Sunday, November 15, 2020

ఆనందం...

*ఆనందం... ఆనందం కోసమే మనం చేసే ఏ పని అయిన సాధన అయిన స్థిరంగా ఏ పని చేయకపోయినా... ఆనందం కోసమే..
తెలుసుకోవడమే...ఆనందం.
నేర్చుకోవడమే.... ఆనందం.
నేర్పించటమే... .. ఆనందం. లయమవ్వడమే... ఆనందం.
ఆనందంగా ఉంటే ఏమౌతుంది..? లేకపోతే ఏమౌతుంది.. ? ఒకప్పుడు ఏ పని చేసినా అందులో లయమౌతూ నైపుణ్యంగా మారిపోతు అదే మనము అనే స్తితి అందరిదీ... కారణం ఉరుకులు పరుగులు లేకపోవడమే.. ఇప్పుడు ఆనందం నుండి సంతోషంగా ఉంటే చాలు అనే స్థితికి వచ్చేసాం.. తరువాత సుఖంగా స్థిరపడితే చాలు అనుకుంటున్నాం అనేది ఇప్పుడు జరుగుతున్న స్తితి.. ఈ మూడు స్థితులు మన జీవితంలో ఎలా వస్తున్నాయో గమనిస్తే... మళ్ళీ తిరిగి ఆనంద స్థితిలో స్థిరపడతాం...

🌸 ఏపని చేసిన ఆనందం కోసం అనేది 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు.. 34 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు సంతోషంగా ఉంటే చాలు.. 56 నుండి మన జీవితం చివరివరకు సుఖంగా ఉంటే చాలు అనేది ఇప్పటి మాట..
18 సంవత్సరాల వయసులో సాహసం చెయ్యటానికి ఏదైన ముఖ ముఖి తెల్చుకోవాలి లేదా ఏదైనా మన ముద్ర ఉండాలి అనేది అందరికి ఉండేదే... ఇక్కడే సరైన లక్ష్యం ఏర్పర్చుకుంటు ముందుకెళ్లే స్థితి... ఇక్కడ ఆశల పల్లకి కన్నా ఆచరణ దారిలో నడిచిన వారు ఎక్కువగా ముందువరుసలో ఉంటారు... ఇదే స్థితిలో పెళ్లి ఎప్పుడైతే జతను తీసుకొస్తుందో అక్కడ ఎగసివచ్చే అలల ఉద్వెగం చల్లబరుస్తూ లక్ష్యాన్ని మార్చుతోంది... అప్పటికే లక్ష్యం మనలో స్థిరపడితే ఆనందం అనేది మన ప్రతి అడుగులో కనపడుతుంది...
ఇక్కడ ఎవరైతే జతగా ఉన్నారో.. వారికి లక్ష్యాన్ని వివరించి ముందుకు సాగగలిగితే ఉండేది విజయ యాత్ర... చెరోదారి అయిన కొంచం ఆలస్యం అయిన విజయాన్ని అందుకోవచ్చు..

🌸 33 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి పిల్లలు ఎదుగుతూ మనల్ని అనుసరించటం మొదలుపెడతారు... ఇదే జావితానికి అతి సున్నితమైన మలుపు... ఇక్కడ భార్యాభర్తలు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా జీవితానికి చిరునవ్వు జోడించి నడపగలిగితే ఆ కుటుంబం వరకు ఆనందానికి డోకా ఉండదు... కావలసింది కొద్దిపాటి వివేకం.. ఇవన్నీ జీవితంలో అనుభవం ద్వారా లభించేవి... కానీ18 సంవత్సరాల వయసు కన్నా ముందే ధ్యానం పరిచేయం అయితే... ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి మాటలో ఆనందం తొణికిసలాడుతుంది అనేది అక్షర సత్యం... లక్ష్యం అనాయాసంగా చేరతా0.. సునాయాసంగా జీవిస్తాం.. కారణం మనం ఏ పని చేస్తే మనలోపల ఆనందం కొన్ని రేట్లు పెరుగుతుందో ఆటే మన ప్రయాణం ఉంటుంది... ఇంకా దేనికోసం ఎదురు చూడకుండా ఉన్న ఆనందాన్ని అందరికి పంచుతూ ఆనందోబ్రహ్మ గా మారిపోతాం... అప్పుడు అనవసరమైనవి మన దరికి రానే రావు అనేది అనుభవైక వాస్తవం...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment