ్యతలు ఉండవు. పిల్లల కంటే మనకి కాస్త ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి పిల్లల్ని నిప్పు దగ్గరకు, నీళ్ళ జోలికి, పొయ్యి దగ్గరకు, మెట్ల దగ్గరకు, డాబా పిట్ట గోడల దగ్గరకు పోనివ్వకూడదని మనకి తెలుసు అంటే అర్థం ఏమిటి? పోనివ్వకుండా చూసే బాధ్యత మనది. ఇవన్నీ ప్రమాదాలు అని మనకి తెలుసు. వాడికి తెలియదు. మనకి తెలిసినందువలన బాధ్యత ఒకటి నెత్తన పడింది. అందుకే బ్రహ్మ విద్య దగ్గరకు వెళ్ళే సాధకులు గానీ, యోగాభ్యాసము చేసే వారికి గానీ, జ్వాలా కూలుడు ఏం చెబుతున్నారు అంటే మీకు ఒక్క విషయం తెలిసే కొద్ది పది విషయాలపై బాధ్యత, బరువు భుజాన పడుతుంది అని, అప్పుడు మా వెంట వస్తూ ఉండండి. లేకపోతే వదిలేయండి. ఇవి రాయితీలు కావు. భాధ్యతలు ఎక్కువ అవుతాయి, knowledge వలన అన్నారు. Privileges ఎక్కువ అయితే knowledge, sub common అయిపోతుంది. విషయాలు తెలియడమే ఒక పెద్ద అధికార కాండ అయినట్లయితే, ఇంక యోగం ఏం లేదు. అలా రోగిష్టి వాడిలాగ పడి ఉంటాడు. యోగాభ్యాసము చేసి, అది బెడిసి కొట్టి, ఇలా అయిపోయాను అని చెప్పి ఏడుస్తాడు. అంటే nature కి ఎంత కరుణ ఉందో అంత exception లేదు. ఎందుకు అంటే మిగతా వాళ్ళ మీద కూడా అంత కరుణ ఉండాలి కదా! కరుణ అంటే మనమీద అని కాదు కదా అర్థం. అందరి మీదా. ఒకటి మర్చిపోకూడదు. ప్రకృతికి ఉన్న ప్రేమ తనమీదే అని అనుకోకూడదు. అందరి మీద అని అనుకోవాలి.
కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కనుక ఎప్పుడు అయినా మనకి మిగిలేవి బాధ్యతలే. రాయితీలు మిగలవు. విషయం తెలిసినా, తెలిసే కొద్దీ మరీ చికాకే అన్నాడు జ్వాలా కూల్ గారు. పెద్ద వాళ్ళు అంతా అలాగే చెప్పారు. ఆయన కూడా అదే అన్నారు. కాబట్టి హృదయం యందు మీరు ధ్యానం చేసినందు వలన ప్రక్కన కూర్చుని ఉన్న వాడి అభిప్రాయాలు, వాడికి తెలిసి ఉన్న అంతా కూడా మీకు అలా అలా బుర్రలోకి తడుతూ ఉంటుంది అన్నాడు. ఇవి కూడా తెలుసుకోండి. ఇవి పెద్ద విషయాలు కావు. చిన్నవే అయినప్పటికీ ఒక సారి చదివిస్తే understanding of the mind consciousness comes from one pointed meditation upon the heart centre. అంటే వాడు మానసికంగా తెలిసి ఉన్న విషయాలు అన్నీ కూడా మనకి తెలుస్తుంది. లేదా వాడిని నిద్రలోకి పంపాము అనుకోండి. హాయిగా నిద్రపోతూ ఉంటే అందులో వాడు వాగుతాడు, లేదా వాడి ప్రక్కన మీరు కూర్చుని ఉన్నారు అనుకోండి. స్పష్టంగా మీ మనసుకి వాడి మనసులో ఉన్నవి తెలుస్తాయి
No comments:
Post a Comment