Tuesday, March 22, 2022

బుథ్దుడు చెప్పిన జీవిత సత్యం. ఇదే స్వతహాగా ఉండటం.

బుథ్దుడు చెప్పిన జీవిత సత్యం.

ఒకసారి బుద్ధుడు ఒక ఊర్లోంచి వెళ్తుంటే,జనం వచ్చి అతని అవమానించారు. దూషించారు. దుమ్మెత్తిపోశారు. వారు ఎన్ని తిరస్కారమైన, అవమానకరమైన పదాలు వాడాలో అన్ని వాడారు. వారికి తెలిసిన నాలుగుపదాల తిట్లనీ ఉపయోగించారు. బుద్ధుడు అక్కడ నిలబడి, మౌనంగా, శ్రద్ధగా అంతా విని అప్పుడు అన్నాడు."మీరు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞుడిని. కానీ నేను తొందరపాటులో ఉన్నాను.నేను ప్రక్క ఊరికి చేరాలి. అక్కడ నా కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు మీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించలేను.కానీ రేపు నేను వెనక్కి ఇటుగానే వస్తాను. అప్పుడు నాకు ఎక్కువ సమయం ఉంటుంది. మీరు మళ్ళీ కూడివచ్చి - ఇంకేదైనా మీరు చెప్పాలనుకున్నది, ఈ రోజు ఇంకా చెప్పలేనిది మిగిలి ఉంటే - రేపు వచ్చి నాకు చెప్పవచ్చు. కానీ ఈ రోజు నన్ను క్షమించండ."

ఆ జనాలు వారి చెవుల్ని,వారి కళ్ళనీ వారు నమ్మలేక పోయారు.ఈ వ్యక్తి బొత్తిగా కలతపడకుండా ఉన్నాడు. అందులో ఒకరు అడిగారు మేము చెప్పింది, అన్నది నువ్వు వినలేదా?మేము నిన్ను ఎలా పడితే అలా తిట్టాం. నువ్వు దానికి ఏ మాత్రమూ జవాబు ఇవ్వలేదు!"

బుద్ధుడు అన్నాడు "ఒకవేళ మీరు జవాబు కోరినట్లయితే అప్పుడు మీరు చాలా ఆలస్యంగా వచ్చినట్లు అన్నమాట. మీరు పదేళ్ల క్రితం వచ్చినట్లయితే అప్పుడు నేను మీకు జవాబు ఇచ్చి ఉండేవాడిని. కానీ ఈ పదేళ్లుగా నేను ఇతరుల చేత ఆడించబడటం మానేసాను. నేను మరి ఇంక ఏమాత్రమూ బానిసను కాను. నేను నాకు యజమానని. నేను నా అంతరాత్మ చెప్పినట్లుగా చేస్తాను తప్ప ఇంకొకరి ఇష్టప్రకారం ఏమీ చేయను. నేను నా లోపలి అవసరం మేరకు చేతలు చేస్తాను. మీరు నన్ను దూషించలనుకోవడం, మీరు నన్ను తిట్టడం - ఇది పరిపూర్ణంగా మంచిదే. తృప్తి పడండి. మీ పని మీరు చాలా బాగా లోపరహితంగా, పరిపక్వతతో చేశారు. కానీ నాకు సంబంధించినంతవరకూ, నేను మీ అవమానాల్ని స్వీకరించలేదు. నేను ఆ దూషణలని తీసుకోనంత వరకూ అవి అర్ధరహితం."

ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు దానిని స్వీకరించేవారు అవ్వాలి. అతను ఏం చెప్పినా మీరు అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రతిక్రియ చేస్తారు. కానీ మీరు ఒకవేళ దాన్ని ఒప్పుకోకపోతే, ఒకవేళ మీరు కేవలం,సంబంధం లేనట్లుగా ఉంటే,ఒకవేళ మీరు సుదూరంగా ఉంటే,ఒకవేళ మీరు పట్టనట్లు ఉంటే, అతడు ఏం చేయగలడు?

బుద్ధుడు అన్నాడు "ఎవరైనా ఒక మండుతున్న కాగడాన్ని నదిలోకి విసిరి వేయవచ్చు. అది నది చేరేదాకా వెలుగుతూ మండుతూనే ఉంటుంది. అది నదిలో పడ్డ తక్షణం అంత మంటా పోతుంది. నది దాన్ని చల్లబరుస్తుంది. నేను ఓ నదిలా అయ్యాను. మీరు నాపై దూషణలని విసిరారు.అవి మీరు విసిరేటప్పుడు నిప్పులా ఉన్నాయి .కానీ అవి నన్ను చేరిన మరుక్షణం, నా చల్లదనంలో, వాటి మంటని కోల్పోయాయి. అవి మరింక ఏమాత్రమూ నొప్పించవు. మీరు ముళ్ళని విసిరారు. నా నిశ్శబ్దతలో పడి అవి పూలు అయ్యాయి. నేను నా సహజమైన స్వభావం నుంచి పనులు చేస్తాను."

ఇదే స్వతహాగా ఉండటం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment