నేటి జీవిత సత్యం.
కష్టం ఎవరూ కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు. అబద్ధం అర్థం అయినంత త్వరగా నిజం అర్థం కాదు అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు .
ఒక వ్యక్తి యొక్క పరిచయం అతని ముఖంతో ప్రారంభమైనప్పటికీ అతని నిజమైన గుర్తింపు అతని మాటలు ఆలోచనలు మరియు పనుల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది .
చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.
జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి .
ఈ రోజుల్లో నిజం మాట్లాడే వారు నీచుడు అబద్ధం చెప్పేవారు ఆప్తుడు . సహాయం చేసేవారు సన్యాసి మోసాలు చేసేవారు దేవుడు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ ఒంటరి వాడే.
ఉన్నవాడు చచ్చి పోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదు అని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న.
నా ఆలోచన సత్యం అంటే తెలుసుకునేది ధర్మం. అంటే ఆచరించేది ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం . ఏది చేయకూడదని చెప్పేది ధర్మం.
అన్వేషించేది మనిషి ఆగనిది కాలం ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం అంతరించేది* జీవితం తోడుండేది మనం చేసిన మంచితనం.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment