🙏🕉🙏 ....... "శ్రీ"
"61"
"కర్మ - జన్మ"
🌼🌼🌼🌼
🌼🕉🌼
🌼🌼
🌼
"ఈ క్రింది 3 రకాల మనుషుల్లో మనం ఏ రకం నుంచి ఏ రకానికి ఎదుగితున్నాం అని ఆత్మపరిశీలన చేసుకోవాలి."
మనుషుల్లో రకాలు
దేవ మనుషులు:
"ఇతరుల సౌఖ్యం కోసం తమ సౌఖ్యాన్ని పణంగా పెట్టేవారు. వీరు ముక్తి మార్గంలో ఉన్నవారు."
మనుషులు:
"తమ సుఖాన్ని చూసుకుంటూ ఇతరుల సుఖాన్ని చూసేవారు. వీరు మళ్ళీ మనిషి జన్మని ఎత్తుతారు."
అసుర మనుషులు:
"తమ సుఖం కోసం ఇతరుల సుఖాన్ని చెడగొట్టేవారు. వీరు జంతువులు లేదా పురుగులు లాంటి నీచ జన్మలని పొందుతారు."
అనుసరణీయం
"అమెరికన్ లీడర్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఇరవై ఏడవ ఏట, తన జీవితాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకోసం పన్నెండు నీతి సూత్రాలని ఓ కాగితం మీద రాసుకుని వాటికి అణుగుణంగా తన నడవడికని మార్చుకోవాలని విశ్వప్రయత్నం చేయసాగాడు."
"ఎప్పుడైనా ఏ నీతి సూత్రాన్ని అతను ఉల్లంఘించినా, దాని ఎదుట ఓ నల్లని చుక్కని అందుకు గుర్తుగా ఉంచసాగాడు. అతని లక్ష్యం ఏ నీతి సూత్రం ముందూ నల్లటి చుక్క ఉండని రోజు రావాలని."
"ఆయన కఠినంగా పాటించిన ఈ పద్ధతి వల్లనే ఫ్రాంకిన్ గొప్ప రాజకీయవేత్త, ప్రచురణకర్త అయి కొన్ని కొత్త వస్తువులని కూడా కనిపెట్టాడు. కర్మ క్షయానికి ఇదో చక్కటి దారి."
మనుషులు చేసే దుష్కర్మలు మూడు రకాలు
"1. తన శరీరానికి చేసుకునే దుష్కర్మలు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఉపయోగించడం, అలవిమాలిన శారీరక శ్రమ చేయడం మొదలైనవి."
"2. ఇతర జీవులకి చేసే దుష్కర్మలు."
"3. తను జన్మించిన ప్రపంచంలోని వాటిని నాశనం చేయడం. అడవులు ధ్వంసం మొదలైనవి."
దుష్కర్మలకి దూరం
"శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చక్రాల వాహనాల్లో ప్రయాణించరని చాలామందికి తెలుసు, కాని కారణం అందరికీ తెలీదు."
"ఓ సారి వారు రోడ్డు మీద వాహనాల చక్రాల కింద పడి నలిగి మరణించిన వివిధ జీవులని చూసి, ఇక వాహనంలో ప్రయాణించడం మానేసారు. తమ వాహనం కింద పడి మరణించిన జీవుల మరణం తాలూకు పాపం ఆ వాహనంలో ప్రయాణించే వారికి చుట్టుకుంటుంది."
"ఈ సంగతి వారికి తెలీకపోయినా సరే. వారి దేహ బరువు కూడా ఆ వాహన బరువుని పెంచి అందుకు కారణం అవుతుంది కదా. పైగా వారి దేహాల ప్రయాణానికే అసలా వాహనం ప్రయాణిస్తుంది."
"ఈ విధంగా అప్పటి నించి స్వామి వారు చక్రాల వాహనాలైన కారు, బస్సు, రైలు లాంటివి స్వామి వారు ఎక్కలేదు. కాలి నడకన, పల్లకీలో లేదా పడవలో మాత్రం ప్రయాణించేవారు. వాటివల్ల ఏ జీవికి భయం లేదు కదా."
"మనం చేసే కర్మల ద్వారానే మనం రక్షింపబడేది. లేదా శిక్షింపబడేది. మనిషిని ఉద్ధరించేది లేదా పతనం గావించేది అతని కర్మలే తప్ప ఇంకేం కావు."
🌼🌼🌼
🌼🕉🌼
సేకరణ
No comments:
Post a Comment