Saturday, June 25, 2022

అశాంతికి మన మనసే కారణం.

🕉 శ్రీ గురుభ్యోనమః


నీవు ఇతరుల మీద ఆధారపడకుండా, నీ కృషి ఏదో నీవు చేసుకుంటూ వ్యవహారంలో, ఆహారంలో, నిద్రలో తగుమాత్రంగా ఉంటూ నన్ను ఎరుకలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి అని భగవంతుడు చెపుతున్నాడు. మన ఇంట్లో వారి వలన, బయట పరిస్థితుల వలన మనకు కొంత అశాంతి రావచ్చు కానీ అవి స్వల్ప విషయాలు. అవి రూపాయికి 5 పైసలు మాత్రమే! మిగతా 95 పైసల అశాంతికి మన మనసే కారణం. దుఃఖం శరీరంలో లేదు. మనస్సులో ఉంది. మనం ఒక ప్రక్క మనోనాశనానికి కృషి చేస్తూ, రెండో ప్రక్క తత్త్వ జ్ఞానం పొందటానికి కృషి చేస్తూ ఉంటే అప్పుడు తరిస్తాము. భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే నీ మనస్సు శోధింపబడుతుంది. అప్పుడు మనస్సులో ఉన్న మలిన వాసనలు పోతాయి.

🙏 సద్గురు శ్రీ రమణ మహర్షి 🙏

సేకరణ

No comments:

Post a Comment