స్వామి ఉపదేశాలు!భక్తులకేగాదు అందరికీ!!
"ముందు నిన్ను నీవు బాగుచేసికో"!!
1. స్వామి: బంగా రూ! నీవు సాయి సంస్థ లో అడుగుపెట్టింది నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి కానీ ఇతరుల బాగోగుల గురించి కాదు. ఇతరులు ఎలా ఉన్నారు అనేది నీకు అనవసరం.నీవు ఎలా ఉండాలనేది అవసరం క్లాసులు బాగా చదివి ప్రాక్టీస్ చేస్తే నీకు ఉపయోగం ఇతరులు చదవడం లేదని నీవు మానేస్తే నీకే నష్టం..
2. పంచదార ఇసుక కలిపిన మిశ్రమంలో నుండి చీమలు పంచదారను స్వీకరించి ఇసుకను వదిలేస్తాయి. గులాబీ మొక్క దగ్గరకు వెళ్ళినప్పుడు ముల్లు తగులకుండా గులాబీ పువ్వులు కోసుకున్నావు కదా !అలాగే నీవు ఇతరులలోని మంచినీ స్వీకరించు అక్కరలేనివి పట్టించుకోకు. అప్పుడు నీ మనసు స్వచ్ఛంగా తయారై సాధనకు సహకరిస్తుంది.
3.స్వామి: ఒకటి గుర్తుంచుకోండి మీరందరూ ప్రపంచమనే స్టేజీపై మీ పాత్రలో నటిస్తున్నారు. మీరు నటించేటప్పుడు ఇతరులు ఎలా నటిస్తున్నారా అని ఆలోచించరు కదా! మీరు మీ పాత్రను ఎంత బాగా నటించాలో దానిపైనే దృష్టి పెట్టాలి. అలా కాకుండా ఇతరుల పాత్రలపై దృష్టి పెట్టినప్పుడు మీ పాత్ర చెడి పోవడమే కాకుండా భగవంతుడైన డైరెక్టర్ యొక్క మన్ననలను పొందలేరు.
4. ఒక సేవాదళ సభ్యుడు తమ మందిరంలోని సభ్యుల ప్రవర్తన సరిగా లేదని భావించేవాడు. ఒక సందర్భంలో స్వామి అతన్ని పిలిచి ఇలా అన్నారు."బంగారు నేను సత్యసాయి సంస్థను ఎందుకు స్థాపించాను తెలుసా? అది ఒక పడవ లాంటిది. దాంట్లో కూర్చుంటే నీవు సుఖంగా తీరం చేరుతావు. కానీ ఆ పడవను నెత్తిన పెట్టుకుంటే అదే నిన్ను ముంచుతుంది" అన్నారు..
అంటే సంస్థలో మనం నీటిలో తామర లాగా మన సాధన చేసుకుంటూ ఉంటే పడవలో కూర్చుని ఉన్నట్లే. అట్లు కాకుండా సంస్థ లోనూ,సభ్యుల లోను లోటుపాట్లు చూస్తూ విమర్శనా దృష్టితో ఉంటే పడవను నెత్తి మీద పెట్టుకున్నట్లే కదా!.
5. స్వామి::నీ హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటేనే మీ సాధన సక్రమంగా జరుగుతుంది అందుకోసం నీవు ఇతరుల గురించి నెగటివ్ గా ఆలోచించడం మాని వేయాలి.
ఎవరి ప్రవర్తన అయితే బాగా లేదని నీవు అనుకుంటున్నావో వారితో నీవు గడిపేది కొద్ది గంటలు లేదా కొద్ది రోజులు మాత్రమే.కానీ వారిపైన నీకు కలిగిన ద్వేషము క్రోధము నీలో స్థిరంగా నాటుకుపోయి నీ హృదయాన్ని కల్మషం చేస్తుంది. కల్మషం అయిన హృదయంతో ఎన్నటికీ ఆధ్యాత్మిక సాధన చేయలేవు".
6.ప్రశాంతి నిలయంలో వ్యక్తులు పరిస్థితులు మనకు ముఖ్యం కాదు దానిని స్వామికే వదిలివేయాలి. మన వరకు మనం బాగా ప్రవర్తిస్తున్నామా? లేదా ?అనేది ప్రధానం. స్వామి చెప్పారు కదా." Do your best.I will do the rest. స్వామి మన అందరి నుంచి very good performance ఆశిస్తారు.
7. ప్రశాంతి నిలయంలోని ఒక ప్రముఖ వ్యక్తి స్వామితో "స్వామీ! ప్రశాంతి నిలయంలోని అన్ని చోట్ల సభ్యుల ప్రవర్తన దురుసుగా ఉంటున్నది తాము ఇబ్బందులు పడవలసి వస్తున్నది "అని భక్తులు అంటున్నారు అని చెప్పినప్పుడు,
స్వామి"వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అటువంటి పరిస్థితులను తానే కల్పించాలని పుట్టపర్తి ఆశ్రమంలో తన ప్రమేయం లేకుండా ఏదీ జరగదని "అన్నారు. ఇంకా స్వామి ఏమన్నారంటే"పుట్టపర్తి ఆశ్రమం లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు ,మనుషుల్ని స్వామి ఒప్పుకుంటేనే అలా ఉంటుంది" అన్నారు.
ఎందుకంటే అప్పటి ఆ పరిసరాలు మనుష్యులు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి సాధనకు తోడ్పడుతుందని స్వామి భావించబ ట్టే,అటువంటి పరిస్థితులను స్వా మే కల్పించారన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి మనలను ఎప్పుడూ కోపగించుకుంటూ ఉన్నారనుకోండి. స్వామే అటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసి మనకు ఆ కోపాన్ని తట్టుకునే శక్తి ఉందని స్వామి చెబుతున్నారన్నమాట.
కనుక మనం ఆశ్రమంలో కానీ మరి ఏ చోట అయినా ఎవరిని విమర్శించే అవసరం లేదు. ఎందుకంటే అటువంటి వ్యక్తులను ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం స్వామే కాబట్టి..
ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినా మనం అది స్వామి ప్రసాదంగా స్వీకరించాలి అని స్వామి చెప్పేవారు. ప్రసాదం రుచిగా ఉందా? లేదా ?అని మనం చూ డం కదా ! ఎలా ఉన్నా అది భగవంతుని చేత ప్రసాదించ బడిందని ఆనందంగా స్వీకరిస్తాం.
Everything is for our own good.. అంతా మనమంచి కోసమే అని ఆలోచించటం ఉత్తమమైన సాధన..
8. చివరిగా స్వామి సందేశంతో కూడిన ఉదాహరణ.
స్వామివారి అరవయ్యవ జన్మ దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రగాఢ భక్తులైన చార్లెస్ పెన్" స్వామీ! తాము సుమారు నూరు సంవత్సరాలు ఈ అవతారంలో ఉంటారు అని అందరూ అంటుంటారు ఇప్పటికీ స్వామికి 60 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక మిగిలింది 40 సంవత్సరముల కాలం మాత్రమే కదా! కానీ ఇంకా ప్రజలలో ఎలాంటి పరిణామ పరివర్తనలు రాలేదు కదా! అన్నాడు.
అప్పుడు స్వామి వారు" *ముందు నీవు మారు. నీలో పరివర్తన తెచ్చుకో! సమయం వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కరిని మారుస్తాను"* అని చెప్పారు..
ఇది అందరి కోసం స్వామి చెప్పిన అద్భుతమైన సందేశం...
అందరికీ సాయిరాం
దిట్టకవి శ్రీనివాసాచార్యులు.
No comments:
Post a Comment