Wednesday, August 10, 2022

నేటి మంచిమాట. ❤️ఏ బంధమైనా మన అనుకుంటే ఒప్పుగా కనిపిస్తుంది కాదు అనుకుంటే తప్పుగా అనిపిస్తుంది.

నేటి మంచిమాట.

❤️ఏ బంధమైనా
మన అనుకుంటే
ఒప్పుగా కనిపిస్తుంది
కాదు అనుకుంటే
తప్పుగా అనిపిస్తుంది

మన అనుకుంటే
దయ కలుగుతుంది
కాదు అనుకుంటే
ద్వేషం మిగులుతుంది

మన అనుకుంటే
పెంచుకోవాలనిపిస్తుంది
కాదు అనుకుంటే
తుంచేయాలని పిస్తుంది

మన అనుకుంటే
ప్రేమే కలుగుతుంది
కాదు అనుకుంటే
పగ కూడా రగలవచ్చు

మన అనుకుంటే
ఏమైనా చేయాలనిపిస్తుంది
కాదు అనిపిస్తే
ఏమీ చేయాలనిపించదు

మన అనుకుంటే
ఆదరణ కలుగుతుంది
కాదు అనిపిస్తే
అనవసరం అనిపిస్తుంది

మన అనుకుంటే
ప్రాణం కూడా ఇస్తుంది
కాదు
అనుకుంటే...

భారమనిపించె బంధాలు
ఏ క్షణమైనా మాయం కావచ్చు
ప్రాణమనిపించే బంధాలు
మనతోపాటే ఎప్పటికీ ఉంటాయి

నిరాశా
నిస్పృహలలో కూడా
జీవన పయనంలో
ధైర్యాన్ని కలిగించేవి
మన అనుకునే బంధాలు

పేగు బంధమో
రక్త బంధమో మాత్రమే
బంధం కాదు
కొన్ని బంధాలు
జన్మ జన్మల కి
తోడు నీడగా వస్తూ ఉంటాయి
మనమే గుర్తించలేము

🌄 శుభోదయం చెప్తూ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment