Tuesday, June 28, 2022

ప్రాణాయామం, నామజపం ఫలితాలు ఏవిధంగా లభిస్తాయి ?

💖💖💖
💖💖 "262" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"ప్రాణాయామం, నామజపం ఫలితాలు ఏవిధంగా లభిస్తాయి ?"


మనసుకు శీలం అలవర్చకుండా చేసే ధ్యాన ప్రయత్నం కేవలం యాంత్రిక ప్రక్రియ మాత్రమే. ప్రాణాయామమైనా, శ్వాసమీద ధ్యాస అయినా, నామజపమైనా మనసు అనే రథానికి వేసే కళ్ళెం లాంటివి. అదే ప్రయాణం కాదు. అంతర్ ప్రయాణాన్ని సజావుగా సాగించే ఉపకరణాలు మాత్రమే. ధ్యాన విధానాలు ఎంత మంచివైనా మనకి సచ్ఛీలం అనే అర్హత అవసరం. మాటవినని పిల్లవాడిని తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతారు. నేరం చేసిన వ్యక్తిని చట్టం జైలుకు పంపుతుంది. ఇదంతా మనోప్రవృత్తి మారటానికే. అలాగే ప్రతి సాధనా ప్రక్రియ మనలో సద్గుణాలను పెంచి శాంతిని అందించేందుకే. శాంతిని కాకుండా ఇతర ప్రలోభాలను ఎరగా చూపే సాధనా ప్రక్రియలు ఆధ్యాత్మికత అనిపించుకోవు !!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment