Wednesday, December 9, 2020

ఎరుక

ఎరుక

✍️ మురళీ మోహన్

👉మరణించే సమయంలో ఎరుక కలిగివుండాలి అంటే, ఆ ఎరుక కలిగి ఉండడం అనేదాన్ని జీవితాంతం అభ్యాసం చేయాలి. ఇలా స్పృహతో మరణించిన వారి మరుజన్మ కూడా స్పృహతో నిండివుంటుంది. ఆ స్పృహ కలిగివుండడం అనేది ఎలా సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండే ప్రారంభించండి. ఏ పని చేస్తున్నా స్పృహతో చేస్తూ ఉండడం మొదలెట్టాలి. మాటి మాటికి ఆ స్పృహ జారిపోతూ ఉంటుంది. దాన్ని తిరిగి పట్టుకుంటూ ఉండాలి. దారిలో వెడుతున్నారు అంటే ఆ స్పృహ కలిగివుండాలి. భోజనం చేస్తున్నారు అంటే ఆ స్పృహతో చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అనుకోండి ముందుగా మీ స్పృహని సరిచేసుకుని స్పందించండి. వాణి, విచారణ, ఆచరణ..... ఈ మూడు విషయాలు స్పృహ కలిగివుండి చేసేలా మీరు సాధన చేయాలి. నేను ఏమిటో, నేను ఏది ఆలోచిస్తానో, నేను ఏది ఆచరిస్తానో.....అది స్పృహతో ఉంటే సరిపోతుంది. స్పృహతో లేకపోవడం వలననే మనం దుఃఖాన్ని ఆహ్వానిస్తాము.

సద్గురువులు ఒక వ్యవస్థని నెలకొల్పి, సాధకుల అంతఃకరణ, సాధకులు చేసే సాధన ద్వారా శుద్ధము అయ్యేలా చూ స్తారు. ఎందుకంటే సాధన చేయడం మొదలవడానికి ముందు, సాధన చేస్తున్నప్పుడు, హృదయం శుద్ధముగా ఉండాలి. శక్తి యొక్క ఘటన జరగడానికి ముందు అంతఃకరణ శుద్ధముగా ఉండాలి. అలా ఉండకపోతే మేలు జరగడానికి బదులు కీడు జరుగుతుంది.

ధ్యాన ప్రక్రియలు అన్నీ మీరు ఏది కాదు అనేది మీరు తెలుసుకోవాలని ఆశిస్తాయి. "నేను ఇది కాదు, నేను ఇది కాదు" అంటూ ఖండించుకుంటూ పోవాలి. ఏది కనబడుతోందో, ఏది జ్ఞేయం అవుతోందో, ఏది ఆబ్జెక్ట్ గా వుందో, దాన్ని వదిలివేస్తూ పోవాలి, ఎలిమినేట్ చేసేయాలి. ఎక్కడ కేవలము తెలుసుకోవలసిన వాడున్నాడో, అక్కడే మనం నుంచుని ఉండాలి. అది అంతర్యామి. ఎవరు లోపల దాగివున్నారో, ఎవరికి అన్నీ తెలుసో, ఎవరిని మనం వేరొకరి ద్వారా తెలుసుకోలేమో, ఆయనే మూలము. మన లోపలి అంతర్యామిని పట్టుకుంటే, మనం అదే అని తెలుసుకుంటాము.
అహం బ్రహ్మస్వి.🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment