Tuesday, August 23, 2022

మంచి మాట..లు

మంగళవారం --: 23-08-2022:--

ఇది నా పలకరింపు మాత్రమే కాదు ఉదయం నిద్ర లేవగానే మీ అమూల్యమైన పరిచయం మీ అపురూపమైన స్నేహం గుర్తుకొచ్చాయని నా భావన. .

సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము
కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది ఇతరుల మనసులో మనం మాయని మచ్చలా కాకుండా గాయాన్ని మటుమయం చేసే ఔషదమై ఉండగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి ఈ జీవితానికి .

ఒక మనిషి నచ్చాలంటే అతన్నిలో ఉండావల్సింది అందమైన ముఖం కాదు ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసు ఉండాలి , మనం పిలిచే పిలుపు ఎదైనా ఎదుటి వారికి ప్రేమగా ఉండాలి బంధం ఎదైనా అనుబంధంగా ఉండాలి , మనలో విబేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా చిరుస్థాయి ఉండాలి .

మన్నల్ని ఆపదలో ఆదుకున్న ఆప్తున్ని మనం బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను పంచుకునే బందువుని మనకు సలహానిచ్చే సన్నిహితుడిని , మన మేలుకోరే మిత్రున్ని , మనకు దైర్యాన్ని ఇచ్చే స్నేహితున్ని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఎప్పుడూ వారిని దూరం పెట్టోద్దు .

సేకరణ

No comments:

Post a Comment