Monday, November 16, 2020

సాంగత్యం ఎలా ఉండాలి? కధ

సాంగత్యం ఎలా ఉండాలి? కధ

ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఏమి దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది, ఎవరో పడుకున్నాడు, అతనిపై నీడ రావడం లేదు, కలత చెందుతున్నాడని, అతనిపై ఎండవస్తోంది అని గమనించి, ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.

కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడ ఇచ్చి సేవ చేసాను. నీవు నన్ను చంపావు. ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది.

అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు. నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు. నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి.
నీ ఆచారాలు స్వచ్ఛమైనవి. నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు,
కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది.
ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.

అందుకే మన పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని.

సత్సంగత్వే - నిస్సంగత్వం
నిస్సంగత్వే- నిర్మోహత్వం,
నిర్మొహత్వే - నిశ్చల తత్వం,
నిశ్చల తత్వే - జీవన్ముక్తి:

Source - Whatsapp Message

No comments:

Post a Comment