శుభోదయం మిత్రులారా!!
దేవుడు ఎక్కడో ఉండడు, భగవంతుడి స్థానం మన మనస్సు. దైవ మందిరాన్ని యెంత పవిత్రంగా ఉంచుతామో, మనస్సనే మందిరంలో దైవం కొలువుండాలంటే, అది అంతే పవిత్రంగా ఉంచాలి .. కాని, మనం ఏమి చేస్తాం ? ఈర్ష, అసూయ, ద్వేషం, వైరం, కుళ్ళు, కుతంత్రం...ఇవన్నిటినీ మోసుకు తిరుగుతూ వ్యాపింప చేస్తాం. చెప్పండి. ఇటువంటి దుర్గంధపూరితమయిన వాతావరణంలో దైవం ఎలా ఉంటారు ? అసంభవం... అందుకే 'నాది ... నాది ... అని తపించే వాళ్లకి ఏదీ మిగలదు . నిజానికి ఏది నాది? అశాశ్వతమయిన ఈ జీవితంలోని ప్రతీ క్షణంలో ఏదీ నాది కాదు. ఈ నిముషంలో నాతొ ఉన్నవారు మరునిముషంలో ఉండరు. రాబోయే గంటలో నా జీవితం ఏ మలుపులు తిరుగుతుందో నాకు తెలీదు. కనిపించే అందరూ, వాళ్ళ మమతలు, పగలు, అసూయలు... అన్నీ అశాశ్వతమే. మరి మనం పుట్టింది ఎందుకు ?వీటన్నిటికీ అతీతమయిన, శాశ్వతమయిన దైవాన్ని తెలుసుకోవడానికి అమృతమయమయిన దైవ ప్రేమను అనుభూతి చెందడానికి. కాని, 'నేను, నాది' అనే మాయ పొర మనకు, దైవానికి మధ్య అడ్డుతెర. ఆ తెర తొలగించి, ఒక్క సారి కనిపించే అందరిలో, అన్నిటిలో దైవం కొలువున్నారన్న నిజాన్ని దర్శించగలిగారా ... ఇక మీ జీవితం ధన్యం.
🙏🙏🙏🙏🙏
సేకరణ

No comments:
Post a Comment