🧘🏼♀️ నిత్యజీవితంలో ధ్యానం

🌱 జీవితంలో సాటిలేని ఆనందం - ధ్యానం అంటే ఏమిటి?🌱🧘🏼♂️🍁🧘🏼♀️🍁

🔺 మొదటి తెలుసుకోవలసిన విషయం ధ్యానం అంటే ఏమిటి? అని.

🔺 తర్వాత తగ్గినదా అంతా దాన్ని అనుసరిస్తుంది. మిమ్మల్ని ధ్యానం చేయమని నేను చెప్పను. ధ్యానం అంటే ఏమిటో మీకు వివరిస్తాను. మీరు నన్ను అర్థం చేసుకుంటే మీరు ధ్యానంలో ఉంటారు.

🔺 ఉండి తీరాలని ఏమీ లేదు. మీరు నన్ను అర్థం చేసుకోకపోతే ధ్యానంలో ఉండరు.

🔺 అందుకే మనసు ద్వారా మీరు ధ్యానాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే అది ఎప్పుడు ఆలోచనలతో కొనసాగుతూ ఉంటుంది. మనసును పక్కన పెట్టినప్పుడు మాత్రమే ధ్యానం వీలవుతుంది. నిర్మలంగా, నిష్పక్షపాతంగా, మనస్సు తో సంబంధం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది. మనస్సు తో సంబంధం లేకుండా సాగిపోతున్న మనసును చూసినప్పుడు నేను ఆ మనస్సు కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ధ్యానం వీలవుతుంది.

🔺 నేను మనస్సు కాదు అన్న చైతన్యమే ధ్యానం. ఆ మెలకువ గృహ మీలో మరింత మరింత గాఢంగా నేర్పితే, మెల్లమెల్లగా కొన్ని లక్షణాలు వస్తాయి. అవి నిశ్శబ్ద క్షణాలు, స్వచ్ఛమైన క్షణాలు, నింపుకున్న క్షణాలు, కొన్ని పారదర్శక క్షణాలు, మీలో ఏదీ కథలని, ప్రతిదీ నిశ్చలంగా ఉన్న క్షణాలు వస్తాయి. ఆ నిశ్చల క్షణాల్లో మీరు ఎవరో మీకు తెలిసి వస్తుంది. ఆ అస్తిత్వ రహస్యం మీకు అవగాహనకు వస్తుంది.

🔺 మెల్లి మెల్లిగా ఓ రోజు వస్తుంది. గొప్ప దీవెన అందుకున్న రోజు, ధ్యానం అన్నది మీ సహజ స్థితి అయిన రోజు వస్తుంది.

🔺 మనసు ఒకానొక అసహజ స్థితి. అదెప్పుడు మీ సహజ స్థితి కాదు. కానీ ధ్యానం అన్నది సహజ స్థితి. దాన్ని మనం కోల్పోయాం. అది కోల్పోయిన స్వర్గం. కానీ ఆ స్వర్గాన్ని మనం తిరిగి పొందవచ్చు. పసిపాప కళ్ళలోకి చూడు. అక్కడ అద్భుతమైన నిశ్శబ్దం, అమాయకత్వం కనిపిస్తుంది. ప్రతి పసిపాపా ధ్యాన స్థితిలోనే ప్రపంచం లోకి వస్తుంది. కానీ మనం వాళ్లకు ప్రపంచ మార్గంలో ప్రయాణించమని చెబుతాం. ఎలా ఆలోచించాలో, ఎలా లెక్క పెట్టాలో, ఎలా హేతుబద్ధంగా ఉండాలో, ఎలా వాదించాలో భోదిస్తాం. మాటలు, భాష, ఉద్దేశాలు చెబుతాం. మెల్లమెల్లగా పసి పిల్లలు తమ అమాయకత్వం తో సంబంధం కోల్పోతారు. సమాజం వాళ్ళని మలిన పరుస్తుంది, కలుషితం చేస్తుంది. వాళ్లు శక్తివంతమైన యంత్రంగా మారుతారు. మనిషి గా ఉండడం మానేస్తారు.

🔺 అవసరమైనది ఏదంటే కోల్పోయిన ఆ అవకాశాన్ని మళ్లీ అందుకోవడం. అది మీకు అంతకు ముందే తెలుసు. కాబట్టి మొదటి సారి మీరు ధ్యానాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతకుముందే అది మీకు తెలుసు అన్న అపూర్వ అనుభూతి మీలో ఉప్పొంగుతుంది. ఆ అనుభూతి నిజమైంది. అది మీకు అంతకు ముందే తెలుసు. కానీ మీరు మర్చిపోయారు. వజ్రాన్ని దుమ్ములో కోల్పోయారు. ఆ దుమ్మును పక్కకు తోస్తే మీకు మళ్ళీ వజ్రం కనిపిస్తుంది. అది మీది. నిజంగా దాన్ని మీరు కోల్పోలేదు. దాన్ని మరిచిపోయారు, అంతే.

🔺 మనం పుట్టేటప్పుడు ధ్యనులు గానే పుట్టాం. తర్వాత మనసు మార్గాలను తెలుసుకున్నాం. మన అసలు తత్వం ఎక్కడో లోలోతుల్లో కనిపించని ప్రవాహంలాగా మరుగున పడిపోయింది. ఒక్కసారి కొద్దిగా తవ్వి చూస్తే ఇప్పటికీ ప్రవహిస్తున్న ఆ ప్రవాహం మీకు కనిపిస్తుంది. అది తాజాగా ఉన్న నీటికి ఆధారం. ఇక్కడ జీవితంలోని అత్యున్నతమైన ఆనందం కనిపిస్తుంది.

Source - Whatsapp Message

No comments:
Post a Comment