Sunday, March 20, 2022

మంచి మాట..లు

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

ఆత్మీయబంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు... ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవణుడి అనుగ్రహం తో.. మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...

20-03-2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట..లు

ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం.. లేనిది ఉన్నట్లు చెప్పేవారిని దేగ్గెర చేసుకుంటాం..మనం నిజం తెలుసుకునేలోపే నిజం చెప్పేవాళ్ళును దూరం చేసుకుంటున్నాము...

ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది
ఇంటికి దూరంగా వెళ్తే నాన్న తోడు విలువ తెలుస్తుంది
అన్ని దాటుకొని ముందుకు వెళితే జీవితం విలువ తెలుస్తుంది

ఎవరికైనా నమస్కారం చేయాలని అనిపిస్తే ముందు మన తల్లి కి చేయాలి
ఎవరికైనా గౌరవం ఇవ్వాలంటే ముందు మన తండ్రి కి ఇవ్వాలి.. జీవితంలో వారిని మించిన వారు ఎవరు ఉండరు.. ఉండకూడదు కూడా

ఒకరిగురించి ఒకరం మాట్లాడుకునేకంటే.. ఒకరితో ఒకరం మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిస్కారం లభిస్తుంది.. చెప్పుడు మాటల బాధ తప్పుతుంది

సేకరణ ✒️ AVB సుబ్బారావు 📱9985255805🇮🇳

సేకరణ

No comments:

Post a Comment