Thursday, June 23, 2022

ఒక్కోచోట ఒక్కో దేవుడు మహిమాన్వితుడుగా ప్రచారం జరుగుతోంది, అలా దేవుళ్ళను మారుస్తూ ఆరాధించటం మంచిదేనా ?

"శ్రీ"
"258" "శ్రీరమణీయం"

"ఒక్కోచోట ఒక్కో దేవుడు మహిమాన్వితుడుగా ప్రచారం జరుగుతోంది, అలా దేవుళ్ళను మారుస్తూ ఆరాధించటం మంచిదేనా ?"


పూజించే దేవుడ్ని మార్చటంలో దైవం అంటే ఏమిటో తెలియని అజ్ఞానం దాగివుంది. అందులో మన స్వార్థం వ్యక్తమవుతుంది. దైవాన్ని కూడా మనలాంటి సంకుచిత భావాలతోనే ఊహిస్తున్నాం. అలా ఆలోచించినా ఏదోక రోజు తనని ఇలాగే వదిలివేస్తారని మనం పట్టుకున్న కొత్త దేవుడికి మాత్రం తెలియదా ! ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం దైవంగా మనతో ఉండి మన కోర్కెలు తీరుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించలేకనే దేవుని విషయంలో కూడా అనేక రూపాలు, తలపులు మారుస్తున్నాం ! నిజానికి ధ్యానం అంటే బయటి నుండి దేన్నీ ఆశించకపోవటం. ఈ సృష్టికి ఆధారభూతంగా ఉన్న దైవం మనలోనూ 'ఆత్మగా' ఉన్నాడన్న సత్యం అనుభవంలోకి రావటం ధ్యానం. అంతేగాని కోరికలు తీరటంలేదని, పూజించే దేవతా మూర్తులను మారుస్తూ, కళ్ళు మూసుకోవటం భక్తి అనిపించుకోదు !!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment