Sunday, October 25, 2020

దృశ్యంలో ఏమీ లేదు..

*"""దృశ్యంలో ఏమీ లేదు.."""

ప్రబుద్ధత్వం తో వున్న వాణ్ణి స్వర్గంలో వదిలితే
ఆ పూల కలర్ అలా కాకుండా ఇలా వుంటే బాగుండేది..
ఆ మేనక ముక్కు ఇంకొంచెం పొడవుగా వుండాల్సింది...
అమృతం ఇంకాస్త తీయ్యగా వుంటే బాగుండేది అంటాడు..

అదే బుద్దున్ని ఒక నరకంలో వదిలినా సరే
అన్నీ అద్భుతంగా దర్శిస్తాడు...ఆహా ఏమి అందం..
ఆ ఎడారి అందం,,,ఆ కంపముల్లు అందం,,,ఆహా మహా
అద్భుతం ...ఆహా ఏమయ్యా సృష్టికర్త...నీ రచనే రచన అంటాడు...

దృశ్యంలో ఏమీ లేదు...దాన్ని దర్శించే తత్వంలోనే అంతా వుంది....బుద్ధత్వం కలిగేది కాదు... కలిగించు కునేదీ కాదు..
మనం మనంగా ,,,సహజంగా,,,మనతో మనం వుంటే అది
దానంతట అది ప్రవహిస్తుంది....ధ్యానసాధన అంతా కూడా..
మన మనస్సును శూన్యత చె0దించడమే....బుద్దత్వం అనేది
మనస్సు శూన్యత లోంచి ప్రవహించేదే....

Aayath..🙏❤️🙏❤️

Source - Whatsapp Message

No comments:

Post a Comment