Friday, August 19, 2022

మంచి మాట..లు(19-08-2022)

శుక్రవారం :-19-08-2022
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు  
ఈ రోజు AVB మంచి మాట..లు 
పదవిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు పతంగిలా ఎగురుతాడు, దారం తెగితే కానీ అర్థం కాదు, నా ఆధారం నా నడవడిక పైనే ఆధారపడి ఉందని,,

జీవితంలో ఒకటి గుర్తుంచుకో, పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు, లేకుంటే ప్రతి అడ్డగాడిదకు అలుసైపోతావ్,,

అహం ఎక్కడైతే ప్రారంభమౌతుందో, పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది, అందుకే పదవి, పలుకుబడి చూసుకొని అహంకారంతో విర్రవీగకూడదు,,
             
ఇవ్వడం నేర్చుకో,  తీసుకోడం కాదు, సేవ అలవరుచుకో,  పెత్తనం కాదు, నేను నిమిత్తమాత్రుడను, ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, అనే తలంపుతో చేయి..

కలియుగంలో తపస్సు చేయడమంటే సత్యము పలకడమే,
నీకోసం చప్పట్లు కొట్టే 10 వేళ్ళ కన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న...

 సేకరణ ✍️AVB సుబ్బారావు    🤝

No comments:

Post a Comment