*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీమద్రామాయణం వినాలనే కోరికతో కూర్చున్నప్పుడే కృతార్థులమై పోతాం.*
💖 *నారద ఉవాచ:~ సర్వే యూయం మహాభాగా; కృతార్థా: నాత్ర సంశయ: యతః ప్రభావం రామస్య భక్తితః శ్రోతుముద్యతా:*
💕 *~కొన్నింటికి అత్యుత్తమ స్థానముంటుంది. వాటికంటే శ్రేష్ఠమైనవి లేకపోవడం వల్ల. గంగవంటి తీర్థం లేదు.తల్లివంటి గురువు లేరు. విష్ణువువంటి దేవుడూ లేరు. రామాయణం అంతటి కావ్యమూ లేదు..!!*
💓 *నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృసమో గురు: నాస్తి విష్ణు సమో దేవో నాస్తి రామాయణాత్ పరమ్*
💕 *~వేదాన్ని మించిన శాస్త్రం ఇంకోటి లేదు.. శాంతిని మించిన సుఖం ఇంకోటి లేదు.. జ్ఞానాన్ని మించిన వెలుగూ లేదు.. రామాయణాన్ని మించిన ఇతిహాసమూ లేదు..!!*
❤️ *నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతి సమం సుఖమ్ నాస్తి జ్ఞానపరం జ్యోతి: నాస్తి రామాయణాత్ పరమ్*
*~నిస్సారమైన జీవితంలో ఓర్పును మించిన సారం ఇంకోటి లేదు.. కీర్తిని మించిన ధనమూ లేదు.. జ్ఞానం పొందడం కంటే లాభకరమైనదీ లేదు.. రామాయణం కంటే గొప్ప గ్రంథమూ లేదు..!!*
❤️ *నాస్తి క్షమా సమం సారం నాస్తి కీర్తి సమం ధనం నాస్తి జ్ఞానసమో లాభో నాస్తి రామాయణాత్ పరమ్*
*~రామాయణ పుస్తకాన్ని ఎవరైనా ఎవరికైనా దానంగా ఇస్తేఆ దాత విష్ణులోకానికి వెళ్తాడు.పునరావృత్తిరహితమైన ఆనంద స్వరూపుడౌతాడు.*
💖 *’యత్ర గత్వా న నివర్తంతే తద్దామ పరం మమ’అని భగవానుడు చెప్పిన పరమానందాన్ని పొందుతాడు. పుట్టినప్పటినుండీ మనం చేసే ప్రతి ప్రయత్నమూ దుఃఖాన్ని దూరం చేసుకోవడానికే కదా..!నిజానికి సులువైన మార్గం కోరికలు తగ్గించుకోవడం. కోరికలే లేకుండాపోయే స్థితి వస్తుంది మనం ఆయన్నే కోరుకుంటే..!*
❤️ *రామాయణ పుస్తకం యో వాచకాయ ప్రయచ్ఛతి స యాతి విష్ణుభవనం యత్ర గత్వా న శోచతి.. రామాయణం తు యః కుర్యాత్ శాన్తాత్మా ప్రయతేంద్రియ: స యాతి పరమానందం యత్ర గత్వా న శోచతి..!*
💞 *~సర్వపాప ప్రక్షాళనా సామర్ధ్యం కల గంగానదీస్నానం, సర్వధర్మమార్గంలో ప్రవర్తించడం వంటిదే రామాయణ పరత్వం..! రామాయణమే జీవనంగా జీవించగలగటం. అది చెయ్యగలిగినవాడు ముక్తుడే*
💖 *రామాయణ పరో నిత్యం గంగా స్నాన పరాయణః ధర్మమార్గ ప్రవక్తారో ముక్తా ఏవం న సంశయ:*
*~కనుక అందరూ రామాయణ కథని వినండి. శ్రావ్యమైనదీ, పరమ పవిత్రమైనదీ ఐన రామాయణం కథ కన్నా ఉత్తమమైనది మరోటి లేదు.*
💖 *తస్మాత్ శృణుధ్వం విప్రేంద్రా రామాయణ కథామృతమ్*
*శ్రోతౄణాం చ పరం శ్రావ్యం 9 *
*~ఏ మానవుడైతే శ్రద్ధతో రామాయణశ్లోకాల్ని గానీ, అనువాదాలను గానీ చదువుతాడో వాడు వెంఠనే కోట్ల కొలదీ ఉపపాతకాలనించి విముక్తుడౌతాడు.*
❤️ *నరోఽత్ర శ్రద్ధయా యుక్తః శ్లోకం శ్లోకార్థమేవచ పఠతే ముచ్యతే సద్యో హ్యుపపాతక కోటిభిః సతామేవ ప్రయోక్తవ్యం గుహ్యాత్ గుహ్యతమం తు యత్!!*
💝 *రామ నామైవ నామైవ మమ జీవనమ్ కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా*
💞 *~ఇదంతా సూతులవారు చెపుతున్నారు మహర్షులతో. నారదులవారు సనత్కుమారునికి ఇలా రామాయణ మాహాత్మ్యం చెప్పగానే సనత్కుమారులు వెంటనే గొప్ప శాంతిని పొందారు. రామాయణ ప్రభావమే అది.*
💓 *~వాల్మీకి రామాయణం కరుణరస ప్రధానమైన కావ్యం. అన్ని రసాలూ చివరికి ఆ శాంత రసంలోనే పర్యవసిస్తాయి. నిర్వృతి అంటే శాంతం…ఊరట అని అర్ధం.. సుఖము, సుస్థితి అని అర్ధం. అది పరమమైన శాంతము అయితే మోక్షము అని అర్ధం.. శ్లోకమ్ చివర ‘హ’ అనే అక్షరం వేశారు!*
💖 *ఏవం సనత్కుమారస్తు నారదేన మహాత్మనా సమ్యక్ ప్రబోధితః సద్యః పరాం నిర్వృతి మాప హ*
💕 *~రామాయణం అది ఆదికావ్యం.. సర్వ వేదార్ధసారం. సమస్త పాపాలనీ హరిస్తుంది... పుణ్యప్రదం. సర్వదుఃఖ వినాశకం... సకల పుణ్యఫలాలనీ ఇస్తుంది... సకల యజ్ఞ ఫలాలూ లభిస్తాయి రామాయణం వల్ల.*
💖 *రామాయణ మాదికావ్యం సర్వ వేదార్ధ సమ్మతం సర్వ పాప హరమ్ పుణ్యం సర్వ దుఃఖ నిబర్హణమ్ సమస్త పుణ్య ఫలదం సర్వ యజ్ఞ ఫల ప్రదమ్*
💞 *రామాయణంలోని శ్లోకాలని కానీ, శ్లోకార్థాలనుగానీ పఠించే వారికి పాపబంధాలు శాశ్వతంగా తొలగిపోతాయి.*
💕 *యే పఠన్త్యత్ర విబుధా: శ్లోకం శ్లోకార్థమేవ చ న తేషామ్ పాపబంధస్తు కదాచిదపి జాయతే*
💓 *~శ్రద్ధగా భక్తితో రామాయణం వినేవారూ, పఠించేవారూ సర్వపాప విముక్తులై విష్ణులోకానికి వెళ్తారు..!*
💓 *యస్త్వేతత్ శ్రుణుయాద్వాపి పఠేద్వా సుసమాహితః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి.*
💖 *~ఇతి శ్రీ స్కంద పురాణే నారద సనత్కుమార సంవాదే రామాయణ మాహాత్మ్యం సంపూర్ణమ్*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment