Sunday, March 20, 2022

కవిత, మనసువెన్నెల్లో......ఓ చెలి....

మనసువెన్నెల్లో......

ఓ చెలి
ఎవరు పిలిచారని
ఆ ముసిముసి నవ్వులు
ఎవరిని తలిచి
ఎరుపెక్కింది నీ బుగ్గలు

కొమ్మలోని నన్ను చూడవే
పూసిఉన్న నన్ను తుంచవే
ఆ దేవుడి పాదాలు నేను చేరితే
నాకు కలిగే ఆ సంతృప్తి
నీ మనసులోని మనసును
తలవగానే కనిపిస్తున్నది నీలో

ఇంకా ఎన్నాళ్ళు ఇలా
నీలో నువ్వే నవ్వుకుంటూ
నీతో నువ్వే మాట్లాడుకుంటూ
నాతో ఈ ముచ్చట్లు పంచుకుంటూ

పరిచయం చేయవా ఆ మనసును
మా ఎదురుగా రానివ్వవా నీ మన్మధుడిని
నీ గుండె చప్పుడైన ఆ ప్రాణాన్ని
మాకు చూపించవా

నీ మనసులో వెన్నెల కురిపించిన
ఆ చందమామను వెంటనే చేరుకోవే చెలీ
నిండు జాబిలిలా నువ్వు వెలిగిపోవే నా నెచ్చేలి

🌹 మిత్రులు అందరికి శుభ రాత్రి🌹

సేకరణ

No comments:

Post a Comment