రీల్స్ వెనుక రియల్ క్రైమ్..ఇన్‌స్టాలో వలపు వల..ఆ వీడియోలే పెట్టుబడిగా దారుణాలు! | Special Focus |NTV
Author Name:NTV Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@ntvtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RUkE9iAdfno
Transcript:
(00:00) నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఫోకస్ ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆకర్షించడం ఫ్రెండ్షిప్ లవ్ పేరుతో వంచించే నయవంచకులు ఎక్కువైపోయారు. ముందు చాటింగ్ పేరుతో ఉచ్చులో పడేస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా డబ్బులు దొచ్చేస్తారు. అమ్మాయిలని అయితే లైంగికంగా వాడుకుంటారు.
(00:21) ఆ సమయంలో సీక్రెట్ గా తీసిన వీడియోలతో మళ్ళీ బెదిరిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా హనీ ట్రాప్ లో చిక్కుకున్న బాధ్యతలు వందల వేలల్లో ఉందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సోషల్ మీడియా ట్రాప్ నుంచి తప్పించుకోలేమా మనల్ని మనం రక్షించుకునేది ఎలా ఆన్లైన్ లో వలపు వల విసురుతారు. ఇంకా చెప్పాలంటే ట్రాప్ చేస్తారు.
(00:42) వారి ఉచ్చులో పడ్డారో అంతే సంగతులు. ప్రేమ పేరుతో కవ్విస్తారు. నిజమైన ప్రేమికుల కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తారు. సీన్ కట్ చేస్తే అందిన కాడికి డబ్బు గుంజుతారు. ఇవ్వకుంటే బ్లాక్ మెయిల్ కు దిగుతారు. ఇటీవల ఇలాంటి మోసాలు మరీ ఎక్కువయ్యాయి. కొంతమంది పోకిరి వెధవలు ఇదే పనిగా పెట్టుకొని బతుకు బండి సాఫీగా లాగించేస్తున్నారు. అయితే అలాంటి పోకిరి గాళ్ళను కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు.
(01:06) వారు చేసిన మోసాలు చూస్తే వామ్మో అని మనం నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ రేంజ్లో చీటింగ్ చేశారంటే వారి చీటింగ్ స్కిల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ క్రిమినల్స్ ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారు? పని పాట లేని పోకిరీలు ఆన్లైన్ లో రీల్స్ చేయడమే వారి పని రీల్స్ కోసం రూల్స్ కూడా పక్కన పెట్టేస్తారు. తమను తాము హీరోల రేంజ్లో బిల్డప్ ఇస్తూ రీల్స్ చేస్తారు.
(01:29) అమాయకులైన అమ్మాయిలకు వలపు వల విసురుతారు. అలాంటి ఓ పోకిరి యువకుడిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు చేసిన పని చూస్తే మనం షాక్ అవ్వాల్సిందే. ముందుగా సంపన్న వర్గాల బాలికలను లక్ష్యంగా వలవిసురుతాడు. వారిని ప్రేమలోకి దింపుతాడు. ఆపై వ్యాపారం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మెల్లగా జారుకుంటాడు. ఇలా బాలికలు యువతులను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు.
(01:57) కానీ సీన్ కట్ చేస్తే జూబిలీ హిల్స్ కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ పోకిరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ఏపీ లోని గుంటూరు స్వస్థలు కానీ హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉంటూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. జూబ్లీ హిల్స్ కు చెందిన ఓ బాలికను చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ఇస్గ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.
(02:24) ఆ తర్వాత అమ్మాయి రిప్లై ఇవ్వగానే తనను తాను పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మాట మాట కలిపి ప్రేమ పేరుతో వలపు వల విసిరాడు. అర్జున్ను పూర్తిగా నమ్మిన అమ్మాయి మెల్లగా ఫోన్ కాల్స్ మాట్లాడడం మొదలు పెట్టింది. ఇంకేముంది అర్జున్ పూర్తిగా ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు. తరచు ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు.
(02:49) ఈ విషయం గత ఏడాది ఏప్రిల్లో బాలిక తల్లికి తెలియడంతో చంద్రశేఖర్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు ఫోక్సో చట్టం కింద అర్జున్ను అరెస్ట్ చేయించింది. పోలీసులు అతన్ని రిమాండ్ కు తరళించారు. కానీ మళ్ళీ బెయిల్ పై వచ్చిన తర్వాత బాలికను కలుసుకున్నాడు అర్జున్. ఈసారి తన ప్లాన్ పక్కగా అమలు చేశాడు. స్టార్టప్ పెడుతున్నాను అంటూ ఆమెకు పెద్ద ఎత్తున సినిమా చూపించాడు.
(03:12) స్టార్టప్ కంపెనీ సక్సెస్ కాగానే ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అంటూ భవిష్యత్తంతా బంగారమయంగా ఉంటుంది అంటూ ఓరడించాడు. దీంతో అవన్నీ నిజమే అనుకొని నమ్మింది ఆ బాలిక. దీంతో ఆమె నుంచి స్టార్టప్ కంపెనీ కోసం అంటూ 13.11 లక్షల రూపాయలు వసూలు చేశాడు అర్జున్. ఇంట్లో ఒక్కసారిగా 13 లక్షల రూపాయలు మాయమయ్యేసరికి తల్లిదండ్రులకు డౌట్ వచ్చింది.
(03:38) దీంతో కూతురుపై ఆ తల్లిదండ్రులు నిఘా ఉంచారు. ముఖ్యంగా ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేశారు. కానీ కారు డ్రైవర్ అతని భార్య ఫోన్లతో బాయ్ఫ్రెండ్ అర్జున్కు కాల్ చేసింది. డ్రైవర్ భార్య సైతం బాలికను బెదిరించింది. అర్జున్తో మాట్లాడుతున్నట్లు తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి బాలిక నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేసింది. సీన్ కట్ చేస్తే ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మరోసారి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(04:02) దీంతో మరోసారి అర్జున్ను అరెస్ట్ చేశారు. అటు డ్రైవర్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు ఈ బాలికతో ప్రేమ డ్రామా ఆడుతూనే నాసింగికి చెందిన మరో యువతితో చంద్రశేఖర్ తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వలపు పేరుతో ఇలా ఇద్దరి నుంచి ముగ్గురు యువతులను ప్రేమలోకి దింపి వారిని మోసగించి లక్షల రూపాయల్లో డబ్బులు లాగినట్లు బయటపడింది.
(04:25) అంతేకాదు ఓ కారులో తిరుగుతూ తాను ధనవంతుడినని వ్యాపారవేత్తనని చాలా కంపెనీలు ఉన్నాయని బిల్డప్ ఇస్తూ అమ్మాయిలను నమ్మించినట్లు విచారణలో బయటపడింది. నిత్యం పబ్బులు రెస్టారెంట్లతో పాటుఇగ లో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద జూబ్లీ హిల్స్ పోలీసులు రెండోసారి చంద్రశేఖర్ను రిమాండ్ కు తరళించారు.
(04:48) ఈ కేస్ పెండింగ్ లో ఉండగానే మరికొంతమంది బాధితులు కూడా జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ చంద్రశేఖర్ పై మరో యువతి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి బంగారు గొలుసు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 693182 కింద కేస్ నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.
(05:11) ఆ కేసును కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలి చేశారు. ప్రేమ పేరుతో చంద్రశేఖర్ ఇప్పటివరకు సుమారు 10 మందిని మోసగించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని అలాగే వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు పోలీసులు.
(05:32) ఇగ అమ్మాయిల జీవితాల్లో చిచ్చుపెడుతుంది. ఆన్లైన్ లో ఉన్నవాడు మంచోడో చెడ్డవాడో తెలియని పరిస్థితి ఆ అమ్మాయిలది. మరోవైపు ఒకడు ప్రేమ పేరుతో ఇన్స్టాలో వల విసిరి డబ్బులు గుంచితే మరొకడు అదే ప్రేమ పేరు ఉపయోగించి లైంగికంగా వాడుకుంటున్నాడు. దీంతో ఎటు చూసిన అమ్మాయిలు యువతులు కొన్ని సందర్భాల్లో బాలికలు కూడా ఈ ఆన్లైన్ నయవంచుకల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
(05:53) అలాంటి ఘటనే మహారాష్ట్రలోని అమరావతిలో సంచలనం రేపింది. ఓ పోకిరి వెధవ చేసిన పనులకు ఏకంగా 108 మంది అమ్మాయిల జీవితాలు నెట్ ఇంట్లో అంగరి సరుకులా మారిపోయాయి. వారి వ్యక్తిగత వీడియోలు బయటకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి ఆ పోకిరి వెదను పోలీసులు కటకటాలోకి నెట్టారు. ఇంతకీ ఆ కంత్రిగాడు ఎవరు? ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడులు ఇది ఏ ఒకరో ఇద్దరో అమ్మాయిల వ్యధ కాదు ఓ పోకిరి వెధవ చేసిన పనికి ఏకంగా 108 మంది యువతుల జీవితాలు ఆగమాగమయ్యాయి.
(06:28) మహారాష్ట్రలోని అమరావతి కేంద్రంగా ఈ ఘటన జరిగింది. 108 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన ఆ పోకిరి యువకుడు వారికి చెందిన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడు. అలాంటి 350 వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మహారాష్ట్రలో కలకలం రేగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడలో మహమ్మద్ అయాన్ మహమ్మద్ తన్వీర్ అనే యువకుడు యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
(06:58) అతని వలపు వలలో చిక్కుకోవడంతో దాదాపు 108 మంది అమ్మాయిల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన 19 ఏళ్ల అయాన్ అహ్మద్ తన్వీర్తో పాటు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఉజైర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ ను కూడా అమరావతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
(07:21) నిందితుడు అయాన్ బాలికలతో స్నేహం చేసి వారి నమ్మకాన్ని చోరగొని ప్రేమ పేరుతో లోబరుచుకొని వారికి తెలియకుండానే వీడియోలు చిత్రీకరించినట్లు విచారణలో వెలడైంది. ఆపై ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. తన్వీర్ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసేవాడు. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి వారిని ముంబై పూణేలకు తీసుకువెళ్ళేవాడు.
(07:43) అక్కడ వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఉపయోగించి బాలికలను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు కొన్నింటిని ఆన్లైన్ లో కూడా షేర్ చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఓ వినతి పత్రం ద్వారా రాజ్యసభ ఎంపి అనిల్ బోండేకు ఈ విషయం తెలిసింది. దీంతో అయాన్ మహమ్మద్ తన్వీర్ పై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
(08:06) అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ కేస పై పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతారని ఎంపి అనిల్ బోండే హెచ్చరించడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఇదే కేసులో ఉజైర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(08:31) బాధితుల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉజైర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ అని గుర్తించారు పోలీసులు. అంతేకాదు ఈ కేసు కు సంబంధించి నిందితుల వద్ద నుంచి 18 వీడియోలు 39 ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఇందులో బలైపోయిన అమ్మాయిలు 108 మంది ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అటు సోషల్ మీడియాలో 350 కి పైగా అశ్లీల వీడియోలు వైరల్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
(08:54) మొత్తంగా ఈ వీడియోలో అనేకమంది అమ్మాయిలతో అసభ్యకర దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ 108 మంది యువతలతో పాటు కొందరు మైనర్ బాలికలు కూడా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియోలనుఇగ టెలిగ్రమ తో పాటు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడి ఎందరో అమ్మాయిల జీవితాలను ఇరకాటంలో పెట్టిన మహమ్మద్ అయాన్ మహమ్మద్ తన్వీర్ పై ఫోక్సో యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేస్ నమోదు చేశారు.
(09:24) కోర్ట్లో హాజరు పరచడంతో కోర్ట్ అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అయితే ఎంతమంది అమ్మాయిలను నిందితులు ఇద్దరు బెదిరించారో తేలాల్సింది. నిందితుడు తన్వీర్ నుంచి మొబైల్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.
(09:46) అయితే నిందితుడు ఇదివరకే కొంత డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమాచారం కోసం అతన్ని విచారణ చేస్తున్నారు. ఒకవేళ టెక్నాలజీని వినియోగించి నిందితుడు డేటాని తొలగించినట్లయితే దానిని తిరిగి పొందేందుకు సైబర్ నిపునుల సహాయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. మరోవైపు ఈ వ్యవహారం కాస్త రాజకీయంగాను పెను దుమారం రేపింది.
(10:08) నిందితుడు అయాన్ అహ్మద్ కు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. తన్వీర్ అండ్ ఉజేర్ గ్యాంగ్ చేసిన పని ఇక్కడితోనే ముగిసిందదా లేదా వాళ్ళ నెట్వర్క్ ఇంకా ఉందా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా మరికొంతమంది అమ్మాయిలు కూడా వారి ఉచ్చులో చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధ్యత యువతలు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకువచ్చి అవసరమైన సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
(10:35) ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక ఆన్లైన్ మోసాల్లో ఇది మూడో రకం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ యువకులు మాత్రమే కాదు మహిళలు సైతం రంగంలోకి దిగి మోసాల్లో ఆరితేరారు. కొంతమంది తమ అందచందాలు కవ్వింపులతో యువకులను ఆకర్షిస్తూ అందరిని కాడికి దోచేస్తున్నారు.
(10:56) ఆన్లైన్ సంపాదన గిట్టుబాటుగా ఉండడంతో మిగతా పనులన్నీ పక్కకు పెట్టి మరి ఈ గలీజ్ దందాకు తెరలేపారు. అలా హనీ టాప్ తో విచ్చలవిడిగా మోసాలకు పాల్పడిన మహిళను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఆన్లైన్ లో ఆ మహిళ భర్తతో కలిసి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకవచ్చాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగితే ఇన్ఫ్లయన్స్ గా గుర్తింపవస్తుంది.
(11:19) ఇన్ఫ్లయెన్స్ గా సెలబ్రిటీ హోదా లభిస్తుంది. జస్ట్ ఇదే సిల్లీ రీజన్ తో చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు చక్కగా రెడీ అయి Facebookఇగ లో రీల్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడుకుంటున్నారు. అసలే అమ్మాయిలు అందులో అందచందాలు ప్రదర్శిస్తూ ఫోటోలు వీడియోలు షేర్ చేయడంతో లైక్ కొట్టి కామెంట్ చేసేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
(11:45) అందులోనూ కొంతమంది సెలబ్రిటీలు ప్రముఖులు వ్యాపారవేత్తలు సైతం ఉంటున్నారు. ఇంతవరకు బానే ఉంది కానీ ఇలాంటి సోషల్ మీడియా నుంచి ఓ మహిళ కన్నింగ్ స్కెచ్ చేసింది. హై ప్రొఫైల్ ఉన్నవారిని టార్గెట్ చేస్తూ వలపు వల విసురుతోంది. అలాంటి ఉదంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.ఇగ్ర Instagram లో అర్ధనగ్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి వలపు వల విసిరే ఓ మహిళ తన వలలో పడిన వారు డబ్బిస్తే వాళ్ళతో ఏకాంతంగా గడిపేది.
(12:14) ఆ సమయంలో ఆమె భర్త గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై దంపతులుఇద్దరు ఆ వీడియోలను చూపి బెదిరింపులకు దిగి అందిన కాడికి దోచుకునేవారు.ఇస్గ్ర వేదికగా రెండేళ్లుగా ఈ గలీజు దందాకు పాల్పడుతున్న కరీంనగర్కు చెందిన దంపతుల బాధితుల్లో వ్యాపారులు వైద్యులు వైద్య విద్యార్థులు పలువురు యువకులు కూడా ఉన్నారు. చివరికి ఓ బాధితుడి ఫిర్యాదుతో దంపతుల గుట్టు బయటపడింది.
(12:38) నిందితులను కటకటాల్లోకే నెట్టారు. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు 10ఏళ్లుగా కరీంనగర్ లోని ఆరేపల్లెలో నివాసం ఉంటున్నారు. భర్త గ్రానైట్ ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేశారు. భార్య YouTube ఛానల్ నిర్వహిస్తుంది. భర్త వ్యాపారంలో నష్టపోయాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకుఇగ వేదికగా వలపువల వేసేందుకు దంపతులు పథకం రచించారు.
(13:04) దంపతుల్లోని మహిళకుఇగ లో 1200 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకేముందిఇస్టా వేదికగానే వలపువల శురు చేసింది.ఇస్టాలో తన అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేసింది. వాటిని చూసి ఆకర్షితులై ఉచ్చులో పడిన వారిని మెల్లగా తమ వద్దకు పిలిపించుకొని డబ్బులు లాగేందుకు దంపతులు స్కెచ్ చేశారు. ముందుగా డబ్బు తీసుకుని ఆ మహిళ వారితో ఏకాంతంగా గడుపుతూ ఉండేది.
(13:28) భర్త చాటు మాటుగా ఉండి ఆ వీడియోలు తీసేవాడు. ఆపై అంతకు ముందే వేసిన పథకాన్ని అమలు చేసేవారు. ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఉండేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు. అలా వారి బెదిరింపులకు భయపడి చాలా మంది వారికి డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో ఆ దంపతులు 65 లక్షల రూపాయలతో ఒక ఫ్లాట్ ఖరీదైన ఫర్నిచర్ 10 లక్షల రూపాయల విలువైన కారు కూడా కొనుగోలు చేశారు.
(13:56) తన ఫాలోవర్స్ లో 100 మందితో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. అయితే ఏడాది క్రితం ఈ దంపతులకు పరిచయమైన కరీం నగర్ కు చెందిన ఓ వ్యక్తి దంపతులతో బాగా చనువుగా ఉండేవాడు. ఆ దంపతులు అతడి నుంచి వివిధ రూపాయల్లో 14 లక్షల రూపాయల దాకా తీసుకున్నారు. చివరికి డబ్బు లేక ఆ వ్యక్తి కొద్ది రోజులుగా దంపతులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతనికి ఫోన్ చేసిన దంపతులు తమకు ఐ లక్షల రూపాయలు ఇవ్వకుంటే నగ్న వీడియోలను బయట పెడతామని చంపేస్తామని బిదిరించారు.
(14:23) దీంతో ఆ వ్యక్తి కరీంనగర్ శ్రీపురం కాలనీ వద్ద సదరు దంపతులకు లక్ష రూపాయలు ఇచ్చి మిగిలిన సొమ్మును రెండు రోజుల్లో ఇస్తానని బతిమాలుకున్నాడు. చెప్పినట్టు డబ్బు ఇవ్వకుంటే వీడియోలు బయట పెట్టేస్తామని ఆ దంపతుడు బెదిరించారు. ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని బంధువులు మిత్రులకు చెప్పి వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు బాధితుడు సమర్పించిన ఆధారాల ప్రకారం కేస్ నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులైన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరళించారు.
(14:52) పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి కారు నగ్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లు నగదును బాధితుడికు చెందిన చెక్కును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వారి ఉచ్చులో ఎంతమంది చిక్కుకున్నారు? అందులో ప్రముఖులు ఎంతమంది అనే విషయాలపై లోతుగా ఆరాతీస్తున్నారు పోలీసులు. అటు కోర్టు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది.
(15:15) ఇక ఈ కేసులో ఆర్థిక ఇబ్బందులతోనే నిందితులు ఈజీ మనీ కోసం డింపల్ పేరుతో సోషల్ మీడియా ఖాతా తెరిచి ఈ గలీజ్ దందాకు తెరతీశరని పోలీసులు గుర్తించారు. మొత్తంగా సులువుగా డబ్బులు సంపాదించాలని నీచపు ఆలోచనలతో కొంతమంది ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారు. చివరికి పోలీసులకు చిక్కుతున్నారు. అయితే ఇలాంటి ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్న పరువు పోతుందని చాలా మంది బాధ్యతలు బయటకు రావడం లేదు.
(15:41) ఇలాంటి ట్రాప్లలో చిక్కుకుని లోలోనే మదన పడుతున్నారు. అయితే ఎవరైనా మోసపోతే వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
No comments:
Post a Comment