Monday, August 22, 2022

మంచిమాట.. లు(22-08-2022)

సోమవారం: 22-08-2022
ఈ రోజు AVB మంచిమాట.. లు
ఒకరిని సహాయం అడిగేముందు పూర్వం మనం ఎవరికైనా సహాయం చేశామా సహాయం చేయగలిగి ఉండి, అని ఒకసారి ఆలోచించుకోండి, అందరి మనస్తత్వం ఒకేలాగా ఉంటుంది, సహాయం చేయగలిగినప్పుడు గొప్పగా అనుకోవటం,సహాయం పొందలేనప్పుడు సమాజాన్ని తిట్టుకోవటం మంచిది కాదు మిత్రమా

లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాలలో కూడా పది రకాలుగా తప్పులు తిసే రకం . సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దాన్నికన్న ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .

ఒకప్పుడు ఒక్కరు బాగుపడితే వారిని చూసి పది మంది బాగు పడాలి అనుకునే వారు , అదే ఇప్పుడు ఒక్కరు బాగుపడితే అదే పదిమందిని ఎలా తోక్కేయాలి అని చూస్తున్నారు , ఇదే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా ! .

ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం , ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం .

మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు , అపహాస్యం మాత్రం చేయకూడదు , ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి .

క్యాలెండర్ లో పేజీలు మాత్రమే ఉంటాయి కాలం గడిచిపోతుంది. కాలంలోవెనకకు తిరిగి చూస్తే మనం చేసిన ఏదైనా మంచి పనులు కానవస్తున్నాయా, ఒకసారి సరి చూసుకోండి..
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 💐🤝9985255805

No comments:

Post a Comment