Sunday, April 23, 2023

నాన్న గారు చెప్పిన శివరాత్రి మహిమ.....*

 *నాన్న గారు చెప్పిన శివరాత్రి మహిమ.....* 
               

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🔱 శివరాత్రి మొత్తము రుద్రశక్తే. ఎంత మనము అనుసంధానం చెందితే అంత శక్తి, సంవత్సర మొత్తమునకు సరిపడా వచ్చేస్తుంది. రుద్రుడు అలాంటివాడు. రుద్రులలో శంకరుడు సత్వగుణ సంపన్నుడు. రుద్రుడుని The cosmic will అంటారు. అంటే దివ్య సంకల్పము.

⚜️ పనులు కాకపోయినా, మనిషి లోపలికి బాగా చచ్చుబడిపోతున్నా రుద్రం చేసుకోమంటారు. అవరోధములను రుద్రుడు అతని చూపుతోనే  భస్మము చేసేస్తాడు. ప్రకృతిపరంగా అది ఒక శక్తి. రుద్రాభిషేకం చేస్తే శక్తి పెరుగుతుంది. ఇందులో ఏ మాత్రము సందేహము లేదు.  మనము ఏదైనా అధర్మముగా ప్రవర్తించినపుడు రుద్రుడు లోపల నుంచే బాణాలు వేస్తుంటాడు.

🔱 *"ఏకాదశ రుద్రులు"* అంటే...  *ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు మనస్సు.* 

⚜️ 11 సార్లు నమకము చదివినప్పుడు ఇంద్రియములు శుద్ధి అవుతాయి. శివ సంకీర్తన, శివస్మరణ చేయడం వలన చుట్టూ ఉన్న ప్రపంచము రోగరహితముగా, బాధారహితముగా ఉంటుంది.

⚜️ *హరహర మహాదేవ* 🔱

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 


*సేకరణ:* 

No comments:

Post a Comment