Wednesday, November 18, 2020

ఆరోగ్యమే అందం!

ఆరోగ్యమే అందం!
-------------------------
ఆరోగ్యమే అసలైన అందం..ఐతే
ఆధ్యాత్మికత కూడా వుంటేనే
అది.. అసలైన ఆరోగ్యం. ఎలా!?
ఓ మనిషి
ప్రాథమికఅవసరాల కోసమే పాట్లు
పడుతూవుంటే కాయకష్టంవల్ల
శరీరాన్ని పట్టించుకోలేక ఆరోగ్య
సమస్యలూ వుండొచ్చు. పోనీ..
ఓ మనిషి
అవసరాన్ని మించి సంపాదనతో
క్షణం తీరికలేకుండా వుంటే మనో
ఒత్తిడివల్ల అపుడూ అనారోగ్య
సమస్యలు వుండొచ్చు. కనుక

పని, విశ్రాంతి, ఆహారం మూడూ..ఎవరి
జీవితంలో సమన్వయంతో తగినంతగా
ఉంటాయో అదే ఆరోగ్యం. అదే అందం
కూడా. ఐతే..
ఆ మూడూ
సమన్వయంలో ఉండేది ఆధ్యాత్మిక
దృష్టికోణం కూడా మనలో వికసించి
ఉన్నపుడే. ఆధ్యాత్మిక అంటే కనిపించే
శరీరంలో ఇమిడివున్న కనిపించని
శక్తుల గురించిన జ్ఞానాన్ని పొందటం.

మనసులాగే
శరీరంలో ప్రాణమూ, జ్ఞానమూ, ఆనందమూ
ఒకదానిలోఒకటి ఇమిడివున్నాయి (ఉల్లిలోని
పొరల్లా) యోగులు వీటినే 7 కోశాలు లేదా
7 శరీరాలంటారు. అవి.
1 అన్నమయ కోశం..అన్ని చూడగలదు
2.ప్రాణమయ కోశం..అన్ని గ్రహించగలదు.
3. మనోమయ కోశం..గతాన్ని చూడగలదు
4..ఆనందమయ కోశం..భవిష్యత్తుని చూడగలదు
5. విజ్ఞాన మయ కోశం విశ్వగతాన్ని చూడగలదు
6. విశ్వమయ కోశం విశ్వభవిష్యత్తుని చూడగలదు
7.నిర్వాణమయ కోశం..ఇది మనలోవున్న విశ్వశక్తి

ఇలా ప్రతి శరీరాన్ని
అది ఉపయోగించుకునే ప్రక్రియలను కూడా
ధ్యానయోగంలో వివరించారు. పైపైన వుండే
రూపాన్ని చూస్తున్నాం తప్ప..అసలైన అందం
గురించి గానీ; ఆరోగ్యం గురించి గానీ; అందుకు
చేయాల్సిన సాధన గురించిగానీ; శ్రద్ధ వహిస్తు
న్నామా మరి ?!

Source - Whatsapp Message

No comments:

Post a Comment