Tuesday, April 25, 2023

:::: ఉన్నవి ధర్మాలా? ,నేనా? :::::

 *::::::: ఉన్నవి ధర్మాలా? ,నేనా? ::::::::*
1) *జీవ ధర్మం:-* ఆకలి వేసింది, నిద్ర వచ్చింది, మైధున కోరిక కలిగింది. ఇందులో జీవ ధర్మం వుంది కాని ,నా ప్రమేయం లేదు. మరి నేను ,నాకు ఆకలి వేసింది అంటున్నాను.

2) *మానసిక ధర్మం :-* గిట్టని మాట విని మనస్సు కోపం దానంతట అది తెచ్చు కుంది. నాకు కోపం వచ్చింది. అన్నాను. ఉన్న దానిని సొంతం చేసుకున్నాను.

3) *శరీర ధర్మం* యవ్వనం వచ్చింది. మీసాలు గెడ్డం మొలిచింది/ఎత్తులు పెరిగాయి. నేను గర్వ పడుతున్నాను. నేను వాటిని మొలిపించక పోయినా

4) *సామాజిక ధర్మం.:-* ఈ బ్రతికే తీరు సమాజం నిర్ణయిస్తుంది. నేను భలే బ్రతికేస్తూ వున్నా , లేదా ఏమి బ్రతుకురా ఇది అంటుంటా.
        ఈ వివిధ ధర్మాలే వున్నాయా? నేను కూడా వున్నానా? వుంటే ఎక్కడ?ఎలా?
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment