Monday, November 16, 2020

జీవితం.. మనకు ఊపిరి ఉన్నంత వరకు.. ఒక విశ్వవిద్యాలయం... మనం విద్యార్థులమే...

జీవితం పూల బాట అని ఎవరైనా చెబితే అది అసత్యం.. నవ్వులుంటాయి ..కన్నీళ్లు ఉంటాయి..పూలు ఉంటాయి.. ముళ్ళు ఉంటాయి...ఎత్తు పల్లాలుంటాయి..ఆగ్రహాలుంటాయి..ఆవేదనలుంటాయి..వీటన్నింటినీ సమర్ధవంతంగా సమన్వయ పరుచుకుని నడవడమే జీవితం..

అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు..
అదే ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు..అందరూ ఉన్నా లేకున్నా.. అందరినీ మించిన దైవం..మనకు తోడుగా ఉండటం..అదృష్టం.. భగవంతుడు అనేది నమ్మకం..ధైర్యం.. మనకు తోడు ఒకరు ఉన్నారనే ఓ భరోసా.. దానికి రూపం..సాక్ష్యం.. చూడటం..చూపడం..ఇలాంటివి ఉండవు..అది ఆత్మానుభూతి అంతే..

నిజాన్ని చెప్పకపోవడాన్ని అబద్దం అంటారు.. అబద్ధాన్ని నిజమని ఒప్పించడాన్ని మోసం అంటారు..*

మనకు సంతోషం నేర్పలేని ఎన్నోవిషయాలు..కన్నీళ్ళునేర్పాయి...గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ..ఓటమి నేర్పింది.. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు..మోసం నేర్పింది..అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని...
జీవితం.. మనకు ఊపిరి ఉన్నంత వరకు.. ఒక విశ్వవిద్యాలయం... మనం విద్యార్థులమే...
👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment