Wednesday, November 18, 2020

ప్రేమ Vs కర్మ...

ప్రేమ Vs కర్మ... 🌸

🌸 ప్రేమ అనేది లేకుండా ఏది చూడలేము... కారణం అన్ని ప్రేమ నుంచి వచ్చినవే.. అరిషెడ్వర్గాలు దగ్గర నుండి అన్ని రకాల బావావేశాలు వరకు... అంటే ఉన్నది ప్రేమ... పొందుతున్నది ప్రేమ..
పంచుతున్నది కూడా ప్రేమే... కానీ ఇదంతా మనం మన అంతరంతో దర్శిస్తేనే... లేకపోతే కర్మ... మరి కర్మ అంటే పని... ఏమిచెయ్యకుండా ఉంటే కర్మ నుంచి తప్పించుకోగలమా... ఖచ్చితంగా కుదరని పని.. అంటే మనం శ్వాసించినా కర్మే.. ఇంకా కర్మ నుంచి తప్పుకునేది ఎక్కడ... మరి కర్మ ఎందుకు పుట్టింది... అనేది ప్రశ్న...🤔

🌸 కర్మలు మూడు రకాలు.. సంచిత, ప్రారబ్ద, ఆగామి కర్మలు... మనం ఏమి చేసినా ఇందులోనుండే... మన జీవితం కర్మ చెక్రంలో ఉంటే ఈ మూడింటి మధ్యలో ఉంటుంది.. అంతవరకు బాగానే ఉంది... ప్రేమకు ఇలాంటి పరిధులు లేవు...
ఎప్పుడైనా ఎవరినైనా ఎలా అయినా ప్రేమించవచ్చు.. అది మనుషులా, జంతువుల, ప్రకృతా అనేది విషయమే కాదు.. విషయం ఏమిటంటే ప్రేమించే వ్యక్తి నుండి ప్రేమ వ్యక్తీకరణ జరిగుతున్నది అదే ప్రామాణికం... ఇప్పుడు మనకు అర్ధమైంది ఎమిటంటే మనకు మనం నచ్చిన విధంగా ఉంటే ప్రేమ.. ఇష్టం లేకుండా ఉంటే... అది కర్మ అని అనుకుంటే కర్మ ప్రేమకు వ్యతిరేకంగా ఉందా..? లేదా ప్రేమను వదిలి వచ్చినందుకు శిక్షణ...? ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే... ప్రేమను ఒకరిపై లేదా ఒక కుటుంబం వరకు ఉంటే కర్మ... అదే విశ్వవ్యాప్తంగా అయితే విశ్వజనీన మైన ప్రేమ... ప్రేమను వ్యక్తపరచడానికి మనకు వేదిక కావాలి... ప్రేమను అనుభూతి చెందాటానికి ఓ ఆధారం కావాలి... అంత ప్రేమే అని తెకుసుకోవాలి అంటే అనేక జన్మలుగా పరిశోధన చెయ్యాలి.. పునరపీ జననం పునరపీ మరణం అనేది ప్రేమకోరకె అనేది అర్ధమౌతుంది.. ఇది ప్రేమ వైపు ఆలోచించేవారి వైపు కోణం అనుకుందాం... కర్మ వైపు ఆలోచించాలి అంటే... మనం ఎన్నిరకాలైన ఆలోచనలు చేసిన చెరగని ఆనందం ఉండేది ప్రేమలోనే... కర్మ వైపు ఆలోచనలు చేస్తే ఆనందం దొరుకుతుందా...??

🌸 కర్మ అనేది విచ్చలవిడితనం పెరగగకుండా మన పెద్దలు ఏర్పరచిన చక్కటి దారి... లేదా ధర్మం.. కర్మను అర్ధం చేసుకుని అధిచ్చే మదురఫలాలను అందకుండా చేసి శత్రువుగా చుపించిన కొంతమంది మిగిలిన వారిని అదుపు చేయ్యాడానికి వాడుకున్న ఆయుధంగా అయ్యేసరికి కర్మకు భయపడుతున్నా0... కానీ వాస్తవంగా సహజంగా జీవించడానికి తోటివారిని జీవింప చెయ్యటానికి ఏర్పరచిన చక్కటి దారి... ఈ దారికూడా అందరిని సమబావంతో చూడటానికి లేదా అంతఒకటే తెలుసుకోవడానికి ఏర్పరచిన రాచబాట... ప్రకృతిలో ఎలాంటి విపత్తు వచ్చిన చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఏర్పడటానికి ఇచ్చిన బహుమతి కర్మ... కర్మను అర్ధం చేసుకుంటే అంతర్లీనంగా ఉండేది ప్రేమే... ప్రేమను అంతా ఒకేలా చూస్తారు అనుకుంటే ఒకే ప్రామాణికం ఉండేది... ఎవరి దృష్టిలో వారు చూస్తారు కాబట్టే ఇలా మార్పు చేసి అందించారు... ఏదైనా చేసేందుకు మనకు శక్తి కావాలి... అందరి నుంచి శక్తి అందితే చేసే పని సులభం.. ఒక్కరే చెయ్యాలి అంటే సులభ సాధ్యం కాదు... కర్మ ప్రక్షాళన కొరకు అంటే ప్రతి ఒక్కరూ తమ వంతు చేస్తారు... అంటే ప్రేమను వ్యక్తీకరణ చెయ్యటానికి అది కూడా ఒక మార్గం... జలపాతంలో నీరు తీసుకోవాలి అంటే ఇబ్బంది... సాధారణంగా సాగే నీటి ప్రవాహం లో నీటిని అందుకోవడం తేలిక... తేలికగా ఉండటం కోసం ఏర్పరిచిందే కర్మ...

Karma means nothing but Love..

Thank you...🌸🌸🌸

🍀🌸🌲💖🧚‍♀️

Source - Whatsapp Message

No comments:

Post a Comment