Wednesday, November 18, 2020

శ్రీ రమణ మహర్షి బోధనలు

🌞శ్రీ రమణ మహర్షి బోధనలు 🌞

ప్రశ్న: నా ప్రమేయమేమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేననుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా ?

జవాబు: ప్రతి పనికీ ఫలితముంటుంది. ప్రారబ్ధవశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు దానికి. వచ్చిన దానిని ఏ మమకారమూ లేకుండా, అదే ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకే కీడూ వాటిల్లదు. దానివల్ల మళ్ళీ జన్ననెత్త వలసి రాదు. అలాకాకుండా, ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటే, మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది.

✨⚡️✨⚡️✨⚡️

ప్రశ్న: సంకల్పమంటూ ఏమైనా ఉందా అసలు ?

జవాబు: ఎవరి సంకల్పం ? కర్తృత్వ భావమున్నంత కాలం అనుభవముంటుంది. వ్యక్తి సంకల్పమూ ఉంటుంది.

ఆత్మ విచారం వల్ల ఆ భావం పోతే, దైవసంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తుంది. విధిని జ్ఞానం, ఆత్మజ్ఞానం అతిక్రమిస్తుంది. ఆత్మజ్ఞానం సంకల్పానికీ, విధికీ అతీతం.

✨⚡️✨⚡️✨⚡️

ప్రశ్న: దేనినైనా చేయటానికి మనిషికి గల స్వేచ్ఛ, బాధ్యతల మాట ఏమిటి?

జవాబు: మనిషికి గల స్వేచ్ఛ ఒక్కటే. ప్రయత్నించి, దేహాత్మబుద్ధిని తొలగించే జ్ఞానాన్ని సంపాదించటమే. ప్రారబ్థం వల్ల అనివార్యమైన కలాపాలను శరీరం చేస్తుంది. దేహంతో తాదాత్మ్యం చెంది దాని ఫలితాలని అనుభవించటానికి గాని, ఆ తాదాత్మ్యం లేకుండా కేవలం సాక్షీభూతుడుగా ఉండటం గాని మనిషి చేతుల్లో ఉంది.*

Source - Whatsapp Message

No comments:

Post a Comment