Friday, December 4, 2020

ఆధ్యాత్మిక వివరణ ఎవరైతే ఇంద్రియాలను ఇంద్రియసుఖాల నుండి ఉపసంహరించుకొంటారో...

ఆధ్యాత్మిక వివరణ:-

ఎవరైతే ఇంద్రియాలను ఇంద్రియసుఖాల నుండి ఉపసంహరించుకొంటారో (with drawing senses from sensual pleasures), తాబేలు తన అవయవాలను పెంకులోనికి వెనక్కు తీసుకున్నట్లుగా వారే నిజానికి యథార్థమైన జ్ఞానంలో స్థిరపడినట్టుగా అర్థం చేసుకొనవచ్చును.

. చూసి కూడా చూడనివాడు యోగి. అటువంటి యోగి సామాన్య వ్యక్తుల వలెనే కళ్లు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక కలిగి ఉంటాడు. కానీ అవి అంతర్ముఖం అయి ఉంటాయి. బహిర్ముఖం కావు. ఈ కారణంగానే యోగి చూసి కూడా చూడనివాడు, వింటూ కూడా విననివాడు (మాటలు), స్పర్శ, అందం, వాసన, రుచి, ధ్వని(శబ్ద, రూప, స్పర్శ రస, గంధాలు), ఇవన్నీ ఇంద్రియాల యొక్క భ్రమ కలిగించే ఆటలు. ప్రాణతరంగాల కదలిక ఇడా మరియూ పింగళ నాడులలో శ్వాస యొక్క ప్రవాహమే తప్ప నిజానికి వేరే ఏమీ కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన ఆత్మ విశ్వంలో విస్తరించి ఉన్నప్పుడు పంచభూతాలూ వాటి అంశాలూ ఎక్కడనుండి వస్తాయి? ఇది భ్రమ కలిగించే దృశ్యం, ప్రకృతి ఆట, మరియు ఇంద్రియాలు అంతర్ముఖం కానంతకాలం ఈ ఆట కొనసాగుతుంది.

ఆత్మను చూడడం కొరకు ఇంద్రియాలను లోపలికి లాగవలసి ఉంటుంది, తాబేలు తన అవయవాలను వెనుకకు తీసుకొన్నట్టుగా. నాలుకను వెనక్కి (లోపలికి) మడతపెట్టాలి(యోగక్రియ ద్వారా). కళ్లు ఊర్థ్వదిశగా మళ్లాలి(శాంభవీ ముద్ర). పదకొండవ ఇంద్రియమైన మనసును కూడా ప్రాపంచిక వ్యవహారాల నుండి వెనక్కి మళ్లించాలి, శ్వాస కూడా కుడివైపు నుండి ఎడవవైపునకు వెళ్లకుండా ఆపివేయవలసి ఉంటుంది. ఆ విధంగా అది కూడా వెనుకకు మళ్లి (ప్రత్యూహం), అప్పుడు మాత్రమే అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఒక స్థానంలో ఒకే బిందువులో స్థిరపడతాయి. తద్వారా హృదయంలో ఆత్మ యొక్క చైతన్య స్వరూప విత్తనం జ్యోతిరూపంలో కనిపించి శరీర అణువులు ఓంకార శబ్దంతో కంపిస్తాయి.

ఇది ఆత్మ యొక్క యథార్థ జ్ఞానంలో స్థిరపడిన వ్యక్తి యొక్క స్థితి. యోగి సమాధి చెదిరిపోయినప్పుడు లేదా ధ్యానంలో లేనపుడు కూడా నీటిలో ఒక కాలు మరియు భూమి పై ఒక కాలు ఉన్న తాబేలు మాదిరి (తాబేలు ఉభయచరం భూమిమీద, నీటిమీద రెండింటిలోనూ నివసించగలదు). ప్రపంచంలోనూ పరమాత్మలోనూ నివసించగలడు. కాబట్టి అతను ఏవైనా అవాంతరాలను ఎదుర్కొన్నప్పుడు వెంటనే సమాధిలోకి (తాబేలు నీటిలోకి వెళ్లిపోయినట్టుగా) తిరిగి వెళ్లిపోగలడు. సమాధి లేదా పరావస్థలో లేనప్పుడు ఇంద్రియాలు ఇంద్రియ సౌఖ్యాల వెంట నడిచినప్పటికీ ధ్యాన సమాధిని అందుకొన్న యోగులు తాబేలు తన అవయవాలను వెనక్కు తీసుకొన్నట్లుగా ఇంద్రియాలను ఇంద్రియ సుఖాల నుండి వెనక్కి మళ్లించగలరు.

జై యోగిరాజ్ జై గురుదేవ్🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment