Saturday, March 19, 2022

🌹 ప్రేమ, నేను ఇంకా బాగా ప్రేమించడం ఎలా ? తల్లిదండ్రులు - పిల్లలు - ప్రేమ 🌹 from book 🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺 🌷🌷

🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺
🌷 Part -- 1🌷
🌹 ప్రేమ 🌹

🌳 ప్రేమకి కారణం ఉండదు. కారణం ఉంటే అది నీ అవసరం అవుతుంది. ప్రేమలో Conditions, Rules ఉండవు. ప్రేమ కొన్ని క్షణాలు తగ్గడం, పెరగటం అనేవి ఉండవు.

🍁 ఖచ్చితంగా మిరెవరో మీకు తెలియకపోతే మీరు ప్రేమ కాలేరు. మిరు భయమౌతారు. ప్రేమ, భయానికి వ్యతిరేకం. ప్రేమకి వ్యతిరేకం ద్వేషం కాదు. ప్రేమని తిరగేస్తే ద్వేషం అవుతుంది.

🍀 ప్రేమలో మనిషి విస్తృతమౌతాడు, మనసు తెరచి ఉంటుంది, మనిషి విశ్వసిస్తాడు, మనిషి అదృశ్యమవుతాడు భయంతో మనిషి ముడుచుకునేవాడు. అనుమానిస్తాడు, ఒంటరి వాడవుతాడు.

🔺 నన్ను నేను ప్రేమించుకోవడం అంటే అర్థం ఏమిటి? 🔺

☘️ తన్ను తాను ప్రేమించడంతో మొదలు పెట్టకూడదు. ఎందుకంటే మీరెవరో మీకు తెలిదు. మీరు ఎవరిని ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరు ప్రేమించ లేకపోతే మీరు ఎవర్ని ప్రేమించ లేరు. మిమ్మల్ని మీరు ప్రేమించే ముందు మీరేంటో తెలుసుకోవాలి. అందుకు ధ్యానమే ముఖ్యం. ధ్యానం ద్వారా మనం ఎవరో తెలుస్తుంది కనుక!

💮 మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ధ్యానం అని అర్థం. నీతో నీవు ఉండడమే నిన్న నీవు ప్రేమించుకోవడం. శూన్య స్థితిలో, నిశ్శబ్దంతో ఉండడం.

🌲 సహజంగా శాంతిగా, మీతో మిరు, ఏకాంతంలో, నిశ్శబ్దంలో జీవించాలి. మీ మనసు లోతులోని దృశ్యాలనూ గమనిస్తూ ఉండండి. ఆలోచనలు మాయమయి, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంలో మీరు జీవితపు కొత్త కోణాలను దర్శిస్తారు. కామం, క్రోధం, విధ్వంసం, అత్యాస ఉండదు.

🌴 నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మిగిలిన వాళ్ళ సంగతేంటి? ఈ మొత్తం చరాచర సృష్టి విషయం ఏంటి? అంత చిన్నదా నీ ప్రేమ? నాలుగు గోడలకే పరిమితమైనదా నీ ప్రేమ? అయితే నీ ప్రేమకు రెక్కలు లేవు. అనంత ఆకాశంలో విహరించ లేదు. దానికి స్వేచ్ఛ లేదు.

🏵️ ప్రేమ అనేది మీ స్వభావం కావాలి, బంధం కాకూడదు. ప్రేమ విశాలంగా, విస్తృతంగా ఉండాలి. ప్రేమ మీ వ్యక్తిత్వం కావాలి, మీ ఉనికి కావాలి.


🌺
🌷 Part -- 2 🌷
🌹 నేను ఇంకా బాగా ప్రేమించడం ఎలా ?🌹

🌻 ప్రేమ ప్రేమగానే చాలు. ప్రేమ ప్రేమగా సంపూర్ణమైనది. అది మరే విధంగానూ సంపూర్ణత్వాన్ని పొందదు. మీరు ఎక్కువ ప్రేమించడం, తక్కువ ప్రేమించడం చేయలేరు.

☘️ ప్రేమని అర్ధం చేసుకోవలసింది ఒక శారీరక ఆకర్షణగా కాదు. అది కాంక్ష. కామం గుడ్డి ఆకర్షణ. మనం చేయవలసింది కామానికి, ప్రేమకి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేయడం. ప్రేమకు శరీరంతో, హర్మోన్లతో, రసాయనిక చర్యతో పని లేదు.

🌳 మీరు ప్రేమలో ఉన్నప్పుడు అనంతమైన ఆనందంతో ఉంటారు. అలౌకిక అనందంతో మీ ప్రతి అణువు నాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఆ ఆనందాన్ని పంచుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష మిలో తలెత్తుతుంది.

🏵️ మీరు నిజంగా ప్రేమను గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రేమ గురించి మరిచిపొండి, ధ్యానాన్ని గుర్తించుకోండి. ధ్యానం నిన్ను ప్రేమగా మార్చుతుంది.

🍁 మీరు ఎవరితోనైనా 'నేను ప్రేమిస్తున్నాను ' అని చెబితే మీరెప్పుడైనా దాని అర్థమేంటే ఆలోచించారా? అది రెండు శరీరాల మధ్య ఆకర్షణే. ఒక్కసారి మీ శరీర కాంక్ష తీరిన తర్వాత, మీరు చెప్పే ఆ ప్రేమంతా మాయమవుతుంది. అప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తారు. అది కేవలం ఆకలిలాగ, ఆకలి తీరిన తర్వాత యిక ఏమి ఉండదు.

🍀 ప్రేమనేది ఆధ్యాత్యికమైన అనుభవం. దానికీ, నీ లైంగికత్వానికి ఏ సంబంధం లేదు. మీ శరీరాలతో ఏ పనీ లేదు. అది నీ అంతర్గత ఉనికితో సంబంధం కలిగి ఉంటుంది.

🌴 మొట్ట మొదటి సారి ప్రేమ వచ్చినప్పుడు, మీ ఉనికిని అది నింపేసినప్పుడు, మీరు పూర్తిగా దాన్లో మునిగిపోతారు. ఏం జరుగుతుందో మీకు తెలిదు. మీ హృదయం పారవశ్యపు ఆనందంతో నిండిపోయిందని మీకు తెలుసు.

🌼 ఏ నియమాలు లేకుండా వూరికే ఇవ్వడం జీవితంలో గొప్ప అనుభవం. ప్రతిగా ఏమి ఆశించకుండా ఇవ్వడం -- గొప్ప ప్రేమికుడు నిజంగా అతడి ప్రేమను అంగీకరించిన వారి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటాడు.అతడి ప్రేమను తిరస్కరించిన కూడా!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




🌷 Part -- 3 🌷
🌹 తల్లిదండ్రులు - పిల్లలు - ప్రేమ 🌹

💮 తల్లిదండ్రులు, "పిల్లలను ప్రేమిస్తున్నాం మేము" అంటారు. కాని నాశనం చేసేది వారే. నిజంగా వారు పిల్లలను ప్రేమించినట్లయితే, వారు వారి పిల్లలని వారి ప్రతి రూపాల్లా తయారవ్వాలని అనుకోరు.

🏵️ ప్రతి పిల్లవాడికి వాడికంటూ ఒక లక్ష్యం ఉంటుంది. పిల్లలు, వారి తల్లిదండ్రుల ప్రతి రూపాలగా మారితే వారు వారిగా ఎప్పుడూ ఉండలేరు. అప్పుడు వారు సంతృప్తి చెందరు.

🌸 మీరు తల్లిదండ్రులు అయినంత మాత్రాన మీ బిడ్డ మిమ్మల్ని ప్రేమించాలని లేదు. మీరు ప్రేమించేలా ఉన్నారని నమ్మకం, నియమం ఏమీ లేదు. కాని అలా ఆశించడం జరిగింది. పిల్లలకు ఏం చేయాలో అర్థం కాదు. మీరు తన హృదయంలో లేకపోయినా నవ్వుతాడు, నటిస్తాడు. ప్రేమని, గౌరవాన్ని, కృతజ్ఞతని చూపించడం మొదలు పెడతాడు. అన్ని అబద్ధపు లక్షణాలే. కపటాన్ని నేర్చుకుంటారు.

☘️ ఎంత ఎక్కువగా నీవు ప్రేమను పంచితే, అంత ఎక్కువగా నీకు ఇవ్వగలుగే శక్తి వస్తుంది. మీరు ప్రేమను ఇచ్చినప్పుడు, దాని అంగీకరించిన వారి పట్ల గాఢమైన కృతజ్ఞతా భావంతో ఉంటారు.

🍀 ప్రేమ చెట్లకు, నదులకు, నక్షత్రాలకు అన్నింటికీ సందేశం ఇవ్వగలదు. ప్రేమ పూరితమైన దృష్టితో, చూపులతో, మీ స్పర్శతో ప్రేమని ఒక చెట్టుకి తెలియజేయవచ్చు. చిన్న పదం కూడా అవసరం లేదు. పూర్తి నిశబ్దంతో తెలియజేయవచ్చు.

🔺 ఈ ప్రేమానుబంధాలకు అతీతంగా వెళ్లడమెలా? 🔺

🌲 ప్రేమ వేదనను, పారవశ్యాన్ని రెంటిన్ని ఇస్తుంది.

🌳 ప్రేమ చెట్టయితే, దాని వేళ్ళు భూమిలో పాతుకుని ఉన్నాయి, అదే భాధ. అదే దాని వేదన. దాని కోమ్మలు ఆకాశంలో విస్తృతంగా, స్వేఛ్ఛంగా విహరిస్తూ ఉంటాయి. అదే దాని పారవశ్యం.

🌻 ఏ ఒక్కరూ ప్రేమాలో సంపూర్ణంగా ఉండలేరు. అది కలిగించే బాధ, దాన్ని వదిలేయమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఇదే ప్రేమికుడి ఆవేదన. ప్రేమికుడు ఉద్వేగంలో జీవిస్తూ ఉంటాడు.

🌼 ప్రేమ ముళ్ళనీ, పూలనీ రెండింటినీ ఇస్తుంది. ప్రేమ ఒక గులాబీ పొద. ఎవరికీ దాని ముళ్లు అవసరం లేదు, పూలు మాత్రమే కావాలి. కాని ముళ్లు, పూలు రెండింటినీ కలిగి ఉంటుంది, గులాబీ పువ్వు. రెండూ కలిసే ఉంటాయి. ఒకే శక్తి యొక్క రెండు వక్తీకరణలు.

🔹 నిజానికి సెక్స్, ప్రకృతి తన మనుగడ కోసం ఏర్పరచిన ఉపాయం. అది ప్రకృతి సహజం కాకపోతే సెక్స్ పట్ల ఉత్సాహం ఎవరూ చూపరు.

🌿 ఏ శక్తి అయితే నిన్ను క్రిందకు లాగుతుందో, ఆ శక్తే పైకి కూడా తీసుకెళ్ళగలదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



సేకరణ

No comments:

Post a Comment