🪔🪔ప్రార్ధన .... తపన:🪔🪔
🍁ధన, కనక, వస్తు , వాహనములు ఇమ్మని కాదు.
అవి వచ్చి పోయేవి. మనము శాశ్వతమైన దాని కోసం ప్రార్థించాలి. ఆడంబరం లేకుండా నిరాడంబరంగా చేయాలి.
🍁హృదయస్పూర్తిగా చేయాలి. దేహము శుభ్ర పరచడానికి స్నానం చేయాలి.
అలాగే మనస్సు శుద్ధి చేయడానికి ప్రార్థన ముఖ్యం.
🍁ఇది మనస్సులోని మలినములను తొలగిస్తుంది. హృదయము నుండి వచ్చే ప్రార్థన, లోపల శుభ్రము చేస్తుంది. మహర్షులు, తపస్స్వులు, భక్తులూ అందరూ భగవంతుని ప్రార్థిస్తారు. దైవం యొక్క అవతరణ కూడా ప్రార్థన వలనే జరుగుతుంది.
🍁ప్రార్థనలను భృహమ్ అని పిలిచెదరు. ఆ పదము "బృహ్" అను ధాతువు నుండి పుట్టినది. బృహ్ అనగా ఉన్నత స్థితికి చేర్చుట అని అర్థము.
🍁దీనిని బట్టి మానవులను ఉన్నతోన్నత స్థితులను అనగా మోక్షము వరకు చేర్చి భగవంతుని సన్నిధానమును కల్పించునది ప్రార్థన. ప్రార్థన మనము తినే ఆహారమును పరిశుద్ధము చేస్తుంది.
🍁శారిరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగించుటకు ప్రార్థన దివ్యోషదము.
🍁 మన దినచర్య ప్రార్థనతో ప్రారంభము కావలెనని, మన కర్మలన్నియు ప్రార్థన రూపమున సాగవలెననియు, మన ఆహార, విహారములు సైతము ప్రార్థనతో కూడి యుండవలెననియు, దైనందిని కార్యక్రమములన్నియు ప్రార్థనతో ముగియవలెను.
🍁ఇదే "సమస్త లోకా సుఖినోభవంతు" అనేది శ్రేష్టమైన, ఉత్తమమైన ప్రార్థన.
దీని అర్థం ఏమనగా కేవలం తన స్వార్థాన్ని, తన సుఖాన్ని, తన ఆనందాన్ని మాత్రమే ఆశించకుండా జగత్తు యొక్క కళ్యాణాన్ని మరియు ఆనందాన్ని ఆశించే ప్రార్థన చేయాలి.
🍁హృదయములేని ప్రార్థన కంటే మాటలు లేని హృదయమే మేలు. పెదవుల మీద నుండి వచ్చే మాటలు ఎన్నటికీ ప్రార్థనలు కావు.
🍁హృదాయాంతరాళము నుండి వచ్చేదే నిజమైన ప్రార్థన.
🍁అట్టి ప్రార్థనకే భగవంతుడు పలుకుతాడు.
🍁 వశుడవుతాడు.
ప్రార్థన అంటే ఒకరిని యాచించటం కాదు.
🍁ఆత్మ పడే తపన.
🍁ప్రార్థనలనగా మాటల పరిశ్రమ అంతకంటే కాదు.
🍁హృదయములోని దివ్యత్వమును మేలుకొలిపేందుకు పడే తపన యే ప్రార్థన.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🍁హృదాయాంతరాళము నుండి వచ్చేదే నిజమైన ప్రార్థన.
🍁అట్టి ప్రార్థనకే భగవంతుడు పలుకుతాడు.
🍁 వశుడవుతాడు.
ప్రార్థన అంటే ఒకరిని యాచించటం కాదు.
🍁ఆత్మ పడే తపన.
🍁ప్రార్థనలనగా మాటల పరిశ్రమ అంతకంటే కాదు.
🍁హృదయములోని దివ్యత్వమును మేలుకొలిపేందుకు పడే తపన యే ప్రార్థన.
No comments:
Post a Comment