Wednesday, March 30, 2022

జీవిత విలువలు...(kannada to telugu translation)

 ಜೀವನ ಮೌಲ್ಯಗಳು ...


ಯಾವ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಗೆ ಯಾವ ಯಾವ ಗುಣಗಳು ಕಾರಣ. ಈ ಎಲ್ಲಾ ೨೩ ಮೌಲ್ಯಗಳು ನಮ್ಮೆಲರಿಗೂ ಅರ್ಥವಾದರೆ ಬಹುಶಃ ನಾವೆಲ್ಲರೂ ಪಾವನರಾಗುತ್ತೇವೆ. ಹಿರಿಯರು, ಅನುಭವಸ್ತರು ಹೇಳಿರುವ ಈ ಎಲ್ಲಾ ಮಾತುಗಳು.


೧ ಜಗತ್ತನ್ನೇ ಗೆಲ್ಲಲು ಬೇಕಾಗಿರುವ ಏಕೈಕ ಗುಣ = ಸಚ್ಚಾರಿತ್ರ್ಯ.

 ೨ ಎಲ್ಲ ದುರ್ದೈವಕ್ಕೆ ಕಾರಣ = ಆಲಸ್ಯ. 

೩ ನಮ್ಮ ದುರವಸ್ಥೆಗಳಿಗೆಲ್ಲ ಕಾರಣ = ಭೀತಿ. 

೪ ಎಲ್ಲರಿಗೂ ಸಮಾನವಾಗಿ ಕೊಟ್ಟ ಸಂಪತ್ತು = ಸಮಯ.

 ೫ ಸಾವಿರ ಯಜ್ಞಗಳಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠ ಕರ್ಮ = ಪರೋಪಕಾರ.

 ೬ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠ ಸ್ವಭಾವ = ತಾಳ್ಮೆ. 

೭ ಅತ್ಯಂತ ಕೆಟ್ಟ ಗುಣ = ಪರನಿಂದೆ.

೮ ಬಹುತೇಕ ಎಲ್ಲ ರೋಗಗಳಿಗೆ ಮುಖ್ಯಕ್ತಾರಣ = ಅಜೀರ್ಣ.

 ೯ ಚಟಗಳಲ್ಲಿ ಅತೀ ಕೆಟ್ಟ ಚಟ = ಚಾಡಿ ಹೇಳುವದು. 

೧೦ ಬಂಧುಗಳಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠ ಬಂಧು = ವಿಶ್ವಾಸ.

 ೧೧ ವ್ಯಕ್ತಿಗಳ ಅಧಃಪತನಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ = ಅಹಂಕಾರ.

 ೧೨ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠ ಆಪಧ್ಬಾಂಧವ = ಆತ್ಮ ವಿಶ್ವಾಸ.

 ೧೩ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಪರಿಹಾರ = ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಿಕ್ಷಣ.

೧೪ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚು ಬಾಧೆ ಕೊಡುವುದು = ಸಾಲಬಾಧೆ. 

೧೫ ಹುಚ್ಚುಗಳಲ್ಲಿ ಅತೀ ಕೆಟ್ಟ ಹುಚ್ಚು = ಹೊಗಳಿಸಿಕೊಳ್ಳುವದು.

 ೧೬ ಬದುಕಿನಲ್ಲಿಯೇ ಅತೀ ಹೀನಬದುಕು = ಹಂಗಿನ ಬದುಕು. 

೧೭ ಎಲ್ಲರ ಬದುಕಿಗೆ ಆಧಾರವಾಗಿರುವ ಪ್ರಮುಖ ಅಂಶ = ವಿಶ್ವಾಸ. 

೧೮ ಮನುಷ್ಯನಿಗೆ ಕಗ್ಗತ್ತಲಿಗಿಂತ ಅತೀ ಹೆಚ್ಚು ಕತ್ತಲಾಗಿರುವುದು = ಅಜ್ಞಾನ.

೧೯ ಜಗತ್ತಿನ ಎಲ್ಲ ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳ ಬೆಳವಣಿಗೆಗೆ ಮುಖ್ಯ ಕಾರಣ = ಸಜ್ಜನರ ನಿಷ್ಕ್ರಿಯತೆ. ೨೦ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಅತೀ ಒಳ್ಳೆಯ ಹಾಗೂ ಕೆಟ್ಟ ಅಂಗ = ನಾಲಿಗೆ. 

೨೧ ವರಗಳಲ್ಲಿ ಅತೀ ದೊಡ್ಡ ವರ = ಆರೋಗ್ಯ. 

೨೨ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತಿಕೆ = ಸಂತೃಪ್ತಿ. 

೨೩ ಜಗತ್ತಿನಲ್ಲಿ ತುಂಬಾ ಕಷ್ಟಕರ ಹಾಗೂ ಸುಲಭವಾದ ಕ್ರಿಯೆ = ಮೌನ.


🙏🙏🙏




జీవిత విలువలు...


ఏ పరిస్థితులకు కారణమయ్యే లక్షణాలు ఏమిటి? ఈ 23 విలువలను మనమందరం అర్థం చేసుకుంటే, బహుశా మనమందరం పవిత్రులమవుతాము. ఈ మాటలన్నీ పెద్దలు, అనుభవజ్ఞులు చెబుతుంటారు.


1 ప్రపంచాన్ని జయించడానికి అవసరమైన ఏకైక లక్షణం = మంచి గుణం.

 2 అన్ని దురదృష్టాలకు కారణం = బద్ధకం. 

3 మన బాధలన్నియు భయమువలన కలుగును. 

4 అందరికి సమానంగా ఇవ్వబడిన సంపద = కాలము.

 కర్మ 5,000 యజ్ఞాల కంటే గొప్పది = పరోపకారం.

 6 గొప్ప స్వభావము = సహనము. 

7 చెత్త నాణ్యత = మతిస్థిమితం లేనిది.

8 దాదాపు అన్ని వ్యాధులకు ప్రధాన కారకం = అజీర్ణం.

 9 వ్యసనాలలో, చెత్త వ్యసనం = అపవాదు. 

10 మంది బంధువులలో గొప్పవాడు = విశ్వాసము.

 11 మంది వ్యక్తుల క్షీణతకు ప్రధాన కారణం = అహం.

 12 ఆపద సమయాల్లో అతి పెద్ద విపత్తు = ఆత్మవిశ్వాసము.

 13 ప్రప౦చ౦లోని అన్ని సమస్యలకు పరిష్కార౦ = ఆధ్యాత్మిక విద్య.

14 అడ్డంకుల్లో అత్యధికంగా ప్రభావితమైనవి = ఋణగ్రస్తులు. 

15 పిచ్చిలో చెత్త = ప్రశంసించడానికి.

 16 జీవిత౦లో అధ్వాన్నమైన జీవిత౦ = హ్యాంగర్ ప్రాణము. 

17 ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇమిడివున్న అత్య౦త ప్రాముఖ్యమైన అ౦శ౦ ఎ౦దుక౦టే విశ్వాస౦. 

18 మానవుని అంధకారముకంటె చీకటిగా ఉండుట = అజ్ఞానము.

19 లోక౦లో చెడు పనులన్ని౦టి ఎదుగుదలకు ప్రధాన కారణ౦ మ౦చి క్రియ లేకపోవడమే. 20 ప్రప౦చ౦లోని అత్య౦త శ్రేష్ఠమైన, చెడ్డ అవయవ౦ = నాలుక. 

21 వరాలలో అతి పెద్దది = ఆరోగ్యము. 

22 గొప్ప సంపద = తృప్తి. 

23 ప్రప౦చ౦లో అత్య౦త కష్టమైన, సులభమైన చర్య = నిశ్శబ్ద౦గా ఉ౦డడ౦.


🙏🙏🙏

గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది ! కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది !

గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !

కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది !

గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు!

అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!

మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ... ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి !

పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది !

మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ?

ఎక్కువలో ఎక్కువ 5000 / ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ?
రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ?

అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి !

గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !

పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి !

అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !

🚩 జై శ్రీరామ్ 🚩

సేకరణ

క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు.

🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃

క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు.

1 వ వల : ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది.

2 వ వల : మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము.

3 వ వల : టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు. కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది.

4. క్రిస్టియన్స్ అమ్మాయిని ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు.

5 వ వల : ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది.

6 వ వల : ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే.

7 వ వల : ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి.

8 వ వల : పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే.

9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో, ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్.

10 వ వల : వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు. విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.

ఈ పది వలల్లో పడక పోతే -

1. మీలా విమర్శించే వాళ్ళే ముందు మారతారు.

2. మన కులం వాళ్ళు ఎక్కువ మారుతున్నారు తెలుసా.

3. RRK మూర్తి గారు తెలుసా, రక్షణ టీవీ బెన్హర్, అనిల్ కుమార్ వీళ్ళంతా బ్రాహ్మణులు తెలుసా

ఇలా ఏన్నో రకాలుగా వలలు వేస్తారు

ఒక హిందువును పాస్టర్లు మతం మార్చడానికి ప్రధానం కారణం డబ్బు మతం మారిన వాళ్ళు పాస్టర్కి జీవితకాలపు ఆదాయం

మతం మారుస్తున్నందుకు విదేశి ఫండ్స్, చర్చ్ లో వచ్చే కానుకలు, చర్చ్ వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గర దశమభాగాలు ( తమ సంపాదనలో పదో వంతు తాను వెళ్ళే చర్చ్ కి ఇవ్వలి ) వసులు చెయడం, పుట్టుక నుండి చావు వరకు ప్రత్యేక ప్రార్థనలు, కూటములు, ఏసు రక్తం పేరిట కొబ్బరి నూనె సీసాలు అమ్మడం, ఇలా మతం మారిన వ్యక్తి జీవిత కాలపు ఆదాయపు వనరుగా మారిపొతారు ఒక పాస్టర్కి తనకు, తన తర్వత తరతరాలకు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం గా మారిపోతారు

మన రాష్టం లో వందల కోట్ల రూపాయలు ఈ మత మార్పిడి పేరిట వ్యాపారం జరుగుతుంది
ఇలాంటివన్నీ ప్రతి హిందువు ఐక్యతగా ఉండి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది
జై శ్రీరామ్ జై భారత్ భారత్ మాతాకీ జై
########################
ఇట్లు
మీ పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

సేకరణ

ఒక తండ్రికి కొడుకు నుండి ఒక సందేహం.... మీ కాలంలో

ఒక తండ్రికి కొడుకు నుండి ఒక సందేహం.... మీ కాలంలో
🌹🍃🍇🍃🌹🍃🍇
1. ఇంత టెక్నాలజీ లేదు.
2.విమానాలు లేవు
3. ఇంటర్నెట్ లేదు
4.Tv లు లేవు
5.కంప్యూటర్లు లు లేవు
6.ఏసీలు లేవు
7.లగ్జరీ కార్ లు లేవు
8. మొబైల్ ఫోన్ లు లేవు మీరెలా బతికారు...

దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే...........
మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే
1.ప్రార్ధన లేకుండా
2.మర్యాద లేకుండా
3.ప్లానింగ్ లేకుండా
4.క్రమశిక్షణ లేకుండా
5.పెద్దల ఎడ గౌరవం లేకుండా
6.మన చరిత్రపై అవగాహన లేకుండా
7.కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా
8.Morals లేకుండా...
ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో...
మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము.

మేము మీలాగా.....
1.వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు
2.పాఠశాల వేళలు అయినా తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము tv లు చూడలేదు
3.ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము
4.దాహము వేస్తే కుళాయి నీరు తాగాము.. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు
5.ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా మాకెప్పుడూ జబ్బులు రాలేదు
6.మూడు పూటలా అన్నం తిన్నా మాకు ఊబకాయం రాలేదు
7.షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు
8.సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము, బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, పండుగలు కలిసి చేసుకున్నాము
9.పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము 10.మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు..... మాది జీవితాన్ని చదివిన తరము.. బహుశా మా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం... మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు.....

అయినప్పటికీ.. మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము... మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము..... అందుకే మా విన్నపము ఏమంటే..
మీ జీవితాలనుండి, ఈరోజు భూమి పైనుండి మేము వెళ్ళిపోక ముందే ఎంతో అంత మానుండి మీరు నేర్చుకోండి.
🌹🍃🍇🍃🌹🍃🍇

సేకరణ

"ఆమె" లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం... అందుకే ఆడదే మగాడికి సర్వస్వం...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత....

👏 విలువైన పోస్ట్..తప్పక చదవండి 👏 🙏 🙏

"ఆమె" లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం

ఆమెలేని అతడు వట్టి మోడు ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు.. --వారికి రోజులు గడవడం కష్టం అవుతూంది--

--భర్త దూరమైనా భార్య
తట్టుకుని జీవించగలదు...
కానీ పురుషులు కుటుంబసభ్యులతో
కలిసిపోలేరు..

--2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు.
అందులో ఒక ఆసక్తికరమైన
అంశం వెల్లడైంది...

--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.
తన కన్నా చిన్నదైన భార్య
చనిపోతుందనే సన్నద్ధత
పురుషుల్లో ఉండదట.
భార్య చనిపోతే భర్త
కుంగుబాటుకు గురవడానికి
ఇది కూడా ఒక ప్రధాన
కారణమని వారు విశ్లేషించారు.
--భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు...
కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో
కొడతారు కూడా !
ఆమె శాశ్వతంగా దూరమైతే
మాత్రం తట్టుకొని బతికేంత
మానసిక బలం పురుషులక ఉండదు --

‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం !!'
అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ
ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు..
ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..
అందరితో కలవలేక..
మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!
'‘ నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు .
పైనున్న భగవంతుడికి తెలుసు.
ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా.
‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు.
ఆ తర్వాత నా సంగతి చూడు’
అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.
‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు.
నాకు మీ మావయ్యంటే
చచ్చేంత ఇష్టంరా.
ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది.
చీకటంటే భయం.
ఉరిమితే భయం.
మెరుపంటే భయం.
నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?
అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని
లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !

నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.
ప్రముఖ చిత్రకారుడు,
దర్శకుడు బాపు సైతం..
భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.
సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.
భార్య తన మీద ఆధారపడి ఉందని..
తాను తప్ప ఆమెకు
దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.
కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది.
చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది.
వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.
భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది.
భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.

స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది.
తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది.
అదే తనకు ఏదైనా అయితే
ఎవరి కోసం ఎదురుచూడదు.
తనకు తానే మందులు వేసుకుంటుంది.
ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది.
ఆ మనోబలమే...
భర్త లేకపోయినా
ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.

భావోద్వేగ బలం ఆమెదే :-

_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే..
ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌.
ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

-- అందుకే ఆడదే మగాడికి సర్వస్వం...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత....

Save Girl Child and Respect women......🙏🙏🙏🙏

సేకరణ

హిందూమత స్థాపకుడు ఎవరు? & ఎందుకంటే, హిందూ మతం ఒక శాస్త్రీయ మతం- సనాతన ధర్మం

స్వామి చిన్మయానందజీ సుప్రసిద్ధ సాధువు. ఒకసారి, ఒక 'కుటిల ' ఆలోచనాపరురాలైన మహిళా జర్నలిస్ట్, సాధారణంగా హిందూ మతాన్ని సాధ్యమైనంత కించపరిచేలాగా చూపించే ప్రయత్నం లో , స్వామీజీని ఈ విధంగా ప్రశ్నలు అడిగింది:

ప్ర: "ఇస్లాం స్థాపకుడు ఎవరు?"

జ: మహమ్మద్ ప్రవక్త.

ప్ర: క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు?

జ: యేసు క్రీస్తు.

ప్ర: హిందూమత స్థాపకుడు ఎవరు?

స్వామీజీకి సమాధానం లేదు కాబట్టి దొరికి పోయాడు అనుకుంటూ,

లేడీ జర్నలిస్ట్ ఇంకా ఇలా కొన సాగించింది:

"స్థాపకుడు ఎవరూ లేరు కాబట్టి, హిందూమతం ఒక మతం లేదా ధర్మం కానే కాదు."

అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు:

"మీరు చెప్పింది నిజమే.!"

హిందూత్వం ఒక మతం కాదు. ఇది ఒక సైన్స్.

అది ఆమెకు అర్థం కాలేదు.

స్వామీజీ ఆమెకు మరికొన్ని ప్రశ్నలు వేశారు.

ప్ర: "భౌతిక శాస్త్ర స్థాపకుడు ఎవరు?"

జ: "ఎవరూ లేరు."

ప్ర:- కెమిస్ట్రీ వ్యవస్థాపకుడు ఎవరు?"

జ: "ఎవరూ లేరు."

ప్ర: "జీవశాస్త్ర స్థాపకుడు ఎవరు?"

జ: "ఒక్క వ్యక్తి కాదు."

"చాలా మంది వ్యక్తులు, కాలానుగుణంగా, ఏదైనా శాస్త్ర విజ్ఞాన సంపదకు దోహదపడ్డారు."

స్వామీజీ ఇలా కొనసాగించారు:

"హిందూ ధర్మం ఒక శాస్త్రం, శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది, సాధువులు మరియు ఋషులు తమ స్వంత పరిశోధనలు మరియు అనుభవాల ద్వారా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడం కోసం అందించారు."

"ఇస్లాంకు ఒకే ఒక పుస్తకం ఉంది -ఖురాన్."

"క్రైస్తవానికి ఒకే ఒక పుస్తకం ఉంది - బైబిల్."

"అయితే హిందూ మతం కోసం, నేను మిమ్మల్ని లైబ్రరీకి తీసుకెళ్లి వందల కొద్దీ పుస్తకాలు చూపించగలను."

"ఎందుకంటే, హిందూ మతం ఒక శాస్త్రీయ మతం- సనాతన ధర్మం -"
" 🙏🏻శాశ్వత ధర్మం🙏🏻"
సనాతనం అనగా శాశ్వత మైన అని అర్థం.
అత్యంత కచ్చితమైన నిర్వచనం.*🌹🙏🏻

సేకరణ

పరనింద ప్రమాదకరం. లక్ష్మీ పార్వతుల మధ్య సరస సంభాషణ

(Copy. ఎవరిదో తెలీదు. చాలా బాగుంది. చదవండి)

పరనింద ప్రమాదకరం.

పరనింద ప్రమాదం.

ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.
ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.
"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతికి ఈ ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఎంచెప్పాలి? కొంచెం ఆలోచించింది.
"సుతను బలిమఖే " అంది.
'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం. ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.
తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.
మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.
క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.
' నైవ జానే వరాహం ' అంది
“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.
బాలే! కచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. 'మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది.
"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.
నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు
వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.

భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?

మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం

బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా

లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న:

(శ్రీ అప్పయ్య దీక్షితులు)

సేకరణ

నేటి కథ మితి మీరిన విశ్వాసం

మితి మీరిన విశ్వాసం

ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.

అలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.

తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.

యువకుడు ఆ వ్యక్తిని "ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'

"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను" అని అవతలి వ్యక్తి అన్నాడు.
'లండన్‌' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.
"వేగంగా తిరుగుది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.
"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడా వ్యక్తి.
'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.
యువకుడు "పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.
నీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడు.
మొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.

ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.

ఆ వ్యక్తి "ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.

కుతూహలం పట్టలేక యువకుడు "ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?" అని అడిగాడు ఆ వ్యక్తిని.
"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను" అన్నాడా వ్యక్తి.
అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.

సేకరణ

✍🏼 నేటి కథ ✍🏼 ఇది నిజం

✍🏼 నేటి కథ ✍🏼


ఇది నిజం


ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహితం' కూడా ఇలానే ఉండాలి తెలుసా" అని సలహా ఇచ్చాడట.

విన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారటా. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, "చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు" అన్నారట.

విన్న ఆపెద్ద మనిషి "మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి" అని అడగగా, "ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు.

సేకరణ

మంచి మాట..లు

గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥
ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. విజ్ఞానాయకుడు వినాయకుడు.. శరవణ భవుడు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
30-03-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

ఆస్తులు ఇవ్వలేదని తల్లితండ్రుల మీద
కోరికలు తీర్చలేదని దేముడి మీద ద్వేషం పెంచుకోకండి
కని పెంచడం వరకే తల్లితండ్రుల బాధ్యత
కాపాడటం వరకే దేముడి బాధ్యత
సంపాదించడం.. సాధించటం నీ ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యం

డబ్బును ఎంతైనా సంపాదించు..
ఎంతైనా పోగొట్టు..
కానీ
నీ వ్యక్తితత్వాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకు..
ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది

చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం..
చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం
కొన్ని లక్షల అగ్గిపుల్లలను తయారు చేయటానికి ఒక చెట్టుచాలు...
కొన్ని లక్షల చెట్లను దహనం చేయటానికి ఒక అగ్గిపుల్ల చాలు..
పరిస్థితులు ఎలాగైనా మారువచ్చు.. ఎవరిని తక్కువగా చూడకండి.. ఎవరి మనసు గాయపరచకండి

నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రొండే రొండు
ఒకటి పొలంలో కలుపు
రొండు మనిషిలో అహం
పొలంలో కలుపు వలన పొలం పాడైతే..
మనిషి లోనీ అహం వలన మనిషే నాశనం అవుతాడు

మనసులో నుండి గతం తాలూకు దుఃఖన్ని తొలగిస్తే, వర్తమానపు ఆనందాన్ని నింపడానికి కావలిసినంత చోటు ఉంటుంది. మనిషి కి మతి మరుపు కొన్ని సమయాల్లో మంచిదే

నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి బయపడుతుంది. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి బయపడుతుంది.
సేకరణ ✒️AVB సుబ్బారావు 📱9985255805

సేకరణ

నేటి మంచిమాట. ఆ ఒక్కరూ చాలునేమో

నేటి మంచిమాట.

నిన్ను వద్దనుకొన్న బంధాలముందు జాలిగా నిలబడ కు ..
నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు..నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు..
నిన్ను మనస్పూర్తిగా ఇష్టపడేవారు ఉంటారు..ఎందరో కాకపోయినా.. ఒక్కరైనా...ఆ ఒక్కరూ నీకు తోడుగా.. నీతో కలసి ఉంటారు..

మనిషికి దగ్గరగా కాకపోయినా.. మనసుకు దగ్గరగా.. నీ మంచిని ఎప్పుడూ కోరుకుంటూ..నీ సంతోషమే.. వారి సంతోషంగా.. నీ బాధే..వారి బాధగా.. నిన్ను ఎప్పటికీ వదలరు..నీకు భరోసా నిచ్చి..నువ్వు ఒక అద్భుతానివనీ..భుజంపై తట్టి..ముందుకు నడిపిస్తారు..

ఆ ఒక్కరూ చాలునేమో కదా..

🌅శుభోదయంచెప్తూ మానస సరోవరం

సేకరణ

నేటి మాటల ముత్యాలు, ఇది చదవటానికి, వినటానికి చిత్రంగా ఉన్నా, చాలామంది జీవితాల్లో జరగబోయే పచ్చి నిజాలు.

నేటి మాటల ముత్యాలు

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం నిండా ఎన్నో నక్షత్రాలు. క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి.

నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.

నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు.

నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు.

బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు......

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు.
ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు.....!
’ఇలా ఎందుకు జరుగుతుంది’ అంటే ఇది కలియుగం కాబట్టి.

ఇక్కడ తరిగింది ప్రేమ, అభిమానం. పెరిగింది స్వార్థం, అసూయ.

ఇది చదవటానికి, వినటానికి చిత్రంగా ఉన్నా, చాలామంది జీవితాల్లో జరగబోయే పచ్చి నిజాలు.

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. ప్రకృతి సత్యం

నేటి జీవిత సత్యం. ప్రకృతి సత్యం

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.

బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.

అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.

ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.

సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..

కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.

యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.

ఉషోదయం తో మానస సరోవరం

సేకరణ

#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.

#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.

1) నేను చాలా మొత్తాన్ని ,చాలా సార్లు విరాళం ఇచ్చాను
2) నేను చాలా దేవాలయాలను సందర్శించాను
3) నేను చాలా మందికి సహాయం చేసాను
4) నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను
5) నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను
6) నేను రక్తదానం చేశాను
7) నేను చాలా చెట్లను నాటాను
8) నేను అరుణాచలం, తిరుపతి, కాశీకి చాలాసార్లు వెళ్ళాను
9) నేను చాలా దీక్షలను తీసుకున్నాను (అయ్యప్ప, హనుమాన్, భవానీ, శివ)
10) నేను చాలా సార్లు అన్నదానం చేశాను
11) నేను చాలా పక్షులను, జంతువులను పోషించాను
12) నేను సమాజానికి చాలా చేశాను
13) నేను చాలా భక్తితో జీవిస్తున్నాను
14) నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను
15) నేను గోషాలాలను నడుపుతున్నాను, గౌ సేవా కూడా చేస్తాను
16) నేను రోజూ భజనలు చేస్తాను
17) నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను
18) నేను చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను
19) నా దగ్గర కోట్లు, కోట్లు ఆస్తి ఉన్నాయి

చివరగా, మీరు మీ స్వంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే,
అది పూర్తిగా వ్యర్థం.

#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.

మీరు చేసారు ఎందుకంటే,
ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.
ఇది మీ క్రెడిట్ కాదు,
ఇది శివుడి క్రెడిట్.
మీరు కేవలం ఆటగాడు మాత్రమే
మరియు
హీరో, స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత ,దర్శకుడు శివుడు మాత్రమే.

మీ మనస్సులో ఈ భావన ఉంటే,
అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు.

మీరు ఈ రోజు గొప్ప వ్యక్తి,
మీరు ఏమి చేసినా,
శివుడు మీ వెనుక ఉన్నాడు.
దీన్ని ఎప్పటికీ మరచిపోకండి.
శివుడు సహాయం, మద్దతు లేకుండా మీరు ఒక్క పని కూడా చేయలేరు.🙏

సేకరణ

రామ్ రాజ్ కాటన్స్ అధినేత జీవితపాఠం ! ఒక స్ఫూర్తి వంతమైన గాథ

#ధోవతి కట్టుకొచ్చారని హోటల్లోకి
రానివ్వలేదు.
అవమానంతో కుంగిపోలేదు‌.
ఎలాంటిచోటైతే ధోవతికి అవమానం జరుగుతుందో అలాంటిచోటకు పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవమిస్తున్నట్టు ఒక యాడ్‌ చేయించి.... మన ధోవతి పై
మనలోనే గూడుకట్టుకున్న చులకన భావాన్ని నలిపేసే ప్రక్రియ కు తెరతీశారాయన.

ఒక స్ఫూర్తి వంతమైన గాథ

#రామ్ రాజ్ కాటన్స్ అధినేత జీవితపాఠం !

చదవండి‌ !

అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలని ఆయనే చెప్పినట్లు... మన ఎన్నో
సమస్యలకు మనమే
పరిష్కారం దొరకబుచ్చుకుందాం... !



ధోతీ వేడుక, పెళ్లి, గృహ ప్రవేశం... ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మగవాళ్లంతా తెల్లని పంచెకట్టులో మెరిసిపోతుంటారు.

వాటిలో చాలావరకూ రామ్‌రాజ్‌ బ్రాండ్‌కి చెందినవే ఉంటాయి.

ఎందుకంటే పంచెల
మార్కెట్‌లో ఆ బ్రాండే రారాజు.

దీని వెనక ఉన్న వ్యక్తి ఆ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్‌.నాగరాజన్‌.

తమిళనాడులోని వస్త్ర నగరం తిరుపూర్‌ నుంచి దేశవిదేశాలకు రామ్‌రాజ్‌ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు గురించి ఆయన ఏం చెబుతారంటే...

వ్యాపారంలో అడుగుపెట్టాలని చిన్నపుడే అనుకున్నా.
అలాగని మాది వ్యాపారుల కుటుంబం కాదు.
అందుకు కారణం వేరే ఉంది.

మా ఊరు తమిళనాడులోని అవినాశి. వస్త్ర రంగానికి ప్రసిద్ధి అయిన తిరుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది.

నా చిన్నపుడు ఒకాయన వారానికోసారి మా ఊరికి కార్లో వచ్చేవాడు.

ఆ కారుని చూడగానే పిల్లలందరం దాని వెనక పరిగెత్తేవాళ్లం.

అతను కారు ఎలా కొనగలిగాడని అమ్మని అడిగితే... ‘వ్యాపారి కాబట్టి’ అని చెప్పింది.
ఏం చదువుకున్నాడని అడిగితే... ‘మూడో నాలుగో’... అని బదులిచ్చాడు నాన్న.
పెద్ద చదువులు చదివిన మా స్కూల్‌ టీచర్‌ సైకిల్‌మీద వస్తుంటే, ఈయన కారులో వస్తున్నాడే అనుకున్నా. వ్యాపారి అవ్వాలన్న ఆలోచనకు ఆరోజే బీజం పడింది.

అమ్మానాన్నలకు అన్నయ్య, నేను - ఇద్దరమే.
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు స్కూల్‌ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది.

మా ఇంటి దగ్గర్లో ఒకాయన న్యూస్‌ పేపర్‌ ఏజెన్సీ నడిపేవారు.
ఆయన దగ్గర ఆ వ్యాపారం గురించి తెలుసుకున్నాక పిల్లలు ఇష్టపడే బాలమిత్ర మ్యాగజైన్‌కి ఏజెన్సీ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది.

ఎడిటర్‌ గారికి ఉత్తరం రాస్తే,
డిపాజిట్‌ తీసుకోకుండానే పుస్తకాలు పంపించారు.
వాటిని అమ్మి డబ్బు కట్టేశా.
లాభంగా వచ్చిన డబ్బుతో స్కూల్‌ ఫీజు కట్టేవాణ్ని.

అన్నయ్య శ్రద్ధగా చదువుకుని టీచర్‌ అయ్యాడు.
నా చదువు మాత్రం ఇంటర్‌ ఫస్టియర్‌తో ఆగిపోయింది.
మాకు టైప్‌ ఒక సబ్జెక్టు.
టైపు ఇన్‌స్టిట్యూట్‌కి నెలకు రూ.15 ఫీజు.
అది కట్టలేక చేరలేదు.
రెండు మార్కుల్లో టైపు పరీక్ష తప్పడంతో నా చదువుకి బ్రేక్‌ పడింది. వ్యాపారిగా విజయవంతం కావడానికి ఆ వైఫల్యమే మొదటి అడుగు.

తెలుగు నేలమీద మొదలు...

చదువు మానేశాక తిరుపూర్‌లోని ఒక వస్త్ర వ్యాపార సంస్థలో చేరాను.
అక్కడ పనిచేస్తూనే వ్యాపార పాఠాలు నేర్చుకోవాలనేది నా ఉద్దేశం.

చేరిన కొత్తలోనే రాయలసీమకు పంపించారు.
15 రోజులు దుకాణంలో ఉంటూ, మరో 15 రోజులు గ్రామాలకు వెళ్తూ చేనేత కార్మికుల్ని కలుస్తూ పనిని పర్యవేక్షించేవాణ్ని.

అప్పటికి నాకు తెలుగు కూడా రాదు. చేనేత కార్మికులు తాము నేసిన పంచెలూ చొక్కాలూ దుకాణానికి తెచ్చి ఇచ్చేవాళ్లు.

చేతిలో డబ్బున్నా మా యజమాని సాయంత్రం వరకూ వాళ్లకి ఇచ్చేవాడు కాదు.

వాళ్ల ఒంటిమీద కనీసం
చొక్కా కూడా ఉండేది కాదు.

తిండీతిప్పలు లేకుండా దుకాణం బయట ఎదురుచూసేవాళ్లు.

‘డబ్బులిస్తే ఇంటికిపోయి పనిచేసుకుంటారు కదా’ అంటే ‘ముందే ఇచ్చేస్తే దుకాణాలన్నీ తిరిగి ఎవరు ఎంత ధర ఇస్తున్నారో ఆరాలు తీస్తారు.
బస్సు టైమ్‌కిస్తే నేరుగా ఇంటికి వెళ్తారు’ అని బదులిచ్చాడు యజమాని.

ఆ కంపెనీలో ఆరేళ్లు పనిచేశాక సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నా.

నాన్న రామస్వామి పేరులోని రామ్‌, నా పేరులోని రాజ్‌ని తీసుకుని 1983లో తిరుపూర్‌లో ‘రామ్‌రాజ్‌ ఖాదీ ట్రేడర్స్‌’ పేరుతో పంచెల హోల్‌సేల్‌ వ్యాపారం మొదలుపెట్టాను.

నిజానికి అప్పటికి తిరుపూర్‌లో లోదుస్తుల ఎగుమతి వ్యాపారం బాగా నడిచేది.

మా స్నేహితులూ, కుటుంబ సభ్యులూ ‘ఆ వ్యాపారంలోకి వెళ్లొచ్చుగా... పంచెల వాడకం తగ్గిపోతోంది.
ఏటికి ఎదురీదడం ఎందుకు’ అన్నారు. నేను మాత్రం పంచెలకూ
డిమాండ్‌ ఉందని నమ్మాను.

రెట్టింపు కూలీ...

తిరుపూర్‌ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి నేత కార్మికుల్ని కలిశాను.

అప్పట్లో వాళ్లకి మీటరు వస్త్రానికి రెండు రూపాయలు వచ్చేది.
నాతో పనిచేస్తే ఏడాది పొడుగునా పని కల్పిస్తానంటే, సరేనన్నారు.

నా దుకాణానికి వచ్చేటపుడు కచ్చితంగా చొక్కాతో రావాలని చెప్పా ‘మీరిచ్చే డబ్బు మాకు తిండి ఖర్చులకే రాదు, చొక్కాతో ఎలా వస్తాం’ అన్నారు.

తిండి కోసం అదనంగా ఎంత కావాలని అడిగా, మీటరుకు రూపాయి అన్నారు.

దాంతోపాటు చొక్కాకి మరో రూపాయి పెంచి నాలుగు రూపాయలు ఇస్తానన్నా.

రెట్టింపు ధర అనేసరికి వాళ్లకి నామీద నమ్మకం కలగలేదు.

‘డబ్బు కోసమే అయితే అందరిలా బనియన్ల వ్యాపారంలోకి వెళ్లేవాణ్ని. నా బాగుతోపాటు నేతన్నల బాగూ ముఖ్యమే’నని చెబితే నమ్మారు.

అప్పటికి మార్కెట్లో ఉన్న వ్యాపారులెవరూ నాణ్యత
గురించి ఆలోచించలేదు.

పొరపాటున ఒకటి చిరిగినా రెండోది అక్కరకు వస్తుందని పెళ్లిళ్లూ, శుభకార్యాలకు రెండు పంచెల్ని తీసుకుని వెళ్లేవారు ఆరోజుల్లో.

అందుకే మా పంచెల తయారీకి మార్కెట్‌లో ఉండే నాణ్యమైన పత్తిని ఎంచుకున్నా.

నిజానికి పంచెలకోసం అప్పటికి అంతటి నాణ్యమైన నూలుని ఎవరూ ఉపయోగించలేదు.

అలా మొదటిసారి రూ.85 వేలు విలువచేసే సరుకు తీసుకుని నాకు బాగా తెలిసిన పుత్తూరులోని ఒక రిటైల్‌ దుకాణానికి వెళ్లాను.

ఒక్కో పంచె ధర రూ.110 అని చెప్పా.

అప్పటికి మార్కెట్‌లో ఉన్న ధర రూ.60-70 మాత్రమే.

ధరలో మార్పులేదనీ,
ఒకవేళ స్టాక్‌ మిగిలిపోతే
వాటికి తిరిగి డబ్బులిస్తాననీ చెప్పా. అందుకు ఆయన ఒప్పుకున్నాడు.

వారం తర్వాత వెళ్తే...
స్టాక్‌ అయిపోయిందన్నాడు.

నా నమ్మకం నిజమైనందుకు
ఎంతో సంతోషించా.

ఆ ధరకు అమ్మినా నాకు పెద్దగా మిగిలేది కాదు.

అందుకని నిర్వహణ ఖర్చు తగ్గించుకునేవాణ్ని.

బస్సుమీద వెళ్తే నెలకు రూ.20 అవుతోందని మా ఊరు అవనాశి నుంచి తిరుపూర్‌కి రోజూ 14 కి.మీ. సైకిల్‌మీద పంచెల్ని తీసుకుని వెళ్లేవాణ్ని.

మా దుకాణానికి వచ్చే వ్యాపారుల్లో కొందరు అంత ధర ఎందుకని అడిగేవాళ్లు.
నాణ్యత చూడమనేవాణ్ని. నేత నేసే వారికి నేనిచ్చే రేటు చెప్పేవాణ్ని.

అవి నచ్చి ఆరోజు నుంచీ ఈరోజుకీ మాతో అనుబంధం కొనసాగిస్తున్న వ్యాపారులు ఉన్నారంటే నమ్మగలరా...

కొన్నాళ్లకు కంపెనీ పేరులో
‘ఖాదీ’ని కాటన్‌గా మార్చా.
డిమాండ్‌ బాగా ఉండటంతో పంచెలతోపాటు షర్టులూ తెచ్చాం. దక్షిణాది మొత్తం విస్తరించాం.

ఆలోచనా విధానం మార్చాలని...

మా వ్యాపార భాగస్వామి కూతురి పెళ్లి రిసెప్షన్‌కి ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌కి వెళ్లా.

ప్యాంటూ షర్టూ వేసుకున్న వాళ్లందరినీ లోపలకి పంపించి పంచెకట్టులో ఉన్న నన్ను మాత్రం అడ్డుకున్నారు.

అలాగైతే తామూ వెళ్లమని నాతో వచ్చినవాళ్లు పట్టుబట్టారు.
నేనే వాళ్లకి నచ్చజెప్పి పంపాను. వాళ్లు తిరిగి వచ్చేంత వరకూ బయట ఒక్కణ్నే కూర్చున్నా.

అంతసేపూ నాలో ఎంతో సంఘర్షణ. ఈ వ్యాపారంలోకి అనవసరంగా వచ్చానా అనిపించింది.

బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలూ...
ఎక్కడికి వెళ్లినా ప్యాంటూచొక్కా వేసుకున్నవాళ్లతో పోల్చితే నన్ను చులకనగా చూసేవారు.

ఇంట్లోవాళ్లూ షాపింగుకూ, సినిమాలకూ వెళ్లినపుడు ప్యాంటూచొక్కా వేసుకోమనేవారు.

పంచెకట్టు అంటే
గౌరవ మర్యాదలు తక్కువనీ...
పల్లెటూరి రైతు అన్న చులకనభావం ఉందనీ అర్థమైంది.

అప్పుడే అనుకున్నా పోవాల్సింది ఆ చులకన భావం తప్ప మన సంప్రదాయం కాదని.

మర్నాడే చెన్నైలో ప్రకటనలు రూపొందించే కంపెనీకి వెళ్లి పంచెకట్టు గౌరవం పెంచేలా ఒక యాడ్‌ చేయమని అడిగా.

నాకు ఎలాంటిచోటైతే అవమానం జరుగుతుందో అలాంటిచోటకు పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవమిస్తున్నట్టు ఆ యాడ్‌లో కనిపించాలని చెప్పా.

అలా తెచ్చిన ‘సెల్యూట్‌ రామ్‌రాజ్‌’ ప్రకటనకు మంచి పేరొచ్చింది.

ఓసారి కేవలం తెల్ల పంచె, చొక్కా వేసుకునే ఫ్యాషన్‌ షో ఏర్పాటుచేశాం.

మరోసారి అమెరికాలోని తమిళ సంఘం సమావేశానికి 700 మంది కేవలం రామ్‌రాజ్‌ పంచెలూ, సల్వార్‌లూ, చీరలతో హాజరయ్యేలా చేశాం.
వీటివల్ల కొంత మార్పు వచ్చింది.

మార్కెటింగ్‌లో భాగంగా ఇప్పటికీ సినిమాల్లో హీరోలు పంచెకట్టులో కనిపించేలా ఒప్పందాలు చేసుకుంటాం.

అలా రిటైల్‌ వ్యాపారంలోకి...

1999 నాటికి తిరుపూర్‌లోని మా తయారీ యూనిట్‌ సరిపోకపోవడంతో నగర శివారులో పెద్ద యూనిట్‌ నిర్మించి అక్కడకు మారాం.

అప్పటికే నగర వాసులు షోరూమ్‌ అనుభవాన్ని కోరుకోవడాన్ని గమనించా.

అందుకే మా పాత యూనిట్‌ ఉన్నచోట పెద్ద షోరూమ్‌ నిర్మించా.

రెండో షోరూమ్‌ని కోయంబత్తూరులో ప్రారంభించా.

అది బాగా విజయవంతమైంది.

వీటివల్ల వినియోగదారుల ఆలోచనల్ని నేరుగా తెలుసుకుని ఉత్పత్తుల్లో మార్పులూ చేర్పులూ చేసే అవకాశం వచ్చింది.

దక్షిణాదిలో మాకు 170 దాకా దుకాణాలున్నాయిపుడు.

నాకు ఇద్దరు ఆడపిల్లలు.
టెక్స్‌టైల్‌ టెక్నాలజీ చదువుకున్నారు.

పిల్లలూ, అల్లుళ్లూ కంపెనీని కొత్త విభాగాల్లోకి తీసుకువెళ్తున్నారు.

రోజుల పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారికీ సరిపోయేలా 2500 రకాల పంచెలు దొరుకుతాయి

మా దగ్గర. టీషర్టులూ, జిమ్‌వేర్‌, లోదుస్తులూ, పిల్లల దుస్తులూ, పట్టు పంచెలూ, చొక్కాలూ, చీరలూ, లినెన్‌ వస్త్రాలూ... ఇలా భిన్నమైన విభాగాల్లోకి అడుగుపెట్టాం.

ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు జరుపుతాం.
విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం.

యువతకు అదే చెబుతా...

వేదాద్రి మహర్షి భక్తుణ్ని.
యోగా, ధ్యానం, శాకాహారం
నా జీవనశైలిలో భాగం.

‘వెన్మయ్‌ ఎన్నంగళ్‌’ అనే మాస పత్రికను తీసుకొస్తున్నా.
ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది.

‘తెలుపు తేట’ పేరుతో
తెలుగులోనూ దీన్ని తెస్తున్నాం.

‘వనం ఇండియా ఫౌండేషన్‌’ను ప్రారంభించి...
బంజరు భూములూ,
ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి... సామాజిక వనాల్ని పెంచుతున్నాం.

చెరువులూ, బావుల్లో పూడిక తీయిస్తున్నాం.

యువ వ్యాపారుల్ని కలిసినపుడల్లా నన్ను సలహాలు అడుగుతుంటారు.

నేనూ వాళ్లకి ఓపిగ్గా సమాధానం ఇస్తాను.

డబ్బు కోసమే పనిచేస్తే వ్యాపారంలో విజయవంతం కాలేమనేది నేను చెప్పే మొదటి పాఠం.

నేను వ్యాపారం మొదలుపెట్టాక నేతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందనీ,
దుకాణాల వాళ్లకి వ్యాపారం పెరిగిందనీ, వినియోగదారులూ సంతృప్తితో ఉన్నారనీ
అందువల్లే విజయం సాధించగలిగాననీ చెబుతా. అవకాశాలు ఎవరినీ వెతుక్కుంటూ రావు మనమే వాటిని సృష్టించుకోవాలి...

చిన్నపుడు బాలమిత్ర ఏజెన్సీ తీసుకోవడం,
ఇప్పుడు మాస్కుల తయారీలోకి అడుగుపెట్టడం అలా చేసినవే.

తమిళనాడులో 50వేల మంది నేతన్నలు మాకు పంచెల్ని నేస్తారు.

కంపెనీలో తొమ్మిదివేల మంది ఉద్యోగులు పనిచేస్తారు.

పది చదివి ఇంత మందికి
ఉపాధి కల్పిస్తున్నా...
పెద్ద చదువులు చదివిన మీరు లక్షల మందికి ఉపాధి కల్పించాలని మా పిల్లలకూ చెబుతుంటా.

లాభాల్ని వ్యాపార విస్తరణకే ఉపయోగించాను తప్ప బంగారం, స్థిరాస్తి లాంటి వాటి జోలికి వెళ్లలేదు.

సంపద మరింత మందికి ఉపాధినివ్వాలి.
🙏🇮🇳

సేకరణ

Tuesday, March 29, 2022

నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?

నిదానంగా చదవగలరు🙏

నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?

లేదు. ఎవరూ కాదు.!

నీ నిజమైన తోడు
నీ శరీరమే!
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి, సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ బాధ్యత...

డబ్బు వస్తుంది. వెళ్తుంది.
బందువులు., స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప...!

ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు- ధ్యానము
శరీరానికి- యోగా.
గుండెకు- నడక.
ప్రేగులకు- మంచి ఆహారం.
ఆత్మకు- మంచి ఆలోచనలు.
ప్రపంచానికి- మంచి పనులు.

శుభ సాయంత్రం 🙏

సేకరణ

♥🙏- మన పెద్దవారు.🙏♥

♥🙏- మన పెద్దవారు.🙏♥


మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు... ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు...♥

బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు...

వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు... అనుభవాల గనులు ఆపాత బంగారాలు...♥

వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు...♥

చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు...♥

నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి... తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు...♥

ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు...♥

మూలన పడ్డారని చులకనగా చూడకు... పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు... బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో...♥

వారు లేని నువ్వెక్కడ... నీ జీవితమెక్కడ... ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి... పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా...♥

నువ్వు కొన్నాళ్ళకు వృద్దుడివే అవుతావు... అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించు...♥

నువ్వు నీ తల్లి దండ్రులను, ఎలా చూసుకున్నావో... నీ వారసులు గమనిస్తూనే ఉన్నారు... నీకు అదే గతి పట్టేనేమో చూసుకో...♥

తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తములు వృద్ధులు...♥

🔥🔥🌹🌹❤‍🔥🌹🌹🔥🔥

సేకరణ

🌹మనసు మాటల ముత్యాలు🌹

🌹మనసు మాటల ముత్యాలు🌹

🌹 గౌరవం అనేది వయస్సును బట్టి
ఉండదు.
వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది.

🌹 చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు,
ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం,
చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు,
వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం.

🌹 ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు..
నీ మీద వుంచిన నమ్మకాన్ని మంచి గౌరవాన్ని
కోల్పోయావని త్వరలో తెలుస్తుంది.
మోసాగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతోకాలం నిలువదు.

🌹 అందంగా ఉన్నవన్నీ ఆనందాన్ని కలిగించవు..
వస్తువులు, సదుపాయాలు కొంత వరకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి !!
కానీ మీ మనసు ప్రశాంతముగా ఉన్నప్పుడు
మాత్రం అన్నీ అందంగానే కనిపిస్తాయి.!!
ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా
మనసుని ప్రశాంతముగా ఉంచుకోవడానికి
ప్రయత్నం చేద్దాము!
ఘర్షణ పడుతూ ఏమి
సాధించగలగుతున్నాము..??!!

🌹 ఉన్నతంగా ఆలోచించడం
అలవాటు చేసుకుంటే.....
మనకు మనమే....
మార్గదర్శకులుగా....
మారతాం.....!!

🌹 ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకోకు.
గతంలోకంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో.
ఎందుకంటే..
ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు.✍️

సేకరణ

చితిలో శవం తలపండు పగిలితే ఏమవుతుంది..?

చితిలో శవం తలపండు పగిలితే ఏమవుతుంది..?
ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషి ఏదో సందర్భంలో కాటికి వెళ్లేవాడే! మరణించిన తర్వాత దహన సంస్కారాలు సర్వసాధారణం. చితిమంటల్లో శవం తల పగలడం ఇంకా కామన్‌. కానీ భద్రాచలంలో మాత్రం అలా జరగదు. ఎందుకు?
కర్మణ్యే వాధికరస్తే మాఫలేషు కదాచన! కర్మలు చేయడంలో నీకు అధికారం ఉన్నది! కర్మఫలాలపై మాత్రం లేదు! కర్మఫలానికి కారకుడివీ కాదు! అలాగని కర్మలు చేయడమూ మానొద్దు! భగద్గీతలో ఈ శ్లోకం హిందుల జీవన ధర్మాన్ని బోధిస్తుంది!
పాపం పుణ్యం కష్టం సుఖం! ఈ నాలుగు మనిషి నడవడికను.. తప్పొప్పులను నిర్ణయిస్తాయి. పాపం చేసినవాడు నరకానికి వెళ్తే.. పుణ్యాత్ములు శివుడిలోనూ విష్ణువులోనూ ఐక్యం అయిపోతారట! ఇది కర్మసిద్ధాంతం! ఇదంతా నమ్మడం, నమ్మకపోవడం వాళ్ల వాళ్ల భావజాలాన్ని బట్టి ఉంటుంది! ఇది కాసేపు పక్కన పెడితే, చితి మంటల్లో కపాల మోక్షం జరిగిన వాడు పాపి. అలా కాకుండా మంటల్లో తల కొవ్వత్తిలా కరిగిపోతే పుణ్యాత్ముడు.. అని బ్రహ్మపురాణం చెప్తుంది. అంటే దానిప్రకారం తలపండు పగిలితే నరకానికి వెళ్తాడట. అలాకాకుండా మంటల్లోనే మాడిపోతే సుషుమ్నా నాడిగుండా వైకుంఠానికి పోతారట!!
ఇలా అన్నిచోట్లా జరగదు. కేవలం మోక్ష పట్టణాల్లో దహన సంస్కారాలు జరిపితేనే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మోక్ష పట్టణాలంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ ద్వారవతీ. ఈ ఏడింటిని బ్రహ్మ పురాణంలో పేర్కొన్నారు. అయితే దక్షిణ అయోధ్య భద్రాచలం కూడా మోక్ష పట్టణమేనని వేదవ్యాస మహర్శి గుర్తించాడు. అంటే ఈ ఎనిమిది చోట్ల కాకుండా వేరే ఎక్కడైనా దహన సంస్కారాలు చేస్తే ఆ వ్యక్తి తల కచ్చితంగా శబ్దం చేసుకుంటూ పగిలిపోతుందట! ఆ శబ్ద తీవ్రతను బట్టి పాపాలను అంచనా వేస్తారట.
భద్రాచలం దివ్య పుణ్యక్షేత్రం. దీన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. మరి రాముడు తిరగాడిన నేల మోక్ష పట్టణంగా ఎందుకైంది? అంటే దీనివెనుక పెద్దకథే ఉంది. అరణ్యవాసంలో భాగంగా రాముడు ఈ గోదావరి తీరాన సంచరించాడు. ఇక్కడే తన తండ్రి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశాడు. రాముడు విష్ణువు అవతారం కాబట్టి.. దశరథుడు విష్ణువులో ఐక్యమైపోతాడు. రాములవారు తర్పణం చేసిన నేల కాబట్టి ఇది కూడా మోక్ష పట్టణంగా పురాణాలకెక్కింది. అందుకే శ్రీరాముణ్ని మోక్షరాముడు అని కూడా పిలుస్తారు. భద్రాచలంలో చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ఎక్కడ దహన సంస్కారాలు చేసినా మంటల్లో శిరస్సు పగిలిపోదు. మెల్లగా కొవ్వత్తిలా కరిగిపోతుందట. కేవలం భద్రగిరి రుద్రభూమిలో మాత్రమే ఇలా జరుగుతుంది.
ఇప్పటిదాకా భద్రాచలం వైకుంఠ ఘాట్‌లో కొన్ని లక్షల శవాలకు దహన సంస్కారాలు జరిగాయి. అందులో ఏ ఒక్క మనిషి తల పగల్లేదంటే ఆశ్చర్యం కలగకపోదు. ఇప్పటిదాకా శిరస్సు పగిలినట్టు దాఖలాలే లేవని హకీం, శ్రీను అనే కాటికాపర్లు అంటున్నారు.
కర్మ సిద్ధాంతాలేవైనా కానీయండి. వాటిని నమ్మండి.. నమ్మకపోండి. అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం నిజం. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ మళ్లీ ఎప్పటికైనా ఆ భూమిలో కలిసిపోవాలి. పుట్టుక-చావు. ఈరెండు మాత్రమే నిజం. నడుమ అంతా నాటకం. కష్ట సుఖాలను లైట్ తీసుకోగలిగిన వాడే అసలైన స్థితప్రజ్ఞుడు. ఏమంటారు!
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:
HTTPS://T.ME/GURUGEETA

సేకరణ

ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌.
అడిగిన వెంటనే షూస్‌.
కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌.
ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌.

పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?
కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ?
కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే" అని ఎప్పుడు తెలుసుకోవాలి.
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?

నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం.

మొన్నటి శనివారం రోజు.
అర్ధరాత్రి.. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

👉 'ఎందుకు పరిగెడుతున్నావ్‌?'
🏃‍♂️'వ్యాయామం కోసం'
🌹 'ఈ టైమ్‌లోనే ఎందుకు?'
🏃‍♂️ 'నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను'
🌹 'నీ రూమ్‌ ఎంతదూరం?'
🏃‍♂️ '10 కిలోమీటర్లు ఉంటుంది'
🌹 'అంత దూరమా? కారెక్కు. దింపుతాను'
🏃‍♂️ 'వద్దు. నా ప్రాక్టీసు పోతుంది'
🌹 ఇంతకీ ఎందుకు వ్యాయామం?'
🕴️ 'ఆర్మీలో చేరడానికి'

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. 'కనీసం కలిసి భోం చేద్దాం రా' అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు 'వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ' అన్నాడు.

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే 'ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు' అని ట్వీట్‌ చేశాడు. 'ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.

👉 ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

🎁 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.

🎁 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

🎁 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.

🎁 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని 'నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి' అన్నాడు ప్రదీప్‌.

🎁 5. కష్టేఫలీ: 'మిడ్‌నైట్‌ రన్నర్‌'గా కొత్త హోదా పొందాక 'నువ్వు ఇచ్చే సందేశం' అని అడిగితే 'కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది' అని జవాబు చెప్పాడు.

👉 పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు.

సేకరణ

స్త్రీ....

స్త్రీ
-----
మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".

ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే
పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని.
👆hatsoff to writer....🙏👌

సేకరణ

కవిత: ఎందుకిలా...!?

ఎందుకిలా...!?
-----------------------
జీవితాల్ని గడిపేస్తాం మనం
కష్టాల్లో కన్నీళ్లు కనిపించనీం
కోపంలో నోళ్లు కట్టేస్తాం
అహంతో తల ఎత్తుకొనే నడుస్తాం
భార్యని అణిచేసి పరువు కాపాడుకుంటాం
లేదా చీరలు,నగలతో నోరు మూస్తాం
పిల్లల్ని డబ్బుతో పెంచుతాం
ప్రేయసిని కానుకలతో బుజ్జగిస్తాం
ఎందుకిలా బ్రతుకుతాం?
చీకటికి జడుస్తాం
వెలుతురును తట్టుకోలేం
నలుగురిని భరించలేం
నలుగురు లేక జీవించలేం
మనకిష్టమైనవి చెప్పుకోలేం
మన కష్టాలను పంచుకోలేం
ఇస్త్రీ బట్టలు లేకుండా బైటకు వెళ్లలేం
చస్తే గానీ సుఖంగా ఉండలేం
ఎందుకిలా బ్రతుకుతాం?
మనసారా నవ్వలేం
మనసారా ఏడ్వనూలేం
పదుగురికీ జడుస్తాం
పదుగురి వెనకే నడుస్తాం
ఎందుకిలా బ్రతుకుతాం?
మనం పెంకులోన గువ్వలం
మనం పెంచుకునే పువ్వులం
మనం మనంలా బ్రతకలేం
మరెందుకిలా బ్రతకడం!
మరెందుకసలు బ్రతకడం!?
---- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

"Khalid Umar Writes" "Ban Madrassa"

 This excellent article is written by  *Khalid Umar* (the author is a Muslim, originally from Pakistan and is now working as a Barrister in UK. He is very straight forward and is widely read on his *Facebook Wall*


*NARENDRA MODI* CAN CREATE HISTORY IF THE *1000 YEARS OLD* DERELICT INSTITUTION OF *“ISLAMIC MADRASSAS”* IN INDIA ARE SCRAPPED. 


*ONE COUNTRY-ONE CURRICULUM* IS THE RECIPE OF *COMMUNAL HARMONY & PEACE* IN INDIA. 


Before enacting the Uniform Civil Code, India desperately needs a *Uniform Education Code* - one secular curriculum for all. 


When there be 3,60,000 *young minds* get stuck in an ancient curriculum *developed in the 1700s* - in Delhi alone there are more than 3,000 madrassas. 


Nobody can dream to take the nation ahead with millions enrolled in the over 600,000 madrassas countrywide alongwith another 40-50 lac mosques with attached *makatab or madrasa.*


WHAT IS TAUGHT IN MADRASSAS?

A madrasa is an exclusivist religious school, where MUSLIM children are taught Quran, the Sharia, Hadith, Islamic history of invasions (Jihad). The institution of Islamic madrasas in India is as old as the history of Islam in India, say 1000 years. The syllabus teaches the students to hate all non-Muslims, especially the *Hindus, who are declared as idolaters- dubbed in Madrassas as hateful human beings, called ‘kaffirs’.*

 

The establishment of *Ghana-i-Hind* (the goal of establishment of Islamic rule across India through Jihad) is also taught in almost every madrassa, both in India and Pakistan.


 Madrassas produce *highly indoctrinated and poisoned minds, full of hate, fear and false pride*. 


This derelict institution can't be reformed. Outright scrap page is the solution. Helping them is writing your own obituary. 


The UPA Government initiated *an ill thought plan as part of its appeasement politics* - “Scheme for Providing Quality Education in Madrasas” (SPQEM) in 2009-10. 

This fruitless scheme was introduced to encourage *Madarsas and Maktabs* to introduce formal subjects i.e. Science, Mathematics, Social Studies, Hindi and English ; The scheme is STILL ongoing in 18 states in the country. So far under SPQEM, over 21,000 Madarsas spread over different states have been given Rs. 1138 crores. Only in the state of Uttar Pradesh there are 18,27,566 children enrolled in 8,584 Madrasas, as per GOI figures. 


That is mindless stupidity


Core Islamic scripture as taught can't be made secular and humanistic. *This scheme, initiated by Congress, *as a part of its appeasement policy,* is a sheer  waste of time and valuable national resources and it must be scrapped forthwith. 


*WHY MADRASSAS CAN’T BE Reformed?*


ISLAMIC TEACHINGS and modern education can’t coexist. Would the students of madrassa will trust Science which says Earth is spherical and revolves around the SUN or will believe QURAN which say, earth is flat and the SUN sets in murky water of a lake? How can you teach them harmony and love when they learn from Quran that all IDOLATORS are consigned to the eternal HELL-FIRE?


WHAT THE MODI GOVERNMENT MUST DO IMMEDIATELY?


1- All madrassas must be nationalised, registered and the state should have the writ to appoint teachers, administrators and curriculum there. Their financials & source of income to be scrutinised. All the madrassa be converted into modern schools open to all the communities. Community exclusive, organised & institutionalised religious education must be scrapped for any religion. ALL children must be taught uniform curriculum. 


2- All the mosques must be monitored through CCTV recording to check what it being taught and fed. *It is not a coincidence that every riot in Indian cities starts on Friday after Juma prayers.*


 If China, Singapore and Egypt can all control mosques, *why can’t India,* the country with the *second largest Muslim population world*? 


*"If India doesn’t control Mullahs, mosques and the madrassas, peace and communal harmony in India will remain a pipe dream"*


"Khalid Umar Writes" 

*"Ban Madrassa"*


https://m.facebook.com/story.php?story_fbid=10220648731904429&id=1119306885

"మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం" స్వామి వివేకానంద.

🕉️🌞🌎🏵️🌼🚩

"మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం"
స్వామి వివేకానంద.

📚✍️ మురళీ మోహన్

కానీ ఇప్పుడు చాలామంది,
వ్యక్తిత్వాలను నమ్ముకోవడం కన్నా,
ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనాల కోసం,
అన్యుల పాదాక్రాంతం చేస్తూ,
అమ్ముకుంటూ, తాకట్టు పెడుతూ జీవిస్తున్నారు.!
శాశ్వతం కాని హోదాలను అనుభవించడమే జీవితం అనుకుంటున్నారు.
మనం అసలైన ఆభరణాలము కాదు,
గిల్టు నగలమని తేలిపోవడం తప్పదు..
అప్పుడు సమాజమే కాదు,
మన అనుకునే వారు కూడా,
మనలను ఛీకొట్టే రోజులు వస్తాయి...
అందుకే వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు..
దాన్ని కాపాడుకుంటే అది మనలను మరణించినా,
మనుషుల్లో వారి మనసుల్లో శాశ్వతంగా నిలబెడుతుంది..

కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,
ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి..
అయితే మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటే,
గుణపాఠం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడవద్దు..👍
🎊💦🦜🌹🦚💜🍇

సేకరణ

మంచి మాట..లు

శ్రీరామ స్తోత్రo
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥


ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు.. వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
29-03-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటకు ఆదరణ ఎక్కువ, ఇష్టం తో చేసేటువంటి పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే వారికి ప్రశాంతత ఎక్కువ.

ఇతరలుకు మంచి చేసే ప్రతి మనిషి దేవుడే, అందరి మంచి కోరుకొనే మనస్సు ఉన్న ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా దేవాలయమే.

అందం - నవ్వే పెదవులు లో లేదు, బాధను దాచే గుండెల్లో ఉంది. అందం - ధరించే దుస్తుల్లో ఉండదు, మనిషిలో దాగిన మనస్తత్వం లో ఉంది.


అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది, గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కు తగ్గడం వలన ఆ క్షణం మాత్రం ఓడిపోతాం, కానీ బంధం నిలబడడం వలన జీవితాంతం గెలుస్తూనే ఉంటాం.

ఓడిపోయావు అంటే గెలవలేమని కాదు, గెలవడానికి సమయం పడుతుంది అని, విమానం ఆకాశంలోకి ఎగరాలన్న కూడా ముందు కాసేపు నేలమీద ( రన్ వే ) నడవాల్సిందే.
సేకరణ✒️.. AVB సుబ్బారావు, 📱9985255805🤝

సేకరణ

మనసు మాటల ముత్యాలు

మనసు మాటల ముత్యాలు

🌹 సంతోషం అనేది పది వేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు...
మన అనుకునే వారితో పది నిముషాలైనా
మనసువిప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది...!!

🌹 సహాయము అనేది అత్యవసరంలో
మాత్రమే స్వీకరించాలి.
లేదంటే అది
నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది..!

🌹 ఎవరికో నచ్చాలని నీవు అన్నీ మార్చుకొని
నీలో నిన్ను కోల్పోకు...
ఎందుకంటే
నీకు నచ్చినట్లు నీకోసం మార్చుకునేవాళ్ళు ఒక్కరూ లేరు....!

🌹 ధైర్యం అన్నదే అసలైన సంపద
ధైర్యం కోల్పోయినట్లయితే
అన్ని కోల్పోతాం..

🌹 అనేక విత్తనాలు నాటడం వల్ల భూమి ఏవిధంగా సారవంతమౌతుందో
అదేవిధంగా అనేక రకాల విషయాలను పరిశీలించడం ద్వారా మనస్సు వికసిస్తుంది....!

🌹 నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్థాయి ...
ముందు కాలికి గర్వం లేదు
వెనకున్న కాలికి అవమానం లేదు
ఎందుకంటే
ఒక్కక్షణం లో వాటి స్థానం మారుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. భయం పోవాలంటే

నేటి జీవిత సత్యం.

భయం పోవాలంటే
నిర్భయంగా జీవిస్తేనే, నిజమైన జీవితం, అదే ఆనందమయ జీవితం. భయానికి ముఖ్య కారణం అశాశ్వతమైన వాటి మీద వ్యామోహం, శాశ్వతమైన దానిని ఆశ్రయించక పోవడం.
వ్యామోహం అంటే మమకారం. డబ్బున్నవారికి పోతాయని, పదవిలో ఉన్న వారికి పదవి పోతుందని, రాజకీయాల్లో ఉన్న వారికి శత్రుభయం, పేరుప్రఖ్యాతులు ఉన్నవారికి పేరు పోతుందని, ఆరోగ్యం వారికి రోగ భయం, వెంటాడుతూ ఉంటాయి. శాశ్వతమైన ఆ పరమాత్మను, అంటే ఆత్మను ఆశ్రయిస్తే భయం పోతుంది.
కనపడే ప్రతి వస్తువు అస్థిరమైనదే, మారిపోయేదే, అశాశ్వతమైన దే. అస్థి రమైన వాటి పట్ల ఎప్పుడూ ప్రమాదమే.వాటి వల్ల ఆనందం, శాంతి లభించదు.
మానవుని కి భయం కలగడానికి కారణం, తన స్వరూపాన్ని మరచి నందువల్ల అని స్వామి వివేకానంద అన్నారు . ధ్యానం చేస్తే ఆత్మకు చేరుతాం, పరమాత్మకు దగ్గర అవుతాం, నిర్భయంగా జీవిస్తాం, పూర్తి శాంతిని పొందుతాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Monday, March 28, 2022

🌻ఒక చిన్నకథ🌻 "ధర్మపత్ని మన కన్నులంత అమూల్యమైనది"

"ధర్మపత్ని మన కన్నులంత అమూల్యమైనది"

🌻ఒక చిన్నకథ🌻

భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి..
తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు..

చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము...
తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను..

ప్రతి విషయానికి 'ఏమండీ...... అనే పిలుపుకు నేను దూరమయ్యాను..

నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు..

ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు..

ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది...

నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే #స్వార్థం నాలో ఉండేది..

సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది..

ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే 'అమ్మా... నీళ్లు,
'అమ్మా... తినడానికి ఏమైనా తీసుకురా.., 'కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించేవాళ్ళం...

నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది..
ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను..

తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను.. సినిమాలకు గానీ షికారులకు గానీ తీసుకువెళ్ళలేకపోయాను.. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు..
ఆఫీసు నుండి లేటు వచ్చినపుడు 'ఎందుకు లేటయ్యింది' అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని..

ఏమండీ... పాలవాడికి డబ్బులు..,
పేపర్ వాడికి డబ్బులు.., కరెంట్ బిల్లు.., పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తుచేసేది..

చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు.. 😔

తన గురించి ఎప్పుడూ, ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు..

రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు..
ఏమండీ... ఎదలో నొప్పిగా ఉంది .,నడుము నొప్పిగా ఉంది.., కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని..

చివరికీ ఆ ఎద నొప్పి #హార్ట్_ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను..

ఇంట్లో అంతా కొత్త.. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్తితి.. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడిఉన్నాయి..

పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు..
తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు.., ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి..

పిల్లలు తమకు కావాల్సిన నూడుల్స్ తిని ఖాళీ పాకెట్స్ కూడా సింక్ లో పడేసారు..

అన్ని పాత్రలు కడిగేసి.. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూం వైపు నడిచాను..

లైట్ ఆఫ్ చేసి పడుకుందామనేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి.. 😥😥

తనను నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళుమూసాను... 😴😴

*

కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది.. కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసి కూడా ప్రయోజనం ఉండదు..సముద్రం...🙏🙏💐

సేకరణ

♥️ ♥️ ఎలాంటి ఆపేక్షలు లేకుండా ప్రేమించడం ఎవరికి సాధ్యపడుతుంది?

♥️ ♥️ ఎలాంటి ఆపేక్షలు లేకుండా ప్రేమించడం ఎవరికి సాధ్యపడుతుంది?

ఒక తల్లి ప్రేమ

ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం క్లాసు జరుగుతూ ఉంది. దీపావళి సెలవులలో చేయడానికి పిల్లలకి టీచర్ హోం వర్క్ ఇస్తున్నాడు.

అప్పుడే స్కూల్ లోని స్టోర్ రూమ్ లో పడి ఉన్న కార్పెట్, బట్టలకు మంటలు అంటుకున్నాయి... దీనికి కారణం ఎవరో తుంటరి విద్యార్థి బాణాసంచా కాల్చడం అయ్యుండవచ్చు. కాసేపటికే మంటలు భయంకరంగా చెలరేగాయి. అక్కడ పడి ఉన్న ఫర్నీచర్ కూడా మంటల్లో ధ్వంసం అయ్యింది.


విద్యార్థులంతా సమీపంలోని ఇళ్ల నుండి, చేతిపంపుల నుంచి నీళ్లు తెచ్చి, ఏ పాత్ర దొరికితే అందులో నీళ్లు తెచ్చి ... అందరూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలు ఆర్పడానికి చాలాసేపు పట్టింది, ఎట్టకేలకు స్టోర్ రూం తెరిచారు. స్టూడెంట్స్ అందరి దృష్టి వెంటనే స్టోర్ రూమ్ వరండా మీద పడింది, అక్కడ ఒక పక్షి బాగా కాలిపోయి, బొగ్గయిపోయింది.

పక్షి ఉన్న భంగిమను చూస్తే, పక్షి, తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎగరడానికి కూడా ప్రయత్నించలేదని, స్వచ్ఛందంగా తనకుతానుగా అగ్నిలో కాలిపోయినట్లుగా స్పష్టంగా కనిపించింది.

అందరూ చాలా ఆశ్చర్యపోయారు.

నిర్జీవంగా కాలిపోయిన ఆ పక్షిని ఓ విద్యార్థి తోయగా, దాని క్రింద నుండి మూడు చిన్న పక్షిపిల్లలు కనిపించాయి, అవి సురక్షితంగా ఉండి, కిచకిచలాడుతూ ఉన్నాయి.
వాటిని అగ్ని నుండి రక్షించడానికి, పక్షి తన రెక్కల క్రింద పిల్లలను దాచిపెట్టింది. తన చిన్నపిల్లలను రక్షించడానికి ప్రాణాన్ని అర్పించింది.

ఒక విద్యార్థి ఆ సంస్కృత ఉపాధ్యాయుడిని ఇలా అడిగాడు, "సార్, పిల్లలను రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చిందంటే, ఆ పక్షి తన పిల్లలతో ఎంత బంధింపబడి ఉండాలి?"

గురువుగారు చాలా ఓర్పుగా ఇలా చెప్పారు -
"కాదు, ఇది బంధం కాదు, మాతృత్వం, విశాలమైన తల్లి ప్రేమకు పరాకాష్ఠ. మోహానుబంధం ఉన్నవాళ్లు, మొదట వారి జీవితాన్ని కాపాడుకుంటారు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పారిపోతారు."


భగవంతుడు సాటిలేని భావోద్వేగాలతో నిండిన ప్రేమను తల్లికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎలాంటి ఆపేక్షలు లేని, బేషరతైన ప్రేమకు తల్లి ప్రేమ ఉత్తమ ఉదాహరణ.


ప్రేమ ప్రతిదీ సులభం చేస్తుంది. ప్రేమతో నిండిన హృదయం ఎప్పటికీ నశించదు.

సేకరణ

✍🏼 నేటి కథ ✍🏼 అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

✍🏼 నేటి కథ ✍🏼


అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి
దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా
అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో 'నేను
చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప
బహుమతి ఇస్తాను' అన్నాడు రాజు.
ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి 'సరే
మహారాజా' అన్నాడు.
'అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా
దాని విలువ దానిదే. కాదంటావా?' అన్నాడు రాజు
నవ్వుతూ. 'అది నిజం కాదు మహారాజా! వస్తువు
విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది' అన్నాడు
విదూషకుడు.
'అలా అని నిరూపించగలవా?' అన్నాడు రాజు. 'మీ
చేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి
ప్రభూ' అన్నాడు విదూషకుడు. రాజు వెంటనే
తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి
ఇచ్చి, 'మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య
దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి
ఎంతకి కొంటాడో అడిగిరా' అంటూ పంపాడు. అలా
వెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, 'ఇరవె ౖ
వరహాలు ఇస్తానన్నాడు ప్రభూ' అన్నాడు.
విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని
పిలిచి కడియం ఇచ్చి 'మాధవయ్య దీన్ని ఎంతకు
కొంటాడో కనుక్కో' అని పంపాడు. కాసేపటికి తిరిగి
వచ్చిన ఆ అధికారి, 'నలభై వరహాలు ఇస్తానన్నాడు'
అన్నాడు.
తర్వాత విదూషకుడు దారినపోయే
బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి
దగ్గరకు పంపాడు. అతడి వెంట ఓ సైనికుడిని
రహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి,
'అయ్యా! దీని ధర ఎంత?' అని అడిగాడు.
వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి
చేతిలో పెట్టి, 'దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి
ఉంటావు. మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు
చేస్తాను' అంటూ దబాయించాడు.
ఆపై సైనికుడి
ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు,
రాజు కేసి తిరిగి 'చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే
వర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల,
బీదవాడికి ఒక ధర చెప్పాడు. వస్తువు విలువ అది
ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?'
అన్నాడు.
రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి
ఇచ్చాడు.

#STORY_TIME

సేకరణ

ఏదిచేస్తే అది పొందుతాం...!

🌺🌹💐🙏శుభోదయం🙏💐🌹🌺

🌸🌹✳️ఆచార్య సద్భోదన✳️🌹🌸

ఏదిచేస్తే అది పొందుతాం...!
➖➖➖✍️

స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు కలిసి రాదు!

ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు ఆలోచిస్తావో నీకు అప్పుడే మంచి జరుగుతుంది.

ఒకసారి శ్రీకృష్ణార్జునులు కలిసి వెళ్ళుచుండగా వారికి మార్గమధ్యమున పేద సజ్జనుడు యాచకుడుగా కని పించాడు . జాలి పడిన అర్జునుడు ఒక సంచెడు బంగారునాణెములుఇచ్చాడు. సంతోషముగా ఇంటికి వెళ్ళుచుండగా మార్గమధ్యములో ఒకదొంగ ఆసజ్జనుని కత్తితో బెదిరించి నాణెముల సంచిని లాక్కున్నాడు .

మరలా ఆపేద సజ్జనుడు యాచకుడి గా మారి భిక్షాటనచేయనారంభించాడు ఓరోజు అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్య పోయి, విషయము తెలిసికొని జాలిపడి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవింపుమని చెప్పాడు .

ఆసజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసికొని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి ఆ రాత్రి నిద్రించాడు . తెల్లవారి చూస్తే ఇంట్లో భార్యలేదు . అంతేకాదు ఆ కుండ కూడా లేదు . పరుగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు . భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు . కుండలో చూస్తే వజ్రం లేదు .

నదిలో నీళ్ళకోసం ముంచినప్పుడు నదీ ప్రవాహములో కొట్టుకు పోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ సజ్జనుడు మళ్ళీ యాచకుడుగా వీధుల్లోకి వెళ్ళవలసి వచ్చింది .

కృష్ణార్జునులు ఆతనిని చూసి ఏమైందని విచారించారు . ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు. లేదు . ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం అని సజ్జనుని చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టారు .

ఒకప్పుడు సంచెడు నాణేలు, ఎంతో విలువైన వజ్రం నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలు నా తలరాతను మారుస్తాయా నాపిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు .

దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిల లాడుతున్న చేపను చూశాడు . అతని హృదయము ద్రవించింది . నా దగ్గరున్న రెండునాణేలు నాతలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్లి ఒక నీటి తొట్టిలో వేశాడు .

కొద్ది సేపటికి ఆతని భార్య ఆ చేపను చూసి అయ్యో ! దీని నోటిలో ఏదో ఇరుక్కుంది అందుకే ఇదిఇలా గిలగిలా కొట్టుకొను చున్నదని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలసి ఆ చేప నోరు తెరవగా నదిలో పోగొట్టుకొన్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే 'దొరికింది దొరికింది చిక్కింది చిక్కింది నాచేతికి చిక్కింది ' అని గావుకేకలు పెట్టారు .

ఆ సయములో ఆతని ఇంటిలో దూరియున్న దొంగ ఆ సజ్జనుని చూసి భయంతో ఆసజ్జనుడు తననే కనిపెట్టా డని వణికిపోయాడు . ఆ సజ్జనుని దగ్గరకు వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు సంచి నీవు తీసుకో ; నన్ను మాత్రం రాజభటులకు పట్టివ్వ వద్దని బ్రతిమాలాడు. ఆ దంపతులు ఆశ్చర్యపోయారు . పోగొట్టుకొన్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని ఆనందపడినారు .

వెంటనే వెళ్లి ఈ విషయాన్ని కృష్ణా ర్జునులకు చెప్పారు .

'కృష్ణా ! నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేల సంచి , వజ్రం ఇచ్చినా అతని దశ తిరుగలేదు . నీ విచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పినాయి. ఇదెలా సాధ్యం?' అని ప్రశ్నించాడు అర్జునుడు .

శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చారు ....
'అర్జునా! అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాలు గూర్చి మాత్రమే ఆలోచించాడు . రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి - చెడు , కష్ట - సుఖములు గూర్చి ఆలో చించాడు . నిజానికి అది భగవంతుని పని . అతను దేవుని పనిని పంచు కున్నాడు కాబట్టి ఆతని కష్టములను అన్నిటిని నేను పంచుకున్నాను...' ✍️️

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సేకరణ

నాన్న...నాన్న ఉన్నపుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం.. ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు...నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం....

🙏 నాన్న.. 🙏

“నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.

నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...

ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో నాన్న..నాన్న..నాన్న అని మూడు సార్లు పిలవమంటారు.

కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు..

మూడోసారి మాట రాదు. గుండెలో బాధ , గొంతులో తెలియని నొప్పి , కళ్ళల్లో నీళ్ళు.

ఎందుకంటే...ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి.

ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు..

ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టిింది...కానీ...

ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది..మాత్రం...

“మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది.

మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి.

చివరగా ఎవరైనా నువ్వు ఏం సంపాదించావురా అని నాన్న ని అడిగేతే...నా ఆస్తి నా కొడుకురా అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది “

ఇవ్వన్నీ కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న ” అని పిలవాలని అనిపిస్తుంది.

కాని...అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా... అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.

So నాన్న ఉన్నప్పుడే తనని “నాన్న” అని ప్రేమగా పిలుద్దాం.
నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు....

నాన్న ఉన్నపుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం.
ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు...నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం.

అంత గొప్ప “నాన్న”అనే పదాన్ని కించపరచకండి.

“తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న” .
మారండి మారటానికి ప్రయత్నించండి మన తల్లి-తండ్రులను సుఖఃసంతోషాలతో ఉండేలాగా చేద్దాము!--...సముద్రం... 🙏🌹వారికి కృతజ్ఞతలు 🌹🙏

సేకరణ