Monday, November 16, 2020

మనం మాత్రం ఆ దేవుడి కోసం, శాంతి కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాము.

మనలొనే వున్నాడు...
. పూర్వకాలంలో ఒక అందమైన జింక రొజంతా అడవిలో చెట్లమద్య గంతులు వేస్తూ కాలం గడుపుతుండేది.ప్రతిరోజూ దానికి ఒక అధ్బుతమైన సువాసన ముక్కుకి తగులుతుండేది. ఆ సువాసన వానకంటే పూల వాసనకంటే ఎంతో బాగుండేది. నిజం చెప్పాలంటే అంత సువాసన, అంత అధ్బుతమైన సుగంధం ఎప్పుడూ దానికి ఎన్నడూ తెలియదు.అంత కమ్మని సువాసన ఎక్కడినించి వస్తున్నదో దానికి తెలియటంలేదు. ఆ జింక ఇలా వాసనచూస్తూ చెట్ల మద్య తిరుగుతూ “అబ్బా ఈ సువాసన బహుశా చెట్టు నుంచి వస్తున్నదేమో!”అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళితే చెట్టు వాసన మామూలుగానే ఉన్నది.
అన్ని చోట్లా వాసన చూస్తూ జింక అడవి అంతా తిరిగింది.” ఈ సువాసన సీతాకొక చిలుకల నించి వస్తున్నదా? చూడు చూడు వాసన చూడు ….లేదు లేదు వాటినించి రావటంలేదు.”రాబిన్” నుంచి వస్తున్నదా?… లేదు లేదు అక్కడినించి కూడా కాదు.” అని తనలో తానే ఆశ్చర్య పడుతూ అన్నింటిని వాసన పీల్చి చూస్తున్నది. ఒక వేళ అక్కడి చిత్తడి నేల నుంచి వస్తున్నదా? ఊహూ కాదు!బహుశా అక్కడ ఉన్న పాదుల నుంచి ,తుప్పల నుంచి వస్తున్నదా అని మళ్ళీ మళ్ళీ వాసన చూసింది. ఊహూ… కానే కాదు కాని సువాసన మాత్రం దాని ముక్కుకి సోకుతూనే ఉన్నది. కానీ ఈ అడవిలో దేని నుంచి ఈ సువాసన రావటంలేదు. మరి ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తున్నది.” అనుకుంటూ ఆ జింక తనలో తానే తికమక పడుతున్నది.
చాలా దూరం ఆ జింక పరుగులు పెట్టింది, గెంతింది,దూకింది, నాట్యం చేసింది. ఈ అపురూపమైన వాసన ఎక్కడినుంచి వస్తున్నదా అని అది పరిశీలిస్తూ, ఆ సువాసన మూలం కోసం వెతికింది.
అలా వెతికి వెతికి ఆ జింక విసిగిపోయింది.అలిసిపోయింది. “ఎలా అయినా సరే ఈ వాసన ఎక్కడినుంచి వస్తున్నదో కనుక్కునే తీరతాను? అని పట్టుదలతో మళ్ళి వెతకటం ప్రారంభించిది. ఏ మాత్రం ఓపిక లేకపోయినా పరిగెత్తి, పరిగెత్తి అలా పరిగెత్తుతూ వెతుకుతూనే ఉన్నది. ఇక్కడా, అక్కడా, అన్నిచోట్లా,అన్నింటినీ వాసన చూస్తూ పరిగెడుతున్నది. “నా శరీరానికి ఇంక శక్తి చాలటం లేదు. అయినప్పటికి ఈ అధ్బుతమైన సువాసన ఎక్కడినుంచి వస్తున్నదో నేను కనిపెట్టి తీరుతాను.”అనుకున్నది.

శరీరానికి వేగం తగ్గినా అలా వెతుకుతూనే ఉన్నది.ప్రయత్నిస్తూనే ఉన్నది. ఆఖరికి ఆ జింక ఇంక వెతకలేక నేలపై పడిపోయింది.
అలా నేలమీద శరీరం పడిపోయినప్పటికి , మనసులో మాత్రం ఇంకా ఆ వాసన మూలం కనుక్కొవాలని దానికి అనిపుస్తున్నది. ఇంతలో దానికి ఆ సువాసన గుప్పున వచ్చింది.” ఇదే ఇదే ఆ సువాసన!ఈ వాసన మూలం కనుక్కోవాలనే నేను ప్రయత్నంచేస్తున్నాను.! ఔను ఆ సువాసన ఇదే!.” అనుకున్న్నది జింక.
కాని ఆ సువాసన ఎక్కడినుంచి వస్తున్నది??? క్షణంలో అది ఒక విషయాన్ని గ్రహించింది.”ఓయి భగవంతుడా! ఈ వాసన నాలోనుంచే వస్తున్నది. ఇంతకాలం నుంచి ఈ సువాసన నాలోనుంచే వస్తున్నది.” అని ఇంతో అన్నందంగా నవ్వుకుని, హాయిగా,ప్రశాంతంగా నిద్రపోయింది.
ఔను నిజమే ! ఆ వాసన ఆ జింక లోనుంచే వస్తున్నది. భగవంతుడు కూడా అంతే.భగవంతుడు కూడా బయట ఎక్కడో ఉన్నాడని జనులు అనుకుంటూ ఉంటారు.కాని, భగవంతుడు ఎల్లప్పుడూ మనలోనే ఉంటాడు.మనకి దూరంగా ఎప్పుడూ లేడు. మనలోనే, మనచుట్టూ, మనతోనే ఉంటాడు.చాలా కాలం వెతికి వెతికి చివరికి జింక తననుండే వస్తున్న వాసనని గుర్తించినట్లే జగత్ప్రభువు కూడా మనలోనే ఉన్న విషయం తెలుసుకోవాలి.

మనం అంతర్ముఖులై ,
మన అంతరంగంలో వెతికి చూస్తే భగవంతుడు , శాంతి మనసులోనే ఉంటాయి.. కాని, మనం మాత్రం ఆ దేవుడి కోసం, శాంతి కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాము.👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment