ధర్మాపురం అనే ఒక ఊరిలో సుధ అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అందమైన అమ్మాయి, కానీ ఆమె అన్నాన్ని పాడుచేసే ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆమె ఎక్కువ అన్నం పెట్టుకొని తినకుండా పారవేసేది.
కొంతకాలం తర్వాత ఆమెకు వివాహం అయ్యింది. ఆమె అత్తగారు బీరువా తాళాలు మరియు ఇతర అన్ని బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఆమె ఇప్పటివరకు బాగా సంసారాన్ని కొనసాగించారు. ఇప్పుడు సుధ ఇంటికి వచ్చింది కావున, సుధ ఇంటిని సరిగ్గా నడపాలి .
సుధా తన అత్తగారి మాటలను అంగీకరించింది. తరువాత, సుధ తన భర్తకు పంచదార, కొన్నిసార్లు బియ్యం మరియు కొన్నిసార్లు పప్పుధాన్యాలు తీసుకురమ్మనేది .ఈ విషయం గురించి తన అత్తగారు తెలుసుకున్నప్పుడు, ఆమె సుధతో, "నీవు నెలలో ఒకేసారి సామాను తెప్పించచ్చు కదా. ఎందుకు మళ్ళి మళ్ళి సమానుకు పంపుతున్నావు " అంటుంది.
"నేను నెలకు ఒకేసారి సామాను తెప్పిస్తున్నాను, కాని అవి సరిపోవట్లేదు". అని సుధా చెప్పింది. అప్పుడు సుధా అత్తగారికి సామాను ఎక్కడ వెళుతుంది అని అనుమానం వచ్చింది, వంటగదిని గమనించడం మొదలుపెట్టింది .
కొన్ని రోజులు వంటగదిని గమనించిన తరువాత, సుధ ఎక్కువ అన్నం వండుతుంది. ఆ విదంగా మిగిలిన చాలా ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి పారవేస్తుంది. అని తెలుసుకుంది, ఆమెకు అన్నం యొక్క విలువ గురించి సుధాకు తెలియజేయాలని అనుకుంది.
ఒక రోజు ఆమె సుధను పిలిచి, మా దగ్గర ఇంతకుముందు పనిచేసిన, పనిమనిషి పిల్లల ఆరోగ్యం బాగాలేదట, నేను చూడటానికి వెళ్తున్న, నీవు కూడా నాతో వస్తావా అడుగుతుంది. సుధ తన అత్తగారితో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంది.
పనిమనిషి కాలనీకి వెళ్లిన తరువాత, సుధా అత్తగారు "పనిమనిషి ఇంటికి వెళ్ళడానికి నేను దారి అడిగివస్తాను" అని చెప్పి వెళుతుంది. కొద్ధి సమయం తరువాత, అక్కడే నిలబడి వున్న సుధకు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినపడుతుంది, పక్కనే వున్న ఇంటి లోపల చూసింది. ఒక చిన్న పిల్లవాడు ఆకలి కారణంగా ఏడుస్తుండటం తాను చూసింది.
ఆ పిల్లవాడి తల్లి అన్నం పెట్టడానికి గిన్నెలో చూసింది కాని, అవి ఖాళీగా ఉన్నాయి. ఇది చూసిన సుధకు ఏడుపు వచ్చింది. కొంత సమయం తరువాత ఆమె అత్తగారు వచ్చి తన పనిమనిషి ఇంటికి తీసుకెళ్ళింది. పనిమనిషి ఇంటికి వెళ్లి చూసాక, ఆమె అబ్బాయి అనారోగ్యంతో పడుకున్నాడు.
సుధా అత్తగారు అనారోగ్యానికి కారణం అడుగుతుంది, అప్పుడు పనిమనిషి ఒక ఇంటి నుండి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువచ్చిందని, అయితే ఆహారం చెడిపోయిన విషయం తనకు తెలియదని చెప్పింది. దానిని తినడం కారణంగా తన కొడుకు అనారోగ్యం అయ్యాడని చెప్పింది.
ఆ మాటలు చెప్పుకుంటూ ఆమె ఏడుస్తుంది. కొంత సమయం తరువాత, సుధా మరియు ఆమె అత్తగారు వారి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే సుధా తన అత్తగారిని కౌగిలించుకుని ఏడుస్తుంది.
తన అత్తగారు ఎందుకు ఏడుస్తున్నావని అడిగితె, "నేను అన్నం ని చాల వృధా చేస్తున్నానని, చాల మందికి తినడానికి తిండి లేదని" సుధా చెప్పింది.
ఇకమీదట నుంచి తాను ఎప్పుడు అన్నం ని వృథా చేయనని అత్తగారికి చెప్తుంది. "సుధ అన్నం విలువ తెలుసుకున్నందుకు ఆమె అత్తగారు చాల సంతోషంగా ఉంటుంది".
"మనం ఎప్పుడూ అన్నం ని వృథా చేయకూడదు.
No comments:
Post a Comment