లోపల ఖాళీగా ఉండాలంటే?.
చూస్తా ఉండాల...." అంటూ శూన్యంలోకి చూస్తూ మౌనం వహించారు గురువుగారు...
*
సద్గురు నోట "చూస్తా ఉండాల" అనే చిన్న మాట
నాకది గొప్ప ఆధ్యాత్మికోపదేశంగా అనిపించింది.
చూస్తా ఉండాల....(సాక్షిగా)
దేనినీ ఖండించడంగానీ,
దేనినీ సమర్థించడంగానీ
దేనికీ ఆశ్చర్యపోవడంగానీ
దేనికీ విచారించడంగానీ
చేయకూడదు...
ఉన్నదానిని ఉన్నట్లుగా(యధాతధంగా) చూడగలిగితే అదే స్థితప్రజ్ఞత.
ఏది ఎలా ఉండాలో అది అలానే ఉంటుంది....
ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవడమే
అన్ని ఘర్షణలకు మూలం.
సృష్టిలో ప్రతీది సహజంగా, పూర్ణంగా ఉన్నది.
మార్పు తేవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా లేదు. అంతా సహజంగా ఉంది...అంటారు గురువుగారు.
తీర్పుతీర్చకుడి...అన్న క్రీస్తు వాక్యం నాకు చాలా ఇష్టం...
అనవసరమైన విషయాల్లో involve అయిపోవడం...
యెదుటవాడు అడక్కపోయినా ఉచిత సలహాలిచ్చేయడం...
ఇతరుల గొడవల్లో తలదూర్చి తీర్పు చెప్పడం...
వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అంటూ తటాలున statements ఇచ్చేయడం...
ఇవన్నీ బ్యాటరీని(ఆత్మశక్తిని) Waste చేసుకునే పనులే...
అనవసరమైన తలంపు కలిగినా,
అనవసరమైన మాట పలికినా...
వెంటనే బ్యాటరీ వేస్ట్ చేసుకోకు, బ్యాటరీ వేస్ట్ చేసుకోకు...అనుకుంటూ తనను తాను తమాయించుకోవాలి(control చేసుకోవాలి).
ఇలా అనుకుంటూ ఉంటే,
అవసరమైనప్పుడు తప్ప అనవసర విషయాలకంతా మనసు, వాక్కు వ్యక్తం కావు...
స్వస్థానంలో అవి హాయిగా ఉంటాయి...
అలా వాక్కు, మనసులను వీలైనంతవరకు వాటి స్వస్థానంలో ఉంచగలిగేటట్లు జీవించగలిగే
టెక్నిక్ నే "కర్మసుకౌశలం" అన్నారు గీతలో కృష్ణభగవానులు.
నీళ్లలో పడవ ఉండొచ్చు పడవలో నీళ్లు ఉండకూడదు...అన్నారు రామకృష్ణులు.
మనం విషయాల్లో ఉన్నా
మనలో విషయాలు ఉండకూడదు.
లోపల "ఖాళీ"గా ఉండాలి...
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment