నువ్వు ప్రేమించినంత మాత్రాన వాళ్లు కూడా నిన్ను ప్రేమించాలని లేదు! | Human Nature
Author Name:Charitha
Youtube Channel Url:https://www.youtube.com/@Happylifewith_charitha
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pql0jFWAc6Y
Title: నువ్వు ప్రేమించినంత మాత్రాన వాళ్లు కూడా నిన్ను ప్రేమించాలని లేదు! | Human Nature
Author Name: Charitha
Description: If we love someone with all our heart, we expect them to love us back. We want them to think of us as much as we think of them.
But not everyone thinks like us. They may not return the love we give. They may not understand our feelings.
Should we then feel bad? Should we think there is something wrong with us?
In this video, we will talk about human nature, love, expectations, what we expect from others, and how we should think when others are not like us.
❤️ Love with all our heart.
❤️ Try to understand others.
❤️ But don't judge your worth by the behavior of others.
Remember: You give what you have… they give what they have. Don't expect everyone to be like you.
If you liked this video, like it, share your opinion in the comments. Subscribe to the channel for more such life-related things.
Transcript:
(00:00) హాయ్ ఒక విషయం చెప్పండి మనము ఒక మనిషిని ప్రేమించినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అలాగే ప్రేమించాలని అనుకుంటాం కదా మనం వాళ్ళ గురించి ఆలోచించినంతగా వాళ్ళు కూడా మన గురించి ఆలోచించాలని అనుకుంటాం మనం వాళ్ళని బాధ పెట్టకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటామో వాళ్ళు కూడా మనల్ని బాధ పెట్టకుండా అంతే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం.
(00:23) కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా చాలాసార్లు జరగదు. అక్కడే మనకు బాధ మొదలవుతుంది. మనం ఇచ్చిన ప్రేమను వాళ్ళు తిరిగి ఇవ్వలేదని కాదు మనం వాళ్ళకి ఎంత ముఖ్యమని అనుకున్నాము వాళ్ళకి మనం అంత ముఖ్యం కాదని తెలిసినప్పుడు ఎక్కువ బాధపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారనుకున్నావ్ వాళ్ళతో నీకు చాలా మంచి అనుబంధం ఉంది.
(00:49) వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను నువ్వు నీ సమస్యగా భావిస్తావు. వాళ్ళు బాధలో ఉంటే నువ్వు వాళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్పాలి అని అనుకుంటావు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే నువ్వు నీకు వీలైనంత సహాయం చేస్తావు. వాళ్ళ పుట్టిన రోజు గుర్తుపెట్టుకుంటావు వాళ్ళు చెప్పిన చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటావు. ఎందుకంటే వాళ్ళు నీకు ముఖ్యం కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నీకు ఫుల్ చేయకపోవచ్చు.
(01:14) నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. నువ్వు వాళ్ళకు చెప్పిన విషయాలను కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నేను వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను వాళ్ళు మాత్రం ఎందుకు అట్లా ఆలోచించడం లేదు అని అనిపిస్తది. నేను వాళ్ళకి ఇంత విలువనిస్తున్నాను వాళ్ళు ఎందుకు విలువ ఇవ్వట్లేదు అని అనిపిస్తది.
(01:36) ఇలాంటి అనుభవం చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఏముందో మనం అదే ఇవ్వగలం. వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళు కూడా అదే ఇవ్వగలరు. నీ దగ్గర ప్రేమ ఉంది అందుకే నువ్వు ప్రేమగా మాట్లాడతావ్ ప్రేమను చూపిస్తావ్ నీ దగ్గర ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనసు ఉంది. అందుకే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావ్ కానీ అందరికీ నీలా ఆలోచించే స్వభావం ఉండకపోవచ్చు.
(02:06) కొంతమంది తన ప్రేమను మాటల్లో చూపిస్తారు. ఇంకొంతమంది పనుల ద్వారా చూపిస్తారు. ఇంకొంతమంది వాళ్ళకు ప్రేమ ఉన్నా ఎలా వ్యక్తపరచాలో తెలవకపోవచ్చు. అలాగే కొంతమంది నిజంగా ఎదుటి వాళ్ళ భావాలను పట్టించుకోకపోవచ్చు అందుకే ప్రతి ఒక్కరి ప్రవర్తనకు ఒకటే కారణం ఉండదు కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే మనం ఎలా ప్రేమిస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రేమించాలని ఆశిస్తాం.
(02:35) మనం ఎలాగ ఆలోచిస్తున్నామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఆలోచించాలని అనుకుంటాం. కానీ వాళ్ళు మనలా ఉండరు కదా మనం మన ఇంట్లో పెరిగిన తీరు వేరు వాళ్ళు పెరిగిన తీరు వేరు మన అనుభవాలు వేరు వాళ్ళ అనుభవాలు వేరు మనం ఒక విషయాన్ని చూసే విధానం వేరు వాళ్ళు ఒక విషయాన్ని చూసే విధానం వేరు అలాంటప్పుడు ప్రతి విషయంలోనూ మనలాగే స్పందించాలని ఎలా అనుకుంటాం అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది.
(03:03) ఎదుటి వాళ్ళు మనలా ఉండరని అర్థం చేసుకోవడం వేరు వాళ్ళు మనతో ఎలా పడితే అలా ప్రవర్తించిన భరించడం వేరు ఈ రెండిటిని మనం కలిపి చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకరితో ప్రేమగా మాట్లాడావు. వాళ్ళు ఏదో కారణంతో ఆ రోజు సరిగ్గా స్పందించలేదు. దానికే వాళ్ళకు నీ మీద ప్రేమ లేదని నిర్ణయించాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియకపోవచ్చు.
(03:29) కానీ అదే వ్యక్తి ప్రతిసారి నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ భావాలను పట్టించుకోకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ దగ్గరికి వస్తుంటే అప్పుడు మాత్రం ఆ సంబంధాన్ని నువ్వు ఎలా కొనసాగించాలో ఆలోచించాలి ఎందుకంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిదే కానీ వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నంలో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు.
(03:55) ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎదుటి వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండాలని ఆశిస్తాం. అది సహజం కానీ కొన్నిసార్లు ఆ ఆశ ఎక్కువైపోతుంది. మనం ఒకరికి సహాయం చేశమ అనుకోండి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సమయం కేటాయించాం. వాళ్ళు కూడా మనకు అవసరమైనప్పుడు అలాగే చేయాలని అనుకుంటాం. వాళ్ళు అలా చేయనప్పుడు మనం వాళ్ళ కోసం చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుంటాం.
(04:23) వాళ్ళ కోసం నేను ఇంత చేశాను కానీ వాళ్ళు నాకోసం ఏం చేశారు అని బాధపడతాం అయితే ఒకసారి మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి మనం వాళ్ళకి సహాయం చేసినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చేసామా లేక వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనకు అదే చేస్తారని ఆశతో చేసామా ఈ ప్రశ్న మనకు మనల్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీని అర్థం ఎవరిని నమ్మకూడదు అని కాదు ఎవరిని ప్రేమించకూడదు అని కూడా కాదు మనం చేసిన మంచిని ఎదుటి వాళ్ళు తిరిగి చేయకపోయినా వాళ్ళని తప్పు పట్టకూడదు అని కూడా కాదు కేవలం మనం చేసే ప్రతి పనికి ఎదుటి వాళ్ళ నుంచి అదే తిరిగి రావాలని ఆశించకుండా ఉండడం నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా సహాయం చేయగలిగితే చేయాలి
(05:09) ప్రేమించగలిగితే ప్రేమించాలి కానీ మనకు సాధ్యం కానప్పుడు మన పరిమితులను కూడా గుర్తించాలి ఎవరైనా మిమ్మల్ని ప్రేమించడం లేదని మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మన విలువ తగ్గిపోదు ఒక పువ్వు అందరికీ నచ్చకపోతే ఆ పువ్వు అందంగా లేదని అర్థమా కాదు కదా అలాగే నువ్వు మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరికి నచ్చకపోవచ్చు నువ్వు ప్రేమగా ఉన్నా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేకపోవచ్చు అందుకని నీలో ఉన్న మంచితనాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం గుర్తుంచుకో నీ ప్రేమను అర్థం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నీ ప్రేమను నిర్పించుకోవడానికి ప్రయత్నించకు నీ
(05:50) విలువని గుర్తించని చోట పదే పదే నీ విలువ ఏంటో చెప్పడానికి నీ టైం ఖర్చు చేయకు కొంతమంది మనల్ని అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు కొంతమంది మన జీవితంలో కొంతకాలమే ఉంటారు. ఇంకొంతమంది జీవితాంతం మనతో ప్రయాణిస్తారు. ప్రతి ఒక్కరూ మనతో మనం ఆశించినంత అనుబంధాన్ని కలిగి ఉండాలని లేదు. దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి.
(06:19) అయితే మనం కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం కూడా కొన్నిసార్లు వాళ్ళకి బాధపెట్టి ఉండొచ్చు. మన ప్రవర్తన వల్ల వాళ్ళు కూడా బాధపడి ఉండొచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళ తప్పులనే చూడకుండా మనల్ని మనం కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. అదే సమయంలో ఒక సంబంధంలో ప్రేమతో పాటు గౌరవం పరస్పర శ్రద్ధ కూడా ఉండాలి. ఎప్పుడూ ఒకరే ప్రయత్నిస్తూ ఒక్కరే బాధపడుతుంది.
(06:46) ఆ సంబంధాన్ని ఎలా కొనసాగించాలో ఆలోచించాలి. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే నీ దగ్గర ప్రేమ ఉంది కాబట్టి ప్రేమను పంచు నీ దగ్గర మంచితనం ఉంది కాబట్టి మంచిగా ఉండు కానీ ఎదుటివాళ్ళు నీలా లేరని చెప్పి నీలో ఏదో లోపం ఉందని అనుకో నువ్వుఇచ్చే ప్రేమ నీ స్వభావాన్ని చూపిస్తుంది. ఎదుటివాళ్ళు దానికి ఎలా స్పందిస్తారు అనేది వాళ్ళ స్వభావాన్ని వాళ్ళ ఎంపికను చూపిస్తుంది.
(07:14) నీ దగ్గర ప్రేమ ఉన్నట్టే వాళ్ళ ద్వేషం ఉంటే ద్వేషం ఇస్తారు. కోపం ఉంటే కోపం చూపిస్తారు. వాళ్ళ దగ్గర అదే ఉంది కాబట్టి వాళ్ళు అదే ఇస్తారు. అందరూ నీలా ఉండాలని ఆశించకు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అది మాత్రం మర్చిపో

No comments:
Post a Comment