Sunday, December 6, 2020

శిక్ష

శిక్ష

ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు

15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు

ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు

అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు.

దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.

20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.

అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.

దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా...

ఒకరోజు దొరికిపోయాడు.

మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.

మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ రోజును చెప్పేసారు

చివరగా అతని కోరిక ఏమని అడగగా

తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు

అతని కోరిక మేరకు వారిని పిలిపించారు

కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు

పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు

అప్పుడు అతను వారు కాదు నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు

నా పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు మండలించాడని చెప్పగానే బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు. 14 ఏళ్ల వయసు లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు వచ్చారు.
అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.

అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం

ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు

చిన్నప్పుడు తప్పు చేయగానే ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు

చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..
పిల్లల్ని చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వారి అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment