Monday, August 15, 2022

మంచి మాట..లు(15-08-2022)

 ఈ రోజు AVB మంచి మాట..లు
సోమవారం --: 15-08-2022 :--

భారతీయులందరికి
75వ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు మన గొప్ప జాతి సేవకు మన జీవితాలను పునరంకితం చేద్దాం భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించే వాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించే వాడికి ఆనందం ఉంటుంది .

ఒక మనిషి వేరోక మనిషిని ఒక జాతి ఇంకొక జాతిని ఒక వర్గం మరో వర్గాన్ని దోపిడి చేయని సమాజం రావాలి. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకూ ప్రేమించడం రాదు, ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు,,ఏది ఏమైనా ఎవరు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ సమాజానికి డబ్బే ప్రధానం

ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు మళ్ళీ వారికి చెడు చేయనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్ట వచ్చు,,కాసేపటి తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మల మౌతుంది, కానీ అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది .

*సేకరణ ✍️మీ ... AVB సుబ్బారావు 🇮🇳

No comments:

Post a Comment