Friday, February 4, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధు మిత్రులకు శుక్రవారం శుభోదయం శుభాకాంక్షలు లక్ష్మీ సరస్వతి గాయత్రి దుర్గ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ

శుక్ర వారం --: 04-02-2022 :--

మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగ పడుతుంది అలాగే మనం చేసిన మంచి పని కూడా ఏదో రోజు మంచి చేస్తుంది , కొందరు మనల్ని ఇష్టపడతారు కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ద్వేషించే వాళ్ళను క్షమించండి ఇష్ట పడే వాళ్ళను ప్రేమించండి .

జీవిత ప్రయాణంలో డబ్బుల వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి
అలిసి పోయి చివరకి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పై బడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమ అనురాగాలు జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు .

కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే మనలోని ధైర్యాన్ని మన సామర్థ్యాన్ని మనకు తెలిసేలా చేస్తుంది భవిష్యత్తుకు గమ్యాన్ని
వెతికేలా చేస్తుంది .

సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 🌷🌼🌻🌺🥀

సేకరణ

No comments:

Post a Comment