Sunday, April 30, 2023

:::::: మనస్సు ::::::

 *:::::::: మనస్సు :::::::::::::*
     మనందరిది ఒకే మనస్సు.
ఈ ఒకే మనస్సు ని మనం తలా ఒక ముక్క పంచుకున్నాము. ఒకే తాను లోని బట్టను తలా ఒక ముక్క తీసుకున్నట్లు . ఈ మనస్సు ప్రధానంగా మూడు రకాల పనులు చేస్తుంది.
1) *పనిలో నిమగ్నమవడం*.. మనస్సుశరీరం కలిసి ఏ పని చేస్తున్నా ఆ పని లో మనస్సు నిమగ్నమై వుంటుంది.
2) *ఆలోచించడం.*... మనస్సు ఏ పని లోనూ నిమగ్నం కాక పోతే అది గతం లోకి జారి పడి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వుంటుంది లేదా భవిష్యత్ ను ఊహిస్తూ వుంటుంది.
3) *సంవేదనలతో వుండుటం*.. మనో శారీరక వ్యవస్థ లో ప్రతి క్షణం కలిగే సంవేదనలతో వుండటం.

      ఈ మూడు పనుల్లో,  ఒక్కొక్కరిలో వారి ముక్క మనస్సు ఒకొక్క పనిని, వారి వారి మానసిక ఆరోగ్యం, శిక్షణ, ప్రత్యేక కారణాలను బట్టి, కేటాయించుకొని దానిలో వుండి పోతుంది.
     ధ్యానం మనస్సు ని సరైన పనిలో,సరైన సమయంలో,సరైన విధంగా, వుంచుతుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment